ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2025, జూన్ 6న చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జి భారతీయ ఇంజనీరింగ్ సాధించిన గొప్ప విజయంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కొంచెంగా, ఎంతో ప్రతిష్టాత్మకమైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవం తర్వాత ఒక మహిళ పేరు విశేషంగా వినిపిస్తోంది. ఆమే ప్రముఖ సివిల్ ఇంజనీర్ మాధవి లత. ఈ వంతెన నిర్మాణంలో ఆమె కీలక పాత్ర పోషించారు. దాదాపు 17 సంవత్సరాల పాటు ఆ వంతెన నిర్మాణం కోసం ఆమె నిర్విరామంగా కృషి చేశారు. వంతెన నిర్మాణ ప్రారంభం నుంచి మాధవి లత వెనక్కి తగ్గకుండా ధైర్యంగా వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రాజెక్ట్ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు. 2025, జూన్ 6న ఎట్టకేలకు చారిత్రాత్మకమైన చీనాబ్ వంతెన ప్రారంభం కావడంతో మాధవి లత…
Author: admin
టెన్నిస్ ప్రపంచంలో క్లే కోర్టులో రఫెల్ నాదల్ తరువాత ఆ స్థాయిలో రాణిస్తూ పేరుగాంచిన కార్లోస్ అల్కరాజ్ మరోసారి తన సత్తా చాటాడు. రోలాండ్ గారోస్ లో తాజాగా జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు జానిక్ సిన్నర్ పై చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. దీంతో అల్కరాజ్ వరుసగా రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను నిలబెట్టుకున్నాడు. చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా సాగిన ఈ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ లో అల్కరాజ్ అసాధారణ పోరాట పటిమ, మానసిక దృఢత్వంతో అందరినీ ఆకట్టుకున్నాడు. 5 గంటల 29 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో 22 ఏళ్ల స్పానిష్ యువ కెరటం అల్కరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా నాలుగో సెట్ లో మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుని, చివరికి 4-6, 6-7(4), 6-4, 7-6(3), 7-6(10-2) తేడాతో సిన్నర్ పై విజయం సాధించాడు. Pic…
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ’ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రాంతాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటేనని తెలుగుజాతిని నెంబర్ వన్ చేయడమే ధ్యేయమని పేర్కొన్నారు. దత్తాత్రేయ రాజకీయ జీవితం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో అజాతశత్రువు అంటే దత్తన్నేనని అలయ్ బలయ్‌తో అన్ని పార్టీల నేతలను ఏకతాటిపైకి తెచ్చారని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇరు రాష్ట్రాల గవర్నర్లు, పలువురు మంత్రులు తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల ఒక మీడియా ఛానల్ లో అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విశ్లేషకుడిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు సహా ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత విధ్వంస ప్రభుత్వం పై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశ్యపూర్వకంగా, నీచాతినీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్నే అవమానించడమని ఆక్షేపించారు. ఇక దీనిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అమరావతిని వేశ్యల రాజధాని అని ఎలా అంటారు..? అని మంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. ఛానల్ లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడితే ఎలా?ఎడిటర్స్ అసోసియేషన్ కు…
ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనది. ఇది మన సంప్రదాయం. మన భారతీయ జీవన విధానం. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. ఇటీవల ఒక మీడియా ఛానల్ లో అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక విశ్లేషకుడి తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. వాళ్లు ఎప్పుడూ అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదనేది సుస్ఫష్టం. రాజధాని గురించి, ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజకీయ,…
వరల్డ్ నంబర్ 2 కొకో గాఫ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచింది. పోటాపోటీగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె 6-7 (5-7), 6-2, 6-4తో టాప్ సీడ్ బెలారస్ కు చెందిన సబలెంకా పై గెలిచి చరిత్ర సృష్టించింది. ఆమెకు కెరీర్ లో ఇది రెండో గ్రాండ్ స్లామ్. ఇంతకుముందు 2023లో యుఎస్ ఓపెన్ టైటిల్ గెలిచింది. అప్పుడు కూడా ఆమె ఫైనల్ లో సబలెంకాపై గెలిచింది. కొకో గాఫ్ 2022లో ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్ గా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన ఏప్రిల్ 2025 నెలవారీ కీలక సూచికలు తీవ్ర ఆందోళనకరమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, వాస్తవ ఆర్థిక స్థితిగతులకు పొంతన లేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ఆక్షేపించారు.ఈ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత నిరాశాజనకంగా ఉందని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించి, ఆర్థిక క్రమశిక్షణ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. April 2025 fiscal performance indicates further distress The CAG uploaded the Monthly Key Indicators for April 2025 and these figures bring to light a very…
ఈనెలలో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ చేరుకుంది. ఈ సిరీస్ జూన్ 20 నుండి జరగనుండగా, భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టుల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా ఆడనున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. దీంతో ఈ పర్యటన భారత టెస్ట్ క్రికెట్‌లో ఒక కొత్త శకానికి ప్రారంభం కానుంది. భారత జట్టు ఇంగ్లండ్ చేరుకున్న విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నేడు అధికారికంగా ప్రకటించింది. “టచ్‌డౌన్ యూకే. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా వచ్చేసింది” అంటూ బీసీసీఐ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో అక్కడి పరిస్థితుల్లో భారత యువ జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత జట్టు: శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్…
‘పుష్ప’ చిత్రాలతో దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కలయికలో ఓ భారీ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘AA22xA6’ అనేది వర్కింగ్ టైటిల్. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీకి సంబంధించి ఒక కీలక అప్‌డేట్‌ను మూవీ టీమ్ పంచుకుంది. ప్రముఖ బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ చిత్రంలో కథానాయికగా నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఇందుకు సంబంధించి చిత్ర బృందం ఓ ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో దర్శకుడు అట్లీ, దీపికాకు ఆమె పాత్ర గురించి వివరిస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పటిష్టమైన AI వ్యవస్థ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఐటీ మంత్రి లోకేష్ నాయకత్వంలో, రాష్ట్రంలో బలమైన మరియు సమగ్రమైన AI పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి nvidiaతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. పాఠ్యాంశాలు మరియు శిక్షణ కోసం NVIDIA మద్దతుతో, రాబోయే రెండు సంవత్సరాలలో 10,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నైపుణ్య శిక్షణ పొందుతారని తెలిపారు. మౌలిక సదుపాయాలు మరియు పరిశోధన సామర్థ్యాలను రూపొందించడానికి NVIDIA సహకారంతో భారతదేశంలో మొట్టమొదటి AI యూనివర్సిటీని స్థాపించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. విద్య మరియు నైపుణ్యాల నుండి పరిశోధన మరియు ఆవిష్కరణల వరకు, ఈ చొరవ స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌కు పునాది వేస్తోందని పేర్కొన్నారు.
