2024లో విడుదలైన సాంగ్స్‌లలో టాప్-10 లిస్ట్‌ను యూట్యూబ్ అధికారికంగా ప్రకటించింది.అందులో ఇండియా నుంచి ఒక సాంగ్ మాత్రమే ఉంది.ఇండియా నుంచి ఆ జాబితాలో నిలిచిన ఏకైక పాట ‘కుర్చీ మడతపెట్టి’ అని ప్రకటించింది.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమలకు సంబంధించి ఏడాది ఎన్నో పాటలు విడుదలైన విషయం తెలిసిందే.‘కుర్చీ మడతపెట్టి’ పాట టాప్‌లో నిలవడంపై సంగీత దర్శకుడు తమన్, నటి శ్రీలీల ఆనందం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’లోని పాట ఇదనే విషయం తెలిసిందే.మహేశ్‌బాబు, శ్రీలీల స్టెప్పులు సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాదాపు 52 కోట్ల మంది దీనిని వీక్షించారు.
Author: admin
బాలీవుడ్ కపుల్ బిపాసా బసు,ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ పై ప్రముఖ సింగర్ మికా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వారితో పని చేయడాన్ని తాను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు.వారితో పని తనకు దారుణమైన అనుభవాన్ని మిగిల్చిందని ఆయన వాపోయారు.వారు తన డబ్బును వృథా చేశారని ఆరోపించారు. “ నేను నిర్మించిన ఒకే ఒక్క ప్రాజెక్ట్ ‘డేంజరస్’. ప్రముఖ దర్శకుడు విక్రమ్ భట్ అందించిన కథతో దీనిని రూపొందించాం.కరణ్ సింగ్ గ్రోవర్ అయితే కథకు సెట్ అవుతారనిపించింది.ఆయనకు జంటగా నూతన నటిని ఎంచుకుంటే బడ్జెట్ పరిధి లో ఉంటుందనుకున్నా.ఆ సమయంలో బిపాసా బసు మా టీమ్ లోకి వచ్చారు.హీరోయిన్ గా తాను యాక్ట్ చేస్తానని అన్నారు.బడ్జెట్ గురించి అలోచించి ఓకే చెప్పా.ఆ తర్వాత ఈ జంట నాకు ఎన్నో సమస్యలు సృష్టించారు.మూడు నెలల షూట్ ఆరు నెలలు అయ్యేలా చేశారు.లండన్ కు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికీ ఒక్క రూమ్ తీసుకుంటే.. కాదు మాకు…
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది.ముయాన్ ఎయిర్ పోర్ట్ రన్ వేపై 7c2216 విమానం అదుపు తప్పి గోడను ఢీకొట్టింది.ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగి విమానం పేలింది.ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.ఇప్పటి వరకు 28 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు.ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.బ్యాంకాక్ నుండి ముయాన్ కు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కాకినాడ బీచ్ రోడ్, APIIC వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు అత్యధిక సంఖ్యలో మరణిస్తున్న నేపథ్యంలో ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి వచ్చింది. ఆలివ్ రిడ్లీ తాబేళ్ళ మరణానికి కారణాలు విచారించి, దీనికి కారణం అవుతున్న వారిపై చర్యలు చేపట్టాలని, వన్యప్రాణుల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ & హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ శ్రీ చిరంజీవి చౌధురిని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది.మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేయగా… భారత్ 369 పరుగులు చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి 333 పరుగుల ముందంజలో ఉంది. నాలుగో రోజు 358-9 ఓవర్ నైట్ స్కోర్ తో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 369 పరుగులకు ఆలౌటయింది. నితీష్ రెడ్డి 114 (189;11×4, 1×6) పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ 70 (139; 3×4), పాట్ కమ్మిన్స్ 41(90; 4×4), నాథన్ లైయన్ 41నాటౌట్ (54;5×4) పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు, జడేజా ఒక…
జనవరి-2024 జనవరి 6: భారతదేశం యొక్క మొదటి సోలార్ మిషన్‌లో ఇస్రో యొక్క ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌక విజయవంతంగా లగ్రాంజియన్ పాయింట్ (L1) చుట్టూ దాని చివరి కక్ష్యలోకి ప్రవేశించింది. జనవరి 12: ముంబైని నవీ ముంబైని కలుపుతూ భారతదేశంలోనే అతి పొడవైన వంతెన, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. జనవరి 14: రాహుల్ గాంధీ తన భారత్ జోడో న్యాయ్ యాత్రను ఇంఫాల్, మణిపూర్ నుండి ప్రారంభించారు. జనవరి 22: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించారు. జనవరి 24: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ పై ఆరోపణలు చేస్తూ నివేదికను ప్రచురించింది. జనవరి 31: భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఫిబ్రవరి ఫిబ్రవరి 7: ఉత్తరాఖండ్ శాసనసభ యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లు 2024ను ఆమోదించింది, ఈ చట్టాన్ని ఆమోదించిన భారతదేశంలో 1వ…
కోట్లాది మంది పాల్గొనే కుంభమేళాకు అన్ని ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి.కుంభమేళాకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారనే సంగతి తెలిసిందే.కుంభమేళాకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక చర్యలు మొదలు పెట్టింది.ఈ మేరకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తూ.. కుంభమేళాలో పాల్గొనడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిద్ధం అవుతుంది.కాగా దక్షిణ మధ్య రైల్వే ఓ కీలక నిర్ణయం తీసుకుంది.తిరుపతి – హుబ్లీ ప్యాసింజర్ రైలు సర్వీసును దాదాపు 2 నెలల పాటు రద్దు చేసింది.తిరుపతి – హుబ్లీ ప్యాసింజర్ రైలు, హుబ్లీ – తిరుపతి ప్యాసింజర్ రైలును సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.కుంభమేళా సందర్భంగా రెండు నెలల పాటు తిరుపతి – హుబ్లీ ప్యాసింజర్ రైలు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు భారత రాజ్యాంగ రచనలో భాగస్వాములైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా 2025వ సంవత్సరం నూతన కేలండర్‌ను నేడు ఆవిష్కరించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి బాధ్యత వహించిన నాయకులను స్మరించుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు, రాష్ట్ర శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ యస్ పాల్గొన్నారు.
ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) తరుఫున రూ.25 లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని అందజేస్తామని ఏసీఏ అధ్యక్షుడు,పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ ప్రకటించారు.త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నగదు బహుమతిని అందిస్తామని చెప్పారు.దేశంలోనే అత్యాధునిక వసతులతో అమరావతిలో స్టేడియాన్ని నిర్మిస్తామని వెల్లడించారు.ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడేలా విశాఖ స్టేడియం సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ కూడా ఐపీఎల్ టీమ్ ఉండేలా ఏసీఏ ఆలోచన చేస్తోందని పేర్కొన్నారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కష్టాల్లో ఉన్న భారత జట్టును నితీష్‌రెడ్డిఆదుకున్నాడు.సీనియర్లంతా నిరాశపర్చినా ఆసీస్ బౌలర్లను ఆడుకున్నాడు.ఒక 1×6 సిక్స్,9×4 ఫోర్లతో సెంచరీతో కదం తొక్కాడు.ఆల్‌రౌండర్లు జడేజా,సుందర్ సహకారంతో జట్టు స్కోరును 350 దాటించాడు.99 రన్స్ వద్ద ఫోర్ కొట్టి టెస్టుల్లో ఘనంగా తొలి సెంచరీ నమోదుచేశాడు.మ్యాచ్ చూడటానికి వచ్చిన నితీశ్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు.కుమారుడి శతకం చూసిన ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు.8వ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.మూడో రోజు ఆట…
బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీ 2024 లో భాగంగా ప్రస్తుతం మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు లో కీలక ఇన్నింగ్స్ ఆడి సెంచరీతో సత్తా చాటిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా నితీష్ రెడ్డిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ లో జరుగుతున్న క్రికెట్ నాలుగవ టెస్టు మ్యాచ్ లో సెంచరీ సాధించిన విశాఖపట్నం యువకుడు కె.నితిష్ కుమార్ రెడ్డికి అభినందనలు. టెస్టు మ్యాచ్ లలో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కూడా కావడం మరింత సంతోషం కలిగిస్తున్నది. రంజీలో ఆంధ్రా తరపున ఎన్నో విజయాలు సాధించిన నితీష్ కుమార్ రెడ్డి, అండర్ 16లో కూడా అద్భుత విజయాలు అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని, భారత క్రికెట్ జట్టులో…
