Author: admin

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల జోరు కొనసాగుతోంది. వరుసగా నాలుగో సెషన్ లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 110 పాయింట్ల లాభంతో 80,956 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 10 పాయింట్ల లాభంతో 24,467 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.74గా ఉంది. టైటాన్, టీసీఎస్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్.డి.ఎఫ్.సి షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

తెలుగు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు.ఈ విషయాన్ని ఆయన తండ్రి నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు.తాజాగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన సాయి శ్రీనివాస్‌ పెళ్లి త్వరలోనే ఉంటుందని, గణేశ్‌ది మాత్రం కాస్త సమయం ఉందని తెలిపారు.ఈ మేరకు మాస్ మహారాజ్ రవితేజ పుట్టినరోజును పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి 26న ‘నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమోరిస్‌’ రీ రిలీజ్‌ చేయనున్నానని వెల్లడించారు.

Read More

రైతు పండించిన ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. చల్లపల్లి మండలం పాత మాజేరు, మంగళాపురం, చల్లపల్లి, కాసానగరం, పెదప్రోలు, ఘంటసాల మండలం లంకపల్లి తదితర గ్రామాల పరిధిలో మంత్రి మనోహర్ క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు.రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని ధాన్యం తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవద్దని పేర్కొన్నారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగొళ్లలో సమస్యలపై రైతులను ఆరా తీశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తేమ శాతం అటూ ఇటూగా ఉన్నా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రంలోపు రైతులు సిద్ధం చేసిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్‌ కూడా పాల్గొన్నారు.

Read More

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికయ్యారు. ఈమేరకు నేడు జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఆయనను నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిసెంబర్ 5న ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆజాద్ మైదానం వేదికగా జరుగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా ఎన్డీయే కూటమి నేతలు హాజరుకానున్నారు. మహారాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమిగా ఏర్పడిన బీజేపీ-శిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీలు భారీ విజయం సాధించాయి. ఈ మూడు పార్టీలు కలిసి 230 స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ 132 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. శిండే-శివసేన 57, అజిత్ పవార్ ఎన్సీపీ 41 స్థానాలలో గెలుపొందాయి. ఇంత భారీ మెజారిటీతో గెలిచి కూడా ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం ఇప్పటి వరకు కొంత ప్రతిష్టంభన నెలకొంది. అయితే తాజాగా ఆ ప్రతిష్టంభనకు తెరపడింది.

Read More

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్ ఇటీవల జరిగిన ఘర్షణల నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ఆయన సోదరి వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా బయలుదేరారు. కాగా, స్థానికేతరులు అక్కడికి రావడంపై ఆంక్షలు ఉండడంతో ఘాజీపూర్ సరిహద్దు వద్ద వారిని యూపీ పోలీసులు అడ్డుకున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో నేటి ఉదయం నుండే ఢిల్లీ సరిహద్దులలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఘాజీపూర్ సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read More

రానున్న మూడు సంవత్సరాలలో రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం పాత టెండర్లను రద్దు చేయడంతో కొత్త టెండర్లను పిలిచినట్లు పేర్కొన్నారు. దీంతో రూ. 2,507 కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వంపై పడిందన్నారు.రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అభివృద్ధిపై సీ.ఆర్.డి.ఏ అథారిటీ సమావేశ నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని వివరించారు. రూ.11,471 కోట్ల రూపాయలతో అమరావతిలో పనులు చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అమరావతిని ప్రపంచంలోనే ఐదు అద్భతమైన రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

Read More

బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానపరిచాడన్న నేపంతో బంగ్లాదేశ్ లో ఇస్కాన్ సంస్థకు చెందిన ఆధ్యాత్మిక గురువు చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈరోజు ఆయన కేసు కోర్టులో విచారణకు రాగా,బంగ్లాదేశ్ లో ఒక్క న్యాయవాది కూడా ఆయన తరఫున వాదించేందుకు ముందుకు రాలేదు.కొన్ని రోజుల కిందట చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేసినప్పుడు ఆయన తరఫున న్యాయవాది రీగర్ ఆచార్య కోర్టులో వాదనలు వినిపించారు.దీనితో రీగన్ ఆచార్యపై కొందరు వ్యక్తులు తీవ్రస్థాయిలో దాడి చేశారు.రీగన్ ఆచార్యను బాగా కొట్టడంతోపాటు, ఆయన ఛాంబర్ ను కూడా ధ్వంసం చేశారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ఇస్కాన్ అధికార ప్రతినిధి రాధారమణ్ దాస్ స్పందిస్తూ…బంగ్లాదేశ్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని,చిన్మయ్ కృష్ణదాస్ తరఫున వాదించిన న్యాయవాది రీగన్ ఆచార్యపై కిరాతకంగా దాడి చేశారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్మయ్ కృష్ణదాస్ తరఫున వాదించేందుకు ఏ న్యాయవాది ముందుకొస్తాడని ఆవేదన వ్యక్తం…

Read More

వైసీపీ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్‌గా మారితే.. వాటిని చూసి మౌనం వహించడం కూటమి సర్కార్ ట్రెండ్‌గా పెట్టుకుందని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఏ ఒక్క ఆస్తిపై, కనీసం ఒక్క చర్య కూడా లేదు. విచారణకు సైతం దిక్కులేదు. రాష్ట్రంలో కాకినాడ పోర్టు ఒక్కటే కాదు..కృష్ణపట్నం పోర్టును గుంజుకున్నారు. ప్రభుత్వ ఆధీనంలో అత్యధిక లాభాలు గడించే గంగవరం పోర్టును అప్పనంగా అమ్మేశారని దుయ్యబట్టారు. ఏపీని పోర్టులకు హబ్‌గా మార్చే పాలసీలు సరే. మరి గంగవరం పోర్ట్ సంగతేంటి..? అని ప్రశ్నించారు. ప్రతి ఏటా దాదాపు రూ.2వేల కోట్ల లాభాలు గడించే పోర్టును గత వైసీపీ ప్రభుత్వం 2021లో అదానీకి రాసి ఇచ్చింది. నికర ఆర్థిక నిల్వలతో పాటు.. రూ.9వేల కోట్ల విలువజేసే 10 శాతం వాటాను కేవలం రూ.640 కోట్లకు పుట్నాల కింద అమ్మారని పేర్కొన్నారు. 2,800…

Read More

పౌరులకు సదుపాయాలు కల్పించేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు, నేరాల అదుపునకు, పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవడానికి డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బెంగ‌ళూరుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ తాము రూపొందించిన మ‌ల్టీ ప‌ర్ప‌స్ డ్రోన్లను సీఎం ఎదుట ప్రదర్శించారు. డ్రోన్ వినియోగం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచాల‌ని కూడా ఈ సందర్భంగా సీఎం సూచించారు. ర‌వాణా స‌దుపాయాలు లేని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు మందులు సరఫరా చేసేందుకు డ్రోన్లను వినియోగించాలని కూడా సీఎం స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం నుండి ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త:ప్రతి కుటుంబం నుండి ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఉద్భవించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సెర్ప్, మెప్మా అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలను ఎంఎస్‌ఎంఈలుగా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్ధంగా వినియోగించే వీలుకలుగుతుందని ఆయన తెలిపారు.

Read More

చలికాలంలో మనకు ఎక్కువగా దొరికేది చిలకడ దుంప.దీనిని తినేందుకు కొంతమంది చాలా ఆసక్తి కనబరుస్తారు.మరికొంత మంది మాత్రం అంత ఇష్టం చూపించరు.మరి చిలకడ దుంపల వల్ల వచ్చే లాభాలు ఏమిటంటే..ఈ దుంపల్లో బీటా కెరాటిన్ ఎక్కువగా ఉంటుంది.అది కళ్ళ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.కళ్ళ సమస్యలు దూరం చేస్తుంది.ఇందులో విటమిన్ సి, ఇ ఉంటుంది.ఈ విటమిన్స్ వల్ల చర్మం చాలా అందంగా మెరిసిపోతుంది.ముడతలు తగ్గుతాయి. యంగ్ లుక్ లో మెరిసిపోతారు.కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటుంది.దానివల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఎముకలు బలంగా మారతాయి.ఫైబర్ ఎక్కువ ఉంటుంది.దానివల్ల త్వరగా ఆకలి తీరిన భావన కలుగుతుంది.బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

Read More