అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప 2 ది రూల్.ఈ సినిమా పట్నా ఈవెంట్ ను ఉద్దేశించి నటుడు సిద్ధార్థ్ వైరల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.ఆయన కామెంట్స్ వైరల్ గా మారిన తరుణంలో దానిపై క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు అని తెలిపారు.తనకు ఏ హీరో మీద కోపం లేదని అన్నారు. ఇండస్ట్రీ ఎప్పుడూ కళ కళలాడుతూ ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.నిర్మాతలకు మంచి జరగాలని.. నటీనటులకు తగిన గుర్తింపు రావాలని ఆయన తెలిపారు.పుష్ప ఈవెంట్ కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడాన్ని ఉద్దేశించి ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ జరిగినప్పుడు నాలుగు జెసీబి లు వస్తె వాటిని చూడడానికి కూడా చాలామంది జనం వస్తారు అన్నారు.ఇది సోషల్ మీడియా లో వివాదానికి దారి తీసింది.
Author: admin
మంచు లక్ష్మి తాజాగా షేర్ చేసిన ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ప్రపంచంలో ఏదీ నీది కానప్పుడు ఎదో కొల్పోతున్నమనే భయం నీకు ఎందుకు? అనే మెసేజ్ ను ఆమె ఇన్స్టలో పంచుకున్నారు.మంచు కుటుంబంలో వివాదం వేళ ఆమె షేర్ ఈ సందేశం ఆన్లైన్ లో వైరల్ అయింది.ప్రస్తుతం ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.ప్రస్తుతం ఆమె ముంబయిలో ఉన్నారు.నిన్న తన కుమార్తె వీడియో షేర్ చేసిన ఆమె పీస్ (శాంతి) అని కాప్షన్ జత చేశారు.
జమిలి ఎన్నికలతో దేశంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని ఈ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్,మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తెలిపారు.జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల దేశ జీడీపీ 1 శాతం నుండి 1.5 శాతానికి పెరుగుతుందని చెప్పారు. పీఎఫ్ :- ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ మరింత సులభతరం కానుంది.ఉద్యోగులు తమ పీఎఫ్‌ను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు కార్మికశాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పల్నాడు జిల్లాలో సరస్వతీ పవర్ ఇండస్ట్రీలోని అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తహాసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా 17.69 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. మాచవరం మండలం వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లి లో 3.89 ఎకరాలు తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో మాచవరానికి చెందిన సరస్వతి పవర్ భూముల పరిశీలన చేసి రెవెన్యూ అధికారుల నివేదిక అనంతరం కూటమి ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. సరస్వతి పవర్ భూములను స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ పరిశీలించిన భూసేకరణపై సమగ్ర విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడుకు చెందిన హవల్దార్ వరికుంట్ల సుబ్బయ్య (45) 30 మంది సైనికులను కాపాడి వీరమరణం పొందారు.జమ్మూలోని ఎల్ఎసీ వెంట 30 మంది జవాన్లతో కలిసి సుబ్బయ్య పెట్రోలింగ్ చేస్తున్నారు.ఈ క్రమంలో ఆయన ల్యాండ్ మైన్ పై కాలు పెట్టారు. ఇది గమనించి తన తోటి సైనికులను GO BACK అంటూ…గట్టిగా అరిచారు.ఆ తర్వాత అది ఒక్కసారిగా పేలడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచిందని ఆయన పేర్కొన్నారు. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆరు నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దామని అన్నారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టినట్లు వివరించారు. ‘రాష్ట్రమే ఫస్ట్…ప్రజలే ఫైనల్’ అనే నినాదంతో ప్రతిక్షణం ప్రజలకు మంచి చేసేందుకు…
జగన్ పాలనలో ఏ రోజైనా రైతులకి సక్రమంగా డబ్బులు చెల్లించారా? అని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. రైతులను దగా చేసిన మీకు ర్యాలీలు చేసే అర్హత ఉందా? అని ఆక్షేపించారు. కనీసం గోతాలు కూడా సరిపడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. మీ చేతగాని పాలనలో ఈ సమయానికి- కేవలం 8.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని వైసీపీపై మండిపడ్డారు. బాధ్యత కలిగిన కూటమి ప్రభుత్వం 15.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 48 గంటలలోపే డబ్బులు జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుకి ఎవరు అండగా నిలబడ్డారో ఒకసారి చూడండని గణాంకాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. #WakeupJagan రైతుకి ఎవరు అండగా నిలబడ్డారో ఒకసారి చూడండి. మీ చేతగాని పాలనలో ఈ సమయానికి- కేవలం 8.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు.బాధ్యత కలిగిన మా…
యూపీఏ ప్రభుత్వ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. తమ మిత్రుల కోసం మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను అపరిమిత నిధుల వనరుగా ఉపయోగించడం ఆపాలని చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ కు చెందిన ప్రతినిధులతో రాహుల్ గాంధీ సమావేశమయైన నేపథ్యంలో రాహుల్ కేంద్రం పై విమర్శలు చేశారు. ఈమేరకు‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా బదులిచ్చారు. ఆమె ‘ఎక్స్’ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలు కష్టపడి పనిచేసే ఉద్యోగులు మరియు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలను అవమానించడమేనని అన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి అమితాసక్తి అని అన్నారు. ఇక ప్రధాని మోడీ నేతృత్వంలో భారత ప్రభుత్వ రంగం…
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో తాజాగా జరిగిన 13వ గేమ్ డ్రాగా ముగిసింది. 69 ఎత్తుల వద్ద ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. దీంతో ఇరువురు ఆటగాళ్లు మళ్లీ 6.5-6.5 తో సమంగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు మొదటి గేమ్ లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ గెలుపొందగా.. రెండో గేమ్ డ్రా అయింది. మూడో గేమ్ లో భారత యువ కెరటం గుకేశ్ విజయం సాధించి సమం చేశాడు. ఆతర్వాత నుండి వరుసగా 7 డ్రా లతో ఈ ఛాంపియన్ షిప్ సాగింది. తరువాత గుకేశ్, లిరెన్ లు చెరొక విజయంతో నిలిచారు. మొత్తంగా ఇద్దరూ చెరొక రెండు గెలుపులు సాధించగా…తాజాగా జరిగిన డ్రాతో మొత్తం 9 గేమ్ లు డ్రా అయ్యాయి. ఇక ఈ ఛాంపియన్ షిప్ లో ఇంకా 1 రౌండ్ మాత్రమే మిగిలి ఉంది. ఆఖరి రౌండ్ కూడ డ్రాగా ముగిస్తే టై బ్రేక్ ద్వారా విజేత…
2024 ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వైసీపీ నుండి చాలా మంది నాయకులు బయటకు వెళ్లిపోతున్నారు. తాజాగా మరో కీలక నేత ఆపార్టీకి గుడ్ బై చెప్పేశారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీనివాసరావు) వైసీపీకి రాజీనామా చేశారు. ఈమేరకు వై.ఎస్.జగన్ కు రాజీనామా లేఖను రాశారు. వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వలన భీమిలి నియోజకవర్గం ఇంచార్జి బాధ్యతలకు మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాదమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. మీరు ఇచ్చిన అవకాశానికి నా ధన్యవాదములు నా రాజీనామా ను ఆమోదించి వలసిందిగా కోరుచున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు.
