Author: admin

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్వరం చేయూత అందించి ఇద్దరు దివ్యాంగులకు అండగా నిలిచారు.‌ ఇటీవల అన్నమయ్య జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు, రాయచోటి వద్ద తనను కలిసి తమ సమస్యలు చెప్పుకున్న అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డి పల్లి మండలానికి చెందిన 90% వైకల్యం కలిగిన దివ్యాంగులు కట్ట ఆదినారాయణ, కాల్వ చంద్రశేఖర్ కు తన క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వం తరఫున రెండు రెట్రో ఫిట్టేడ్ మోటరైజ్డ్ స్కూటర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందజేశారు.

Read More

2047 స్వర్ణాంధ్ర విజన్ లో, నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.టీడీపీ ప్రభుత్వంలోనే నీటి భద్రతకు అడుగులు పడ్డాయని పేర్కొన్నారు. తెలుగు గంగతో అన్న ఎన్టీఆర్ రాయలసీమని ఆదుకున్నారు. సాగునీరు అందిస్తే, రాయలసీమ రతనాలసీమ అవుతుందని పేర్కొన్నారు . ఈ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి. ప్రణాళికతో నీటిని స్టోరేజ్ చేసినట్లు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో 74% నీళ్ళు ఉన్నాయని వివరించారు. జనవరి నెలలో, ఇంత నీరు ఉండటం ఒక చరిత్ర. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. గోదావరి – వంశధార – నాగావళితో ఉత్తరాంధ్రకు, ఇటు గోదావరి – కృష్ణా ద్వారా రాయలసీమకు నీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. గోదావరి – కృష్ణా అనుసంధానం ప్రాజెక్ట్ కోసం, “తెలుగు తల్లికి జల హారతి” అని పేరు పెట్టాం. గోదావరి నుండి బనకచర్లకు లింక్ ఏర్పాటు చేస్తే,…

Read More

ప్రజలకు కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌ కీలక విజ్ఞప్తి చేశారు.పాదాలను తాకడంపై నిషేధం ఉందని.. అలా చేసిన వారికి పనులు అప్పగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.ఈ మేరకు మధ్యప్రదేశ్‌ లోని తికమ్‌గఢ్‌ లోగల తన కార్యాలయం వద్ద వినూత్న బోర్డు ఏర్పాటు చేశారు.‘పాదాలను తాకడంపై నిషేధం ఉంది.అలా చేసిన వారికి ఎటువంటి పనులూ అప్పగించేది లేదు’ అంటూ పోస్టర్‌ను ఏర్పాటు చేశారు.ఇది చూసిన స్థానిక ప్రజలు, రాజకీయ నేతలు షాక్‌ అవుతున్నారు.కార్యాలయం వద్దకు వచ్చిన వారంతా ఈ బోర్డును ఆసక్తిగా తిలకిస్తున్నారు.కేంద్ర మంత్రి చేసిన ఈ పనిని ప్రశంసిస్తున్నారు.

Read More

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ (100) మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడని, lప్రపంచ శాంతి, సామరస్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు.భారత్‌-అమెరికాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో కార్టర్‌ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.అగ్రరాజ్యానికి అధిపతిగా తనదైన ముద్ర వేశారన్నారు.ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులకు సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.

Read More

రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ జిల్లాలో ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన మూడేళ్ల బాలిక.. ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడుతూనే ఉంది.ఆ బాలికను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తున్నారు.ఆమెను చేరుకునే క్రమంలో ఓ పెద్ద బండరాయి అడ్డుతగిలింది.దాన్ని ముక్కలు చేసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నానికి రాయిని తొలగించి చిన్నారి ఉన్న ప్రాంతం వద్దకు చేరుకొనే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Read More

అఫ్గానిస్థాన్‌ ను వశం చేసుకున్న తాలిబన్లు అక్కడి మహిళల హక్కులకు భంగం కలిగిస్తున్నారు.తాజాగా ఆ దేశ పాలకులు తీసుకువచ్చిన కొత్త నియమాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.నూతనంగా నిర్మించే ఇళ్లల్లో మహిళలు బయటివారికి కనిపించేలా వంట గదికి కిటికీలు ఏర్పాటు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది.వంట గదులు,ఇంటి ఆవరణ,నీటికోసం బావుల వద్దకు వచ్చిన మహిళలు బయటివారికి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారితీసే వీలుంది. వారు కనిపించకుండా గోడలు కట్టాలి.ఇప్పటికే స్త్రీలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటిని మూసివేయాలి’’ అని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

Read More

దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో కీలక రంగాల షేర్లలో మదుపర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 450.94 పాయింట్ల నష్టంతో 78,248 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 168.50 పాయింట్ల లాభంతో 23,644 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.51గా కొనసాగుతోంది. నేటి ట్రేడింగ్ లో టెక్ మహీంద్రా, జొమాటో, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్.సీ.ఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ఆలయాలు, గురుద్వారాల్లో పని చేసే పూజారులు, గ్రంథీల కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి నెలకు రూ.18వేలు గౌరవ వేతనంగా అందించనున్నట్లు తెలిపారు. మన ఆచారాలను వారు భావి తరాలకు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని నిస్వార్థంగా సేవ చేస్తున్నారని కొనియాడారు. వారి ఆర్థికస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా కేజీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం రిజిస్ట్రేషన్ రేపటి నుండి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. హనుమాన్ ఆలయంలో తానే ఈ ప్రక్రియను ప్రారంభిస్తానని తెలిపారు. పలు సంక్షేమ పథకాలకు సంబంధించి కేజ్రీవాల్ హామీలు ఇచ్చారు.

Read More

‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’, మాలికాపురం వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్.ప్రస్తుతం ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం “మార్కో”.మైఖేల్,ది గ్రేట్ ఫాదర్ చిత్రాల ఫేమ్ దర్శకుడు హనీఫ్ అదేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రం యాక్ష‌న్ జాన‌ర్‌లో రూపొందుతుంది.డిసెంబ‌ర్ 20న మ‌ల‌యాళంలో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా…5 రోజుల్లో రూ.50 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.అయితే ఇదే ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేయనుంది చిత్రబృందం.ఈ చిత్రం తెలుగులో జ‌న‌వ‌రి 01న విడుదల కానుంది.తాజాగా ఈ చిత్రం తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌లై అభిమానులను అలరిస్తోంది. https://youtu.be/uc3mlFD-lFQ?si=6iCTEW_C8UzKtQuE

Read More

డబుల్ ఇంజిన్ పాలనలో యువతపై డబుల్ దౌర్జన్యాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వేలాది అభ్యర్థులు పాట్నాలోని గాంధీ మైదాన్ వద్ద నిరసనకు దిగారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు వాటర్ కెనాన్స్ ప్రయోగించి లాఠీఛార్జి చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై ఇంత చలిలో వాటర్ కెనాన్స్ ప్రయోగించడం, లాఠీఛార్జి చేయడం అమానుషమన్నారు. తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతుంటే సహించలేక వారిని అణచివేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు . పరీక్షల్లో అవినీతి, రిగ్గింగ్లు, పేపర్ లీక్లను అరికట్టడం తమ బాధ్యత అనే విషయం మరిచిపోయిందన్నారు.

Read More