తెలియని వ్యక్తులు నుంచి ఫోన్ కాల్స్ వస్తే వాటిని ఆన్సర్ చెయ్యొద్దని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు విభాగం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేసింది. ముఖ్యంగా + 94777 455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 ఇలాంటి నంబరుతో ఫోన్ వస్తే అస్సలు ఎత్తవద్దని చెప్పింది. +371 (లాత్వియా), +375 (బెలారస్), +381 (సెర్బియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +255 (టాంజానియా) వంటి కోడ్స్ ఉన్న నంబర్స్ నుంచి ఫోన్ వస్తె.. కాల్ లిఫ్ట్ చేసిన మూడు సెకన్ల లోనే మన వివరాలు కాపీ చేసుకుంటారని తెలిపింది. అంతే కాకుండా కొన్నిసార్లు మనల్ని కొన్ని ప్రశ్నలు అడిగి.. తద్వారా మన వివరాలు సేకరించి మనల్ని నేరస్తులుగా చిత్రీకరించే ప్రమాదం ఉందని చెప్పింది.
Author: admin
శబరిమల వెల్లె అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే పలు సూచనలు చేసింది.ముఖ్యంగా రైల్లో ప్రయాణించే మాలధారులకు కీలక సూచనలు చేసింది.రైళ్లలో కర్పూరం వెలిగించి వద్దని…హారతి ఇవ్వడం చెయ్యొద్దని తెలిపింది.ఇలాంటి వాటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపింది.ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే రైల్వే యాక్ట్ చట్టం కింద నేరంగా పరిగణిస్తాం అని తెలిపింది.మూడేళ్లు జైలు శిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించింది.దీనిని ప్రతి ఒక్కరూ పాటించాలని కోరింది.
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.దసరా ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.నాని సమర్పణ లో ఇది రానుంది.ఈ మేరకు ప్రిలుక్ షేర్ చేశారు.’ ఆతడు హింస లో తన శాంతిని వెతుకుంటాడు ‘ అని పేర్కొన్నారు.దీనిపై నాని ఆనందం వ్యక్తం చేశారు.’ చిన్నతనంలో ఆ సినిమా టికెట్స్ కోసం క్యూ లైన్ లో గంటల తరబడి వేచిచూశాను. ఆయనే నా స్ఫూర్తి.ఇప్పుడు ఆయన సినిమాని సమర్పిస్తున్నా.జీవితం పరిపూర్ణం అయింది ‘ అని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడం కలకలం సృష్టించింది.హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి, మణుగూరు, భూపాలపల్లి, విజయవాడ, జగయ్యపేట, తిరువూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని క్షణాల పాటు భూమి కంపించింది.దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.ఏం జరుగుతుంది అర్థం కాక.. ఏళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.అలా ఎందుకు జరిగింది అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాపౌట్స్ ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ లో వెనుకబడిన విద్యార్థులకు క్వచ్చన్ బ్యాంక్ అందించాలని ఈ సందర్భంగా లోకేష్ సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7వతేదీన నిర్వహించే మెగా పేరెంట్-టీచర్ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. మంత్రులు, శాసనసభ్యులు వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల పాఠశాలల్లోనే సమావేశాలకు హాజరు కావాలని, ఎటువంటి పార్టీ జెండాలు, హంగు, ఆర్బాటాలకు తావీయ వద్దని లోకేష్ స్పష్టంచేశారు.
ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్ మహల్ ను పేల్చేస్తామంటూ మంగళవారం ఉత్తరప్రదేశ్ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి ఒక మెయిల్ వచ్చింది.అది చూసిన అధికారులు రంగం లోకి దిగారు.బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తోపాటు పలువురు అధికారులు తాజ్ మాహల్ చుట్టూ పక్కల పరిశీలించారు.వారికి అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు.దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.తాజ్ మహల్ పరిసరాల్లో భద్రత పెంచమని అధికారులు తెలిపారు.మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయం పై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన సరికొత్త చిత్రం పుష్ప ది రూల్.2021లో విడుదలైన పుష్ప ది రైజ్‌కు కొనసాగింపుగా ఇది రూపుదిద్దుకుంది.డిసెంబర్ 5న ఇది విడుదల కానుంది.పుష్ప 1,2లకు కొనసాగింపుగా పార్ట్ 3 ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి.అది నిజమేనని ఇప్పటికే చిత్రబృందం కూడా స్పష్టత నిచ్చింది.ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సౌండ్ ఇంజనీర్‌గా వర్క్ చేసిన ఆస్కార్ విజేత రసూల్ పెట్టిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.అందులో ఆయన వెనుక ఉన్న పోస్టర్‌పై పుష్ప 3 ది ర్యాంపేజ్ అని ఉండటం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది.పార్ట్ 3 టైటిల్ ఇదేనని పలువురు భావిస్తున్నారు.
ఐసీసీ న్యూజిలాండ్ కు పాయింట్ల కోత విధించింది. దీంతో ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఆశలకు గట్టి దెబ్బ తగిలినట్లయింది. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో మందకొడి బౌలింగ్ కారణంగా న్యూజిలాండ్ కు 3 పాయింట్ల కోత పడింది. ఈనేపథ్యంలో కివీస్ ర్యాంకింగ్స్ టేబుల్ లో మరింత కిందకి పోతుంది. ఇక పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, శ్రీలంక తర్వాత స్థానాల్లో ఉండగా… ఇంగ్లాండ్ ఇప్పటికే ఫైనల్ రేసు నుండి నిష్క్రమించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ కు కూడా 3 పాయింట్ల కోత పడింది.
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో డ్రా ల పర్వం కొనసాగుతోంది. భారత యువ కెరటం గుకేశ్, డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ తాజాగా జరిగిన గేమ్ లో కూడా డ్రా చేసుకున్నారు. ఈ పోరులో ఇది 5వ డ్రా. ప్రస్తుతం ఆటగాళ్లిద్దరూ చెరో 3.5 పాయింట్లతో కొనసాగుతున్నారు. 72 ఎత్తుల వద్ద గేమ్ డ్రా గా ముగిసింది. ఇరువురి మధ్య హోరా హోరీగా సాగిన గేమ్ లో లిరెన్ మంచి డిఫెన్స్ కనబరిచాడు. ఆద్యంతం గుకేశ్ గెలుపు వైపుగా సాగాడు. అయినా లిరెన్ కాస్త పుంజుకోవడంతో గేమ్ డ్రా గా ముగిసింది.
దేశంలోని సరికొత్త నేర నియంత్రణ చట్టాలు సమగ్రమైనవని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాజ్యాంగం స్వప్నాలను సాకారం చేసే విధంగా దేశంలో తీసుకువచ్చిన కొత్త నేర నియంత్రణ చట్టాలు కీలక ముందడుగని పేర్కొన్నారు. దేశం స్వాతంత్ర్యం సాధించిన 70 ఏళ్లలో దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలు నిశితంగా అధ్యయనం చేసి వీటిని రూపొందించారని తెలిపారు. వీటి తయారీ ప్రక్రియ కూడా విస్తృతంగా ఉందని తెలిపారు. ఎందరో నిపుణుల శ్రమ కూడా దాగి ఉందన్నారు. 2020 జనవరిలో హోం మంత్రిత్వ శాఖ జనవరిలో అభిప్రాయాలు కోరిందని సుప్రీంకోర్టు, హైకోర్టులు, లా విశ్వవిద్యాలయాలు, పౌర సంస్థలు, మేధావులు సంవత్సరాల పాటు చర్చించి తమ అభిప్రాయాలు మేలవించారని పేర్కొన్నారు. గతంలో ఎదురైన సవాళ్లను విశ్లేషించారని భవిష్యత్తుకు సరిపడా ప్రమాణాలు పొందుపరిచారని వివరించారు. ఇది మన న్యాయ చరిత్రలో మైలురాయిగా అభివర్ణించారు. స్వాతంత్ర్యం అనంతరం కూడా ఆపాత బ్రిటిష్ చట్టాల చుట్టూ పాలకులు తిరిగారని అయితే ఇప్పుడు…