Author: admin

ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే అధికారులను క్షమించేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పౌరసరఫరాల, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసి ధాన్యం కొనుగోలుపై దృష్టి సారించాలని ఆదేశించారు. చిన్నచిన్న సమస్యలు సాకుగా చూపి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదని సీఎం అన్నారు. ఇక మరోవైపు పేదరికం నిర్మూలన సంబంధిత అంశాలపై ఆయన సమీక్షాసమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబాన్ని ఒక్కో యూనిట్‌గా తీసుకుని వారి కుటుంబ సభ్యుల ప్రొఫైల్‌కు తగ్గట్టు ప్రభుత్వ పథకాలు అందించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.

Read More

ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో మళ్లీ మరో గేమ్ డ్రాగా ముగిసింది. ఇప్పటివరకు మొదటి గేమ్ లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ గెలుపొందగా.. రెండో గేమ్ డ్రా అయింది. మూడో గేమ్ లో భారత యువ కెరటం గుకేశ్ విజయం సాధించి సమంగా నిలిచాడు. ఆతర్వాత జరిగిన నాలుగు గేమ్ లు డ్రాగా ముగిసాయి. తాజాగా జరిగిన 8వ గేమ్ కూడా డ్రాగానే ముగిసింది. 51వ ఎత్తు వద్ద గేమ్ డ్రా గా ముగిసింది. వరుసగా 5 గేమ్ లను డ్రాగా ముగించిన చెరో 4 పాయింట్లతో సమానంగా కొనసాగుతున్నారు. మొత్తంగా ఇది 6వ డ్రా. ఈ ఛాంపియన్ షిప్ లో ఇంకా 6 గేమ్ లు ఉన్నాయి.

Read More

జూనియర్ ఆసియా కప్ హాకీ లో భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. వరుసగా భారత్ కు ఇది మూడో టైటిల్ కావడం విశేషం. మొత్తంగా చూస్తే ఇది ఐదవ టైటిల్. ఇదివరకు 2004, 2008, 2015, 2023లో టైటిల్స్ సాధించింది. 2021 కోవిడ్ కారణంగా టోర్నీ నిర్వహించలేదు. ఇక తాజాగా జరిగిన ఫైనల్ లో 5-3 తేడాతో పాకిస్థాన్ పై విజయఢంకా మోగించింది. నాలుగు గోల్స్ చేసి ఆర్జీత్ భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దిల్ రాజ్ సింగ్ ఒక గోల్ చేశాడు. పాక్ తరపున సుఫియాన్ రెండు గోల్స్, హాసన్ షాహిద్ ఒక గోల్ చేశారు. ఈ టోర్నీలో జపాన్ మలేషియాపై 2-1 తో నెగ్గి మూడో స్థానంలో నిలిచింది.

Read More

పుష్ప ది రూల్ ప్రీమియర్ షో లో అపశ్రుతి చోటు చేసుకుంది.అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కు వచ్చారు.దీంతో థియేటర్ ప్రాంగణం అంత అభిమానులతో కిటకిటలాడింది. అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రాగానే ఆయన్ని చూసేందుకు ఫ్యాన్స్ అత్యుత్సం ప్రదర్శించారు.తోపులాట జరిగింది.అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.ఈ క్రమంలో ఒక బాలుడు అస్వస్థత కు గురయ్యాడు.వెంటనే స్పందించిన పోలీసులు అతడికి సీపీఆర్ చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

Read More

ప్రముఖ నటులు నాగచైతన్య-శోబితాల వివాహం వేడుకగా జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినిమా పరిశ్రమ నుండి అతిరథమహారధులు ఈ వేడుకలో పాల్గొన్నారు. చిరంజీవి, రామ్ చరణ్, వెంకటేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖులు కొత్త జంటకు తమ శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించారు. నాగార్జున తన ఆనందాన్ని పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నా ప్రియమైన చైతన్యకి శుభాకాంక్షలు. ఈ అందమైన అధ్యాయాన్ని మరియు శోభిత చై కలిసి ప్రారంభించడం నాకు ఒక ప్రత్యేకమైన, భావోద్వేగ క్షణంగా నిలిచింది. మా కుటుంబానికి స్వాగతం, ప్రియమైన శోభిత. మీరు ఇప్పటికే మా జీవితాలలో ఎంతో ఆనందాన్ని తీసుకువచ్చారు. ఏఎన్నార్ గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వారి విగ్రహం వద్ద వారి ఆశీర్వాదంతో ఈవేడుక జరగడం ఈ సంబరానికి మరింత ప్రత్యేకతని తీసుకొచ్చింది. ఈ…

Read More

నటుడు, జనసేన నేత నాగబాబు తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.పుష్ప చిత్రం కోసం ఎంతోమంది కష్టపడతారని అన్నారు.సినిమాని ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు.’ 24 క్రాఫ్టల కష్టం..వందల మంది టెక్నీషియన్స్ శ్రమ.. వేల‌ మందికి ఉపాధి కలిగించి,కోట్ల మందిని అలరించేదే సినిమా.ప్రతి చిత్రం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.అందరిని అలరించే సినిమాని సినిమాలానే ఆదరించాలని,ప్రతి మెగా అభిమానిని,ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.అల్లు అర్జున్ నటించిన పుష్ప విడుదల అవుతున్న సమయంలో నాగబాబు పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

Read More

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం పుష్ప ది రూల్.రేపు ఈ చిత్రం విడుదల కానుంది.ఫ్యాన్స్ మంచి నుంచి ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈరోజు రాత్రి నుంచి పలు రాష్ట్రాల్లో మిడ్ నైట్ షోస్ ఏర్పాటు చేశారు.ఇదిలా ఉండగా బెంగళూరులో మిడ్ నైట్ కు పర్మిషన్ రద్దు చేస్తూ కలెక్టర్ తాజాగా ఉత్తర్వులు జారి చేశారు.ఉదయం ఆరు గంటలకు ముందు సినిమాలు ప్రదర్శించడం చట్ట విరుద్ధమని కర్ణాటక ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.తెల్లవారుజామున షోలు ప్రదర్శించడానికి కూడా అంగీకరించలేదు.దీనిపై కర్ణాటకలోని అల్లు అర్జున్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఇందులో రష్మిక కథానాయికగా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్, తమన్, సామ్ మ్యూజిక్ అందించారు.

Read More

ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వయసును మార్చే దాని గురించి ఎటువంటి అంశం పరి‌శీలనలో లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటులో తెలిపారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అందులో దీని గురించి పేర్కొన్నారు. ఇక ఖాళీగా ఉన్న పోస్టులను సమయానుకూలంగా భర్తీ చేయమని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. మిషన్ మోడ్ లో ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు వివరించారు. యువతకు ఉపాధి కల్పించే అవకాశాలు, కార్యక్రమాలు రూపొందించడంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

Read More

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్.ఆమె ప్రభుత్వం దేశాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందని అన్నారు.ప్రజలు ఇబ్బందులు పడటానికి ఆమె కారణం అన్నారు.ప్రస్తుతానికి తమ దేశం లో ఎన్నికలు నిర్వహించమని అక్కడి మీడియా తో తెలిపారు. న్యాయ,రాజ్యాంగ పరమైన సవరణలు ఎన్నో చేయాలని అన్నారు.అవి పూర్తి అయ్యాకే ఎలక్షన్స్ ఉంటాయని అన్నారు.మరోవైపు,ఇటీవల యూనాస్ ను తప్పుబడుతూ హసీనా ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడుల వెనుక మాస్టర్ మైండ్ ఆయనదే అన్నారు.తనపై కావాలనే తప్పుడు కేసులు పెట్టారని వ్యాఖ్యానించారు.

Read More

సాయిపల్లవి,శివ కార్తికేయన్ జంటగా నటించిన చిత్రం అమరన్.ఈ చిత్రం ఓటీటీ విడుదలను నిలిపివేయాలని కోరుతూ చెన్నైకు చెందిన విఘ్నేశన్‌ తాజాగా మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించాడు.‘అమరన్‌’ చిత్రం వల్ల తనకు ఇబ్బంది కలిగిందని పేర్కొన్నాడు ఇప్పటికే చిత్రబృందానికి లీగల్ నోటీసు పంపించామని పేర్కొన్నాడు.ఇంత జరిగినా చిత్రం నుండి తన ఫోన్ నెంబర్ తొలగించలేదని చెప్పాడు.కనుక ఈ చిత్రం ఓటీటీ విడుదలను నిలిపి వేయాలని కోరాడు.చిత్రబృందం నుండి రూ.1.1 కోటి పరిహారంగా ఇప్పించమని కోరాడు.దీపావళి కానుకగా ‘అమరన్‌’ విడుదలైంది.ఇందులోని ఒక సన్నివేశంలో సాయిపల్లవి.. శివ కార్తికేయన్ కు తన ఫోన్‌ నంబర్‌ ఇస్తుంది.అది నిజంగానే సాయిపల్లవి ఫోన్‌ నంబర్‌ అదేనని భావించిన పలువురు అభిమానులు కాల్స్‌ చేశారు.ఈ చిత్రంలో చూపించిన నంబర్‌ తనదేననీ వరుస ఫోన్‌ కాల్స్‌,సందేశాల వల్ల ప్రశాంతత లేకుండా పోయిందని విఘ్నేశన్‌ పేర్కొన్నాడు.పరిహారం కోరుతూ గత నెలలో మూవీ టీమ్ కి లీగల్ నోటీసు పంపించాడు.రేపు ఈ చిత్రం ఓటీటీలో విడుదల…

Read More