గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్రూ సిబ్బంది ఉన్నారు. విమానం కూలిపోతున్న దృశ్యాన్ని ఒక స్థానిక వ్యక్తి తన ఫోన్ లో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే, ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద వివరాలు, సహాయక చర్యల పురోగతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. క్షేత్రస్థాయిలో సహాయక, పునరావాస కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించేందుకు తాను తక్షణమే అహ్మదాబాద్‌కు బయలుదేరుతున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధానికి తెలిపారు. దీనిపై స్పందించిన ప్రధానమంత్రి, ప్రమాద…
Author: admin
ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజా పాలన ప్రారంభమై నేటికి ఏడాది! సుపరిపాలనలో తొలి అడుగు పడింది. విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం మొదలైందని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నాం. గత ప్రభుత్వం ఐదేళ్లలో చెయ్యలేని ఎన్నో పనులు ఏడాదిలోనే పూర్తి చేశాం. అన్ని పనులు ఏడాదిలోనే పూర్తి చేశామని కాలర్ ఎగరేయడం లేదు. చెయ్యాల్సింది ఎంతో ఉంది. నిర్దేశించుకున్న లక్ష్యం కోసం ప్రతినిత్యం శ్రమిస్తామని స్పష్టం చేశారు. ప్రజాసేవలో నిమగ్నమై పని చేస్తున్నామన్నారు. సుపరిపాలనకు సహకరించిన ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికీ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ -జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రతి రోజూ పని చేస్తున్నాం. అనేక సమస్యలను, ఆర్థిక సవాళ్లను దాటుకుని ఏడాది కాలంలోనే ‘పేదల సేవలో’, ‘పెన్షన్లు, ‘అన్న క్యాంటిన్లు’, దీపం-2, ‘తల్లికి వందనం’, ‘మత్స్యకార సేవలో’…లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చాం. మెగా డిఎస్సీతో టీచర్ ఉద్యోగాలు…పెట్టుబడులతో ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అడుగులు వేశామని వివరించారు. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సహా రైతు సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నాం. ఈ నెలలోనే అన్నదాత…
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (ఏఎంఏ) 180వ అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన ప్రముఖ ఒటోలారింగాలజిస్ట్ (చెవి, ముక్కు, గొంతు నిపుణుడు) డాక్టర్ బాబీ ముక్కామల, ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా వైద్య రంగంలోనే ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఒక భారతీయ మూలాలున్న వ్యక్తి ప్రతిష్టాత్మక సంస్థకు నాయకత్వం వహించడం పట్ల ప్రవాసాంధ్రులతో పాటు భారతీయులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈనెల 10న చికాగోలో జరిగిన ఏఎంఏ వార్షిక సమావేశంలో కుటుంబ సభ్యులు, సహచరులు, మాజీ నాయకుల సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఎన్నో పెను సవాళ్లను అధిగమించి మరీ ఆయన ఈ స్థాయిలో నిలిచారు. గతంలో ఏఎంఏ ఫౌండేషన్ వారి “ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్” లీడర్‌షిప్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్‌కు ఎన్నికై, 2016-17లో దానికి ఛైర్‌గా పనిచేశారు. అనంతరం 2017, 2021లలో ఏఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌కు ఎన్నికయ్యారు.
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్ మొదటి రోజు ఆటలో బౌలర్లు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. మ్యాచ్ లో మొదటి రోజు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 56.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటయింది. వెబ్స్టర్ 72 (92 బంతుల్లో 11×4), స్టీవ్ స్మిత్ 66 (112 బంతుల్లో 10×4) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అలెక్స్ కేరీ (23) పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా 5 వికెట్లతో మంచి ప్రదర్శన కనబరిచాడు. జాన్సన్ 3 వికెట్లు, కేశవ్ మహారాజ్, ఏడెన్ మార్క్రమ్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన సౌతాఫ్రికా కూడా ఆంటీ ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. రికెల్టన్ (16), ఏడెన్ మార్క్రమ్ (0), ముల్లర్…
ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించి అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈసందర్భంగా మంత్రి నారా లోకేష్ విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మణులకు కానుకగా సూపర్ సిక్స్‌లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషమని పేర్కొన్నారు. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ ‘తల్లికి వందనం’ పథకం అందుతుంది. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇస్తామని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా…
‘ఆపరేషన్ సిందూర్’ తదితర పరిణామాలను వివరించేందుకు వివిధ దేశాల్లో భారత్ కు చెందిన వివిధ పార్టీల నేతలు బృందాలుగా పర్యటించి ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటాన్ని వివరించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ పర్యటనలో పాల్గొని వచ్చిన ఏడు బృందాల ప్రతినిధులతో ప్రధాని మోడీ తాజాగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధులు తమ పర్యటన విశేషాలను ప్రధానికి వివరించారు. భారత దేశం శాంతిని కోరుకుంటుందని, ప్రపంచానికి పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పును తొలగించాల్సిన అవసరముందని వివిధ దేశాలకు మన బృందాలు వివరించిన తీరు అద్భుతమని ప్రధాని మోడీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. శశిథరూర్, సుప్రియా సూలే, కనిమొళి, రవిశంకర్ ప్రసాద్, శ్రీకాంత్ షిండే తదితరులు ఉన్నారు.
ఎన్ని ఫార్మాట్ లు వచ్చినా క్రికెట్ లో టెస్టులకు ఉన్న ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకం. అసలు క్రికెట్ మజాను ఆస్వాదించాలంటే టెస్టు క్రికెట్ కు మించిన ఫార్మాట్ లేదు. వందల ఏళ్లయినా ప్రతి తీరంలో ఈ ఫార్మాట్ కు భారీ సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. ఈ ఫార్మాట్ లో అత్యున్నత ట్రోఫీ అయిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ నేటి నుండి ప్రారంభం కానుంది. ఈ టైటిల్ కోసం ఆస్ట్రేలియా -సౌతాఫ్రికాలు తలపడుతున్నాయి. లార్డ్స్ మైదానం వేదికగా ఇరు జట్లు తమ బలాబలాలు తేల్చుకోనున్నాయి. ఆస్ట్రేలియా: ఖవాజా, లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, హెడ్, వెబ్స్టర్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, హేజిల్ వుడ్, లైయన్. సౌతాఫ్రికా: మార్క్రమ్, రికిల్స్టన్, ముల్దర్, బవుమా (కెప్టెన్), స్టబ్స్, బెడింగ్టన్, కైల్ వెరీన్ (వికెట్ కీపర్) యాన్సెన్, కేశవ్ మహరాజ్, రబాడ, ఎంగిడి.
విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం అత్యంత కీలకమైందని మంత్రి నారా లోకేష్ అన్నారు.విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలోని సాగరిక కన్వెన్షన్ హాలులో ఈనెల 21న యోగా డే నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ రోజున మనం సాధించబోయే రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ మహానగరం వైపు చూస్తోందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఒకే ప్రాంతంలో 5లక్షలమందితో నిర్వహించే ఈ ఈవెంట్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా చరిత్ర సృష్టించబోతోంది. ప్రధాని మోడీజీ హాజరు కాబోతున్నారు, అధికారులంతా పట్టుదల, క్రమశిక్షణ, కమిట్ మెంట్ తో పకడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇది రాష్ట్రప్రజలందరి కార్యక్రమం. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయపక్షాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈనెల 21న ఆర్ కె బీచ్ నుంచి భీమిలి వరకు 26 కి.మీ.ల పొడవున 247 కంపార్ట్ మెంట్లలో నిర్వహించే…
అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో అరెస్టయిన సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం గుంటూరు జిల్లా జైలుకు ఆయనను తరలించారు. నాలుగు రోజుల కిందట సాక్షి టీవీ ఛానెల్లో ప్రసారమైన ‘కేఎస్ఆర్ లైవ్ షో’లో అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యల్ని ఖండించకపోగా వాటిని కొనసాగించేందుకు మరింత ఊతమిచ్చారని అనుచిత వ్యాఖ్యలపై గత రెండురోజులుగా రాష్ట్రమంతటా మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్న విషయం తెలిసిందే.
