Author: admin

ఫిజిక్స్ వాలా ఎడ్యుటెక్ కంపెనీ తన పరిశ్రమ భాగస్వామి అమెజాన్ వెబ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో AI-ఫోకస్డ్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ (యూ.ఓ.ఐయ)ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఇన్నోవేషన్ యూనివర్సిటీ అకడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్స్ ను ఏకీకృతం చేసే దిశగా ఇది పని చేస్తుంది. పరిశోధన, విద్య, ఉపాధిలో కీలక సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుందని లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ తో ఎంఓయూ రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (టిబిఐ)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ప్రస్తుత వ్యవస్థలో నైపుణ్య అంతరాలను గుర్తించి గ్లోబల్…

Read More

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఛైర్మన్ పదవికి తన పేరును పరిశీలిస్తున్నట్లు వస్తున్న వార్తల పట్ల సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ స్పందించారు. ఈవార్తలలో నిజం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రిటైర్మెంట్ జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు. ఆయన గత నెల 10న పదవీవిరమణ చేసిన విషయం తెలిసిందే. ఇక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఛైర్మన్ ను ఎంపిక చేసే కమిటీలో ప్రధాన మంత్రి, కేంద్ర హోంమంత్రి, లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్,ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు సభ్యులుగా ఉంటారు.ఇటీవలే వీరు సమావేశమయ్యారు. ఎన్.హెచ్.ఆర్.సీ పదవికి మాములుగా మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఉంటారు. వీరి పేర్లను ఎంపిక కమిటీ రాష్ట్రపతికి సిఫార్సు చేసిన అనంతరం నియమింపబడతారు. జస్టిస్ మిశ్రా ఇదివరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన పదవీవిరమణ తరువాత తాత్కాలిక ఛైర్ పర్సన్ గా ఎన్.హెచ్.ఆర్.సీ…

Read More

రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి రవాణా , యువజన, క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీ గాడి తప్పిందని కూటమి సర్కారు ఏర్పడిన తరువాత దానిని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆయన తాజాగా విశాఖలో పర్యటించారు. ద్వారకా బస్ స్టేషన్ ను సందర్శించి అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయో ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఇక విజయనగరంలోని డిపో గ్యారేజ్ లో 10 కొత్త బస్సులు ప్రారంభించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

ఉత్తరాంధ్రలో రెండ్రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం తాజాగా వాయుగుండంగా బలపడినట్టు వాతావరణశాఖ తెలిపింది. నిన్న సాయంత్రానికి చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు 450 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాలపూర్ కు 640 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు వివరించారు. ఇక భారీగా కురుస్తున్న వర్షాల వలన అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని వేలాది హెక్టార్లలో పంటలు ధ్వంసమయ్యాయి. వర్షాలు నేడు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, విశాఖపట్నం, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం,శ్రీకాకుళం విజయనగరం, జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More

ఏపీలో కొన్ని బ్రాండ్ల మద్యం ధరలు తగ్గనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం బేస్ ధర భారీగా పెంచేసిన కంపెనీలు కొన్ని వాటంతటవే తగ్గించుకున్న నేపథ్యంలో ఆయా బ్రాండ్లను బట్టి ధరలు కొంత మేరకు తగ్గనున్నాయి.11 కంపెనీలు ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బేసిక్ ధర గణనీయంగా తగ్గడంతో క్వార్టర్ పై దాదాపు రూ.30 వరకు తగ్గనున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి నూతన మద్యం పాలసీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు కొంత తగ్గిన ధరలు ఇప్పుడు మరింత తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్పుడు లేని కొన్ని బ్రాండెడ్ కంపెనీల మద్యం కూడా అందుబాటులోకి వచ్చింది.

Read More

గత ఏడాది విడుదల అయిన ‘ సలార్ ‘ తో ప్రేక్షకులను అలరించారు నటి శ్రియా రెడ్డి. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘ ఓజీ ‘ కోసం వర్క్ చేస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న శ్రియా రెడ్డి ఓజీ విశేషలతోపాటు పవన్ గురించి మాట్లాడారు. “ పవన్ కాంబినేషన్ లో ఇప్పటికే కొన్ని సన్నివేశాలు చేశా.ఆయన చాలా తెలివైన వ్యక్తి…ఎంతో హుందాగా ఉంటారు.మర్యాదగా వ్యవహరిస్తుంటారు.ఆయనొక అద్భుతమైన వ్యక్తి…ఎదుటి వ్యక్తులతో ఆయన ప్రవర్తన,మాట తీరు నన్ను ఎంతగానో ఆకర్షించింది” అని ఆమె చెప్పారు.పవన్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తోన్న సినిమా ‘ఓజీ’.డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య దీనిని నిర్మిస్తున్నారు.ఇందులో ప్రియాంకమోహన్ కథానాయికగా నటిస్తుంది.ఇమ్రాన్ హష్మీ కీలకపాత్ర పోషించారు.ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.

Read More

1999లో జమ్మూకశ్మీర్ లోని కార్గిల్ ఆక్రమణ కోసం దాయాది దేశం పాకిస్తాన్ పన్నిన కుట్రను భారత సైన్యం భగ్నం చేసిన విషయం తెలిసిందే.మన దేశంలోకి చొచ్చుకొచ్చిన పాక్ బలగాలను చిత్తుగా ఓడించి తరిమికొట్టింది.ఈ యుద్ధంలో శత్రువులు చొరబాటును ముందుగా గుర్తించి మన జవాన్లను అప్రమత్తం చేసింది మాత్రం తాషి నామ్యాల్ అనే సామాన్య గొర్రెల కాపరి.తాజాగా ఆయన కన్నుమూశారు.ఈ విషయాన్ని లేప్ లోని ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ వెల్లడించింది.ఆర్యన్ వ్యాలీలో హఠాణ్మరణం చెందినట్లు తెలిపింది.ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు.ఆయన మృతిపై సైన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.”ఓ దేశ భక్తుడిని కోల్పోయాం.లద్దాఖ్ ధైర్యానికి ఆత్మశాంతి చేకూర 1999 ఆపరేషన్ విజయ్ సమయంలో ఆయన అందించిన సహకారం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటుంది.ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం” అని ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది

Read More

పుష్ప 2 ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన పొరపాటుకు నటి రష్మిక సారీ చెప్పారు.తప్పు తనదే అని తెలిపారు.తాను చేసిన తప్పును ఉద్దేశించి ఒక నెటిజన్ పోస్ట్ పెట్టగా.. ‘అవును…తెలుసు.. సారీ..ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అనుకున్నా అరేయ్ ఒక్కడు రీమేక్ గిల్లి.. పోకిరి రీమేక్ పొక్కిరి.ఇప్పుడు సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తుంటారు.ఏది ఏమైనా తప్పు నాదే.కానీ ఆసినిమాలు అన్ని నాకు ఇష్టమే ‘ అని రష్మిక తెలిపారు.ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో కోలీవుడ్ హీరో విజయ్ అంటే తనకు ఎంత ఇష్టమో రష్మిక చెప్పారు.ఆయన సినిమాల గురించి మాట్లాడారు.ఆ సమయంలో గిల్లి సినిమా తెలుగు సినిమా పోకిరి రీమేక్ అని తాను తెలుసుకున్నానని తప్పుగా చెప్పారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Read More

గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉంది కూటమి ప్రభుత్వం ఉందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్.కోట పోలీసులు డిసెంబరు 19న బొడ్డవర చెక్ పోస్టు వద్ద కేరళ రాష్ట్రానికి తరలిస్తున్న 117 కిలోల గంజాయిని చాకచక్యంగా పట్టుకున్నారు. సినిమాల్లో స్మగ్లర్ల మాదిరి వాహనంలోనే సెపరేట్ డెన్‌లో రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులను అభినందిస్తూ మంత్రి లోకేష్ ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉంది కూటమి ప్రభుత్వం. పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఎస్.కోట పోలీసులు డిసెంబరు 19న బొడ్డవర చెక్ పోస్టు వద్ద కేరళ రాష్ట్రానికి… pic.twitter.com/13Kikst8v3— Lokesh Nara (@naralokesh) December 20, 2024

Read More

నేటి నుండి ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే టోర్నీ ప్రారంభం కానుంది. భారత జట్టులో స్థానం కోసం యువ క్రీడాకారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో బరిలోకి దిగుతున్నారు. ఇక ఈ టోర్నీలో శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ వంటి అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు ఈ టోర్నీ లో ఆడుతున్నారు. 50 ఓవర్ల ఫార్మాట్ లో తమ ప్రతిభ చూపించుకునేందుకు ఈ ఫార్మాట్ యువ క్రీడాకారులకు ఉపయోగపడనుంది. మరో రెండు నెలల్లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండడంతో ఇందులో రాణించి జట్టులో స్థానం సంపాదించాలని పలువురు క్రికెటర్లు పోటీపడుతున్నారు.

Read More