Author: admin

జూలై 3 నుండి దక్షిణ కాశ్మీర్ లోని హిమాలయ పర్వతాలలో పవిత్ర అమరనాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఆగష్టు 9న ముగుస్తుంది. గతంలో ఈ యాత్ర 52 రోజుల పాటు జరిగేది. అయితే దీనిని 38 రోజులకు కుదించారు. అధికారులు ఈ యాత్ర కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అమరనాథ్ యాత్రికులకు ఉగ్రముప్పును అరికట్టే చర్యల్లో భాగంగా జమ్మూకాశ్మీర్ పోలీసులు పహాల్గాం వెళ్లే మార్గంలో వెళ్లే యాత్రికుల కోసం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతను కట్టుదిట్టం చేసే క్రమంలో ఉగ్రవాదులు, అనుమానిత ఉగ్రవాదుల ఫోటోలు ఆ సిస్టమ్ లో పొందుపరిచారు. ఆ నిఘా కెమెరాలకు బ్లాక్ లిస్టులో ఉన్న ఎవరైనా వ్యక్తి కనిపిస్తే అబ్జర్వేషన్ సెంటర్ లో ఉన్న సైరన్ లు గట్టిగా మోగుతాయి. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమై ముందుకు కదులుతాయి. గతంలో కూడా ఉగ్రవాదులు అమరనాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని దాడులకు…

Read More

నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన పదవీకాలంలో ఇప్పటివరకూ అందుకున్న విజయాలను ’11 ఏళ్ల సేవ’ పేరుతో సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా మోడీ పంచుకున్నారు. ఎన్నో కీలక మార్పుల్ని అత్యంత వేగంగా, భారీ పరిమాణంలో తమ ప్రభుత్వం పూర్తి చేసి చూపించిందని తెలిపారు. 81 కోట్ల మందికి ఉచిత ఆహారధాన్యాలు, 15 కోట్ల మందికి కొళాయి కనెక్షన్లు, పేదల కోసం నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం, దేశవ్యాప్తంగా 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం వంటివి ఆయన ప్రస్తావించారు. మంత్రిమండలిలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలవారే ఉన్నట్లు వివరించారు. వీరికి ఈ స్థాయిలో పదవులు కేటాయించడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఈ 11 ఏళ్ల సమయంలో పాలనలో దేశం అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడంతోపాటు వాతావరణ మార్పులు, డిజిటల్ చేంజెస్ వంటి అంశాల్లో ప్రపంచ…

Read More

భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ వ్యాక్స్ స్టాట్యూ (మైనపు విగ్రహాం) వెస్ట్ బెంగాల్లోని అసన్సోల్ ఆవిష్కరించారు. సుశాంత రాయ్ అనే శిల్పి ఈ విగ్రహాన్ని రూపొందించారు. దీనిని తయారు చేయడానికి నెలన్నర సమయం పట్టినట్లు ఆయన తెలిపారు. సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో దాదాపు 9 నెలలు గడిపి, తర్వాత భూమిని చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె విగ్రహాన్ని తయారుచేయాలనే ఆలోచన వచ్చినట్లు సుశాంత రాయ్ తెలిపారు. సునీత విగ్రహాన్ని సుశాంత సొంత మ్యూజియంలోనే ప్రస్తుతం ఆవిష్కరించారు.

Read More

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇది ఎంతో కఠినమైన నిర్ణయమని పూరన్ తన ఇన్స్టా ఎకౌంటు లో పేర్కొన్నాడు. విండీస్ తరఫున 61 వన్డేల్లో 1,983 పరుగులు, 106 టీ20ల్లో 2,275 పరుగులు చేశాడు. ఇటీవల టీ20ల్లో విండీస్ జట్టుకు కెప్టెన్ గానూ వ్యవహరించాడు. జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ నకు 8 నెలల ముందే రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించాడు. ఎంతో ఆలోచించి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

Read More

అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చారు. నిన్న ఉదయం హైదరాబాద్ లో ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాత్రి 10 గంటలకు గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చారు. ఈరోజు ఉదయం అక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య గుంటూరు జీజీహెచ్ కు తీసుకెళ్లారు. అక్కడ మెడికల్ టెస్ట్ లు నిర్వహించారు. అనంతరం కొమ్మినేనిని మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చారు. నాలుగు రోజుల కిందట సాక్షి టీవీ ఛానెల్లో ప్రసారమైన ‘కేఎస్ఆర్ లైవ్ షో’లో అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యల్ని ఖండించకపోగా వాటిని కొనసాగించేందుకు మరింత ఊతమిచ్చారని అనుచిత వ్యాఖ్యలపై గత రెండురోజులుగా రాష్ట్రమంతటా మహిళలు పెద్ద…

Read More

భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీకి మరో అరుదైన గౌరవం లభించింది. క్రికెట్ కు అతను చేసిన సేవలను ఐసీసీ గుర్తించింది. ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనికి స్థానం దక్కింది. ఐసీసీ ఆల్ హాఫ్ ఫేమ్ లో ఐసీసీ కొత్త ఏడుగురిని చేర్చింది. ఆస్ట్రేలియా నుంచి మాథ్యూ హేడెన్, సౌతాఫ్రికా నుంచి హషీమ్ ఆమ్లా, గ్రేమ్ స్మిత్, న్యూజిలాండ్ నుండి డేనియల్ వెట్టోరిలను ఎంపిక చేసింది. అదే విధంగా ఇద్దరు మహిళా క్రికెటర్లు సనా మిర్ (పాకిస్తాన్), సారా టేలర్(ఇంగ్లాండ్) కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. భారత క్రికెట్ కు ధోనీ విశేష కృషి చేశాడు. ధోనీ నాయకత్వంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్(2007), వన్డే వరల్డ్ కప్(2011), చాంపియన్స్ ట్రోఫీ (2013) లను గెలిచింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 538 మ్యాచ్లు ఆడిన ధోనీ 17,266 రన్స్ చేశాడు. అలాగే, 829 అవుట్లు…

Read More

సీనియర్ అగ్ర కధానాయకుడు బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా చిత్ర బృందం అభిమానులకు అదిరే సర్ప్రైజ్ ఇచ్చింది. వారంతా ఎదురుచూస్తున్న ‘అఖండ-2’ కు సంబంధించిన సూపర్ గిఫ్ట్ ను కానుకగా ఇచ్చింది. బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్, తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి దుమ్మరేపే విధంగా ఉన్నాయి. బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘అఖండ’కు సీక్వెల్ ఇది. సంయుక్త, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా సందర్భంగా సెప్టెంబరు 25న ఈ సినిమా విడుదల కానుంది. https://youtu.be/WVG6cnskbRg?si=e9MHT1GrRIxjS3Iu

Read More

స్వర్ణాంధ్ర కార్యాలయాలను సచివాలయం నుండి ఏపీ సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సేవారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. సర్వీస్ సెక్టార్ నుండి మనకు 6.3 శాతం ఆదాయమే వస్తోందని, దానిని విస్తరిస్తే ఇన్ కం పెరుగుతుందని తెలిపారు. టెక్నాలజీ అనేది గేమ్ ఛేంజర్ అని భవిష్యత్లో అదే కీలకమని అన్నారు. భవిష్యత్లో యుద్ధాలు కూడా డ్రోన్లతోనే జరుగుతాయని చెప్పారు. ఇక ఈ నెలలోనే తల్లికి వందనం అమలు చేస్తామని వివరించారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తాం. దీపం-2 కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తాం. 21 దేవాలయాల్లో అన్న ప్రసాదం ఏర్పాటు చేశాం. సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. విధ్వంసం నుండి అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ప్రజలకు హామీ ఇచ్చాం. పేదల కోసం తీసుకొచ్చిన పీ-4 కార్యక్రమాన్ని మరింత ముందుకు…

Read More

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో సూచీలకు ఉత్తేజాన్ని ఇచ్చింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ రాణించాయి. భారత్ -అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సహా అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 256 పాయింట్లు లాభంతో 82,445 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 25,103 వద్ద ముగిసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.85.66గా కొనసాగుతోంది. ఇక సెన్సెక్స్ 30లో యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రైవేటురంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తెస్తున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు.పదోతరగతి, ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్ట్స్ -2025లో భాగంగా పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పదోతరగతిలో ప్రతిభ కనబర్చిన 95మంది, ఇంటర్మీడియట్ లో ప్రతిభకనబర్చిన 26మందికి అవార్డులు అందజేశారు. అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నాం, సంస్కరణల ద్వారా రాబోయే నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు.

Read More