జానపద కళాకారుడు ‘బలగం’ చిత్రంతో విశేషంగా గుర్తింపు పొందిన మొగిలయ్య కన్నుమూశారు. కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురించి తెలుసుకొని మొగిలయ్య చికిత్స కోసం మెగాస్టార్ చిరంజీవి, ‘బలగం’ మూవీ దర్శకుడు వేణు చేయూత అందించారు. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు వరంగల్లోని ఒక హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నేడు కన్ను మూశారు. ఇక గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కి ఘన విజయాన్ని అందుకున్న ‘బలగం’ చిత్రంలో క్లైమాక్స్ వచ్చే భావోద్వేగభరితమైన పాటను ఆలపించి మొగిలయ్య ప్రేక్షకుల మన్ననలు పొందారు.
Author: admin
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం కోస్తా తీరం వైపుగా పయనిస్తుందని దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలవైపు వెళ్తుందని, ఆ తర్వాత కోస్తా తీరం వెంబడి కదులుతుందని వివరించింది. దీని ప్రభావంతో భారీ వర్షాలకు తోడు తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, కావున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, పరిటాల రవి హత్య కేసులో 5 ముద్దాయిలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఈ హత్య జరిగిన 18 ఏళ్లకు ముద్దాయిలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.అయితే ఈ కేసులో A3గా ఉన్న పండుగ నారాయణరెడ్డి,A4గా ఉన్న రేఖమయ్య, A5గా ఉన్న బజన రంగనాయకులు, A6గా ఉన్న వడ్డే కొండ, A8గా ఉన్న ఓబిరెడ్డిలకు బెయిల్ మంజూరు అయ్యింది.అయితే ఈ మేరకు హైకోర్టు కొన్ని షరతులు విధించింది.ప్రతి సోమవారం పోలీసుల ఎదుట హాజరు కావాలని, 25 వేల రూపాయలతో రెండు పూచీ కత్తులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.అంతే కాదు జైలు నుండి విడుదలయ్యాక నడవడిక బాగోలేనట్టుగా ఫిర్యాదు వస్తే బెయిల్ రద్దు చేస్తామని తెలిపింది.
ప్రపంచ చెస్ చాంపియన్ గుఖేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన ఇష్టాలు, అభిరుచుల గురించి మాట్లాడారు. సమయం దొరికినప్పుడు తాను సినిమాలు చూస్తుంటాను అని చెప్పారు. ‘ నేను సినిమాలు చూస్తుంటా. నచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం అంటే ఇష్టం. తమిళంలో సూర్య యాక్ట్ చేసిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఇష్టం. హాలీవుడ్ లో అబౌట్ టైం నచ్చిన చిత్రం ‘ అని గుఖేశ్ తెలిపారు. చెన్నైకు చెందిన గుఖేశ్ 18 ఏళ్ల వయసులోనే వరల్డ్ చెస్ చాంపియన్ గా విజయాన్ని అందుకున్నారు. ఆ రికార్డు సాధించిన అతి పిన్న వస్కుడు ఇతడే.
కేరళ రాష్ట్రంలో ‘మంకీపాక్స్’ కలకలం రేపుతోంది. కొత్తగా కేరళలో రెండు కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇటీవల యూఏఈ నుండి వచ్చిన ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వయనాడ్ కు చెందిన ఒక వ్యక్తికి మొదట మంకీపాక్స్ నిర్ధారణ కాగా, తాజాగా కన్నూర్ జిల్లాకు చెందిన వ్యక్తికి వచ్చినట్లు తేలింది. దీంతో అధికారులు వారితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ లో కూడా ఈ మంకీ పాక్స్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
రైతులు వ్యవసాయ పనుల్లో క్రిమిసంహారక మందులను వాడేటప్పుడు హానికారక రసాయనాల ప్రభావానికి గురికాకుండా ఉండే విధంగా రూపకల్పన చేసిన ‘కిసాన్ కవచ్’ అనబడే క్రిమిసంహారక మందుల నిరోధక బాడీసూట్ ను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. కిసాన్ కవచ్ మొదటి బ్యాచ్ దుస్తుల్ని కొంతమంది రైతులకు పంపిణీ చేశారు. రైతుల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఈ ప్రత్యేక దుస్తులు రక్షణనిస్తాయి. దీని అత్యంత అధునాతన ఫ్యాబ్రిక్ టెక్నాలజీ క్రిమిసంహారక మందుల ప్రభావాన్ని డీయాక్టివేట్ చేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహకారంతో, బెంగళూరుకు చెందిన ‘బ్రిక్-ఇన్- స్టెమ్’, సిపియో హెల్త్ ప్రై.లిమిటెడ్ లు సంయుక్తంగా వీటిని రూపొందించాయి. ఈ ‘కిసాన్ కవచ్’ దుస్తుల ధర రూ.4,000గా ఉంది అయితే వీటిని ఉతికి శుభ్రం చేసుకొని మాములుగానే పునర్వినియోగించుకోవచ్చు.
కాంగ్రెస్ దేశంలో అవాస్తవాలను వ్యాప్తిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. రాజ్యసభలో నిన్న తాను చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ వక్రీకరించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కు వ్యతిరేకమని విమర్శించారు. నేడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిన తీరును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ వ్యతిరేకి, రిజర్వేషన్ల వ్యతిరేకి, రాజ్యాంగ వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ ఏనాడూ అంబేడ్కర్ స్మారకాన్ని నిర్మించలేదని పేర్కొన్నారు. అంబేద్కర్ ను గౌరవించింది తమ ప్రభుత్వమేనని నొక్కి చెప్పారు. ఎన్నడూ అంబేద్కర్ ను అవమానించని పార్టీ నుంచి తాను వచ్చానని అమిత్ షా అన్నారు. స్పష్టంగా తన ప్రసంగం రాజ్యసభ రికార్డుల్లో ఉందని పేర్కొన్నారు. కలలో కూడా అంబేద్కర్ ఆలోచలను అవమానించలేని పార్టీ, సిద్ధాంతం నుంచి వచ్చానని అమిత్ షా అన్నారు. రాజ్యసభలో…
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక బాలుడికి జికా వైరస్ సోకిందనే ప్రచారం నేపథ్యంలో దీనిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. అనారోగ్యానికి గురైన బాలుడికి మెరుగైన వైద్యం అందించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్పోరేట్ వైద్యం కోసం చెన్నై తరలించారు. బాలుడి రక్త నమూనాలను టెస్టుల కోసం పూణే ల్యాబ్ కు పంపారు. బాలుడు స్వగ్రామమైన వెంకటాపురానికి ప్రత్యేక వైద్య బృందాలు వెళ్లినట్లు తెలిపారు. బాలుడి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులకు వైద్య పరీక్షలు చేస్తున్నారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఢిల్లీలోని సీనియర్ సిటిజన్స్ అందరికీ అన్ని ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈమేరకు హామీ ఇచ్చింది. మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే 60 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ‘సంజీవని యోజన’ కింద ఉచిత వైద్యం అందిస్తామని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. వయోవృద్ధుల సంరక్షణ తమ బాధ్యత అని పేర్కొన్నారు. వారు కష్టపడి పనిచేసే దేశాన్ని ముందుకు తీసుకొచ్చారని వివరించారు. సీనియర్ సిటిజన్స్ వైద్యానికి అయ్యే ఖర్చుకు గరిష్ట పరిమితి ఏమీ లేదని స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను సినీ నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు.బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ గత రెండు వారాలుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
