నేడు బక్రీద్ పండుగ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ‘ఈద్ ముబారక్’. త్యాగ బుద్ధిని, నిజమైన భక్తిప్రపత్తులు కలిగి ఉన్నవారే దైవకృపకు పాత్రులు అవుతారు అనే సూక్తిని బక్రీద్ మనకు తెలియజేస్తోంది. నేటి ఆధునిక కాలంలో సాటి మనిషిని ప్రేమించేవారే నిజమైన దైవభక్తులుగా చెప్పవచ్చు. హజ్రత్ ఇబ్రహీం స్ఫూర్తిగా అందరూ సాటివారిని ఆదరిస్తూ సహృదయంతో ముందుకు సాగాలని ‘బక్రీద్’ సందర్భంగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
Author: admin
అగ్ర కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘OG’. పవన్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ స్థాయిలో ఆకట్టుకుని అంచనాలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా షూటింగ్ లొకేషన్ లో నటుడు అర్జున్ దాస్ హీరో పవన్ కళ్యాణ్ తో దిగిన పిక్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రియాంక అరుళ్ మోహన్ పవన్ సరసన నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు.…
సీనియర్ క్రికెటర్, స్పిన్నర్ పియూష్ చావ్లా అన్ని రకాల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2007 టీ 20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమ్ లో చావ్లా కూడా సభ్యుడు. 2007 నుండి టీమ్ ఇండియాకు 3 టెస్టులు, 25 వన్డేలు, 7 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 3 ఫార్మాట్లలో కలిపి చావ్లా 43 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో 4 జట్లకు ఆడి192 మ్యాచ్లో 192 వికెట్లు తీశాడు. 2014 ఐపీఎల్ విజేతగా నిలిచిన కోల్ కతా టీమ్ లో అతను సభ్యుడు. ఫైనల్లో విన్నింగ్ షాట్ కొట్టింది అతనే కావడం గమనార్హం. రెండు దశాబ్దాల దేశవాళీ కెరీర్లో చావ్లా వెయ్యికి పైగా వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అన్ని రకాల క్రికెట్ నుండి రిటైరవుతున్న నేపథ్యంలో ఇది తనకు తీవ్ర భావోద్వేగాన్ని కలిగించే రోజని రెండు దశాబ్దాలకు పైగా మైదానంలో ఉండి ఇక ఈ అందమైన…
నార్వే చెస్ టోర్నమెంట్ లో వరల్డ్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 9వ రౌండ్ వరకు 14.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న అతను 10వ రౌండ్ లో పరాజయం చెందాడు. ఆఖరి రౌండ్ లో అమెరికాకు చెందిన ఫాబియానా కరువానాతో తలపడ్డాడు. ఇక ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ 16 పాయింట్లతో తన చివరి రౌండ్లో గెలిచి టైటిల్ విజేతగా నిలిచాడు. అర్జున్ పై కార్ల్ సన్ విజయం సాధించాడు. మహిళల విభాగంలో కోనేరు హంపి మూడో స్థానంలో నిలిచింది. 9వ రౌండ్ లో చైనాకు చెందిన లీ టింగ్జీ చేతిలో ఓడి 13.5 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. చివరి రౌండ్లో చైనాకు చెందిన వెన్జున్ తో హంపి డ్రా చేసుకుంది. అయితే ఆర్మగెడినో విభాగంలో విజయం సాధించింది. దీంతో హంపి 15 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అగ్రస్థానంలో ఉన్న ఉక్రెయిన్ కు…
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో యువతకు నైపుణ్య శిక్షణ సహా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించేలా ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) కంప్యూటింగ్ సంస్థ “ఎన్ విడియా(NVIDIA)”తో ఆంధ్రప్రదేశ్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఉన్నత విద్య అధికారులు, ఎన్ విడియా ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా 10వేల మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణ అందించనున్నారు. దీంతో పాటు 500 ఏఐ ఆధారిత స్టార్టప్ ల అభివృద్ధికి మద్దతు ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ హబ్‌గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఒప్పందం కీలకమైన ముందడుగు కానుంది.
స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు త్వరలో భారతదేశంలో అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఎలాన్ మస్క్‌కి చెందిన స్టార్‌లింక్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఈ సేవలను అందించనుంది. ఈ సేవలు ముఖ్యంగా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ను అందించడానికి దోహదం చేయనున్నాయి. ఇక అవసరమైన లైసెన్సును టెలికాం విభాగం జారీ చేసింది. భారత్‌లో ఈ రకమైన లైసెన్సు పొందిన మూడవ కంపెనీగా స్టార్‌లింక్ నిలిచింది. ఇప్పటికే యూకేకు చెందిన యులెసాట్ వన్‌వెబ్,భారతీయ దిగ్గజం రిలయన్స్ జియో ఈ లైసెన్సును పొందాయి. ఈ సర్వీసులు ప్రారంభించేందుకు అవసరమైన ట్రయల్ స్పెక్ట్రమ్‌ను దరఖాస్తు చేసిన 15 నుండి 20 రోజుల్లోగా మంజూరు చేస్తామని టెలికాం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇది కంపెనీకి త్వరితంగా సేవలు పరీక్షించేందుకు మార్గం ఏర్పరిచే అవకాశం కల్పిస్తుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇంజినీరింగ్ వండర్ రైల్వే వంతెన అయిన జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఈ అద్భుతమైన నిర్మాణంతో కశ్మీర్ వ్యాలీ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానమైంది. ఇది ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (యూఎస్‌బీఆర్ఎల్) ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భాగం. ప్రధాని మోడీ ఈ ప్రతిష్ఠాత్మక వంతెనను అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ వంతెన ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ భారతదేశపు మొట్టమొదటి కేబుల్-స్టేయిడ్ రైల్వే వంతెన అయిన అంజి వంతెనను కూడా ప్రారంభించనున్నారు. ఇది కూడా ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తుంది. ఇక వీటితో పాటు, శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా, శ్రీనగర్ మధ్య రెండు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైళ్ల రాకతో, మొత్తం 272 కిలోమీటర్ల…
ఇంగ్లాండ్, భారత్ మధ్య టెస్టు సిరీస్ విజేతకు ఇవ్వనున్న ట్రోఫీకి టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీగా పేరు పెట్టారు. ఈ ట్రోఫీని త్వరలోనే ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. ఇంతకుముందు ఈ రెండు జట్లు ఇంగ్లాండ్ పటౌడీ ట్రోఫీ కోసం టెస్టు సిరీస్ ఆడేవి. భారత మాజీ కెప్టెన్లు ఇఫ్రికార్ అలీ ఖాన్ పటౌడీ, అతడి కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీల గౌరవార్థం ఆట్రోఫీకి పేరు పెట్టగా…ఇక ఆ పేరును రిటైర్ చేయాలని భావిస్తున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మార్చిలో పటౌడీ కుటుంబానికి లేఖ రాసింది. ఇక మీదట లెజెండరీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, జేమ్స్ అండర్సన్ల పేరుతో ట్రోఫీ ఇస్తారు.
ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ డబుల్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్ చేరింది. తాజాగా జరిగిన పురుషుల డబుల్స్ ప్రి క్వార్టర్స్ లో 16-21, 21-18, 22-20తో డెన్మార్క్ కు చెందిన రస్ ముస్ జేయర్-ఫ్రెడరిక్ హోంగార్డు పై గెలిచింది. మరోవైపు మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్స్ లో భారత స్టార్ షట్లర్ సింధు ఓటమి చెందింది. 22-20, 10-21, 18-21తో థాయ్ లాండ్ కు చెందిన పోర్న్ పావీ చేతిలో పరాజయంతో టోర్నీ నుండి నిష్క్రమించింది.
అయోధ్య రామమందిరం లో తాజాగా రెండో విడత విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం వీనుల విందుగా నిర్వహించారు. మొదటి అంతస్తులో నిర్మించిన రాజదర్బారులో సీత సమేతంగా శ్రీరామచంద్రుడు రాజు హోదాలో కొలువు తీరాడు. అలాగే రామజన్మభూమి ఆలయ సముదాయ ఆవరణలో నిర్మించిన ఎనిమిది కొత్త ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ట పూర్తి చేశారు. గత సంవత్సరం జనవరి 22న ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన బాల రాముడి విగ్రహ ప్రతిష్ట తర్వాత అయోధ్యలో ఇది రెండో ప్రధాన కార్యక్రమం. హిందూ పంచాంగం ప్రకారం అత్యంత విశిష్టమైన అభిజిత్ ముహూర్తంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6:30 గంటలకు యజ్ఞ మండపంలో పూజలతో ప్రతిష్ట క్రతువు మొదలైంది. తొమ్మిది గంటలకు యజ్ఞం, ఆ తర్వాత అన్ని చోట్లా విగ్రహ ప్రతిష్ట క్రతువు ప్రారంభించారు. ఆలయంలో బిగ్ స్క్రీన్ లపై ఈ వేడుక దృశ్యాలు చూపారు. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు వీటిని వీక్షించారు. ‘రామదర్బారు’ ప్రతిష్టతో…
