Author: admin

అంతర్జాతీయ సానుకూల పరిణామాల ప్రభావంతో వరుసగా మూడో సెషన్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. బ్యాంక్ స్టాక్స్ దూసుకెళ్లాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 597 పాయింట్ల లాభంతో 80,845 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 181 పాయింట్ల లాభంతో 24,457 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.67గా ఉంది. ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంకు, ఎస్.బీ.ఐ షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమీకృత టూరిజం పాలసీ 2024-29, స్పోర్ట్స్ పాలసీ 2024-29లో మార్పులకు ఆమోదం తెలిపింది. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు ఆమోదించింది. గత ఐదు సంవత్సరాలలో నిర్మించని ఇళ్ల రద్దుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15న పొట్టిశ్రీరాములు వర్థంతి సందర్భంగా ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం. ఏపీ టెక్స్ టైల్స్ గార్మెంట్స్ పాలసీకి ఆమోదం. ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీకి ఆమోదం. ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం.

Read More

ప్రోత్సహిస్తే దివ్యాంగులు ఏదైనా సాధించగలరని మేం బలంగా నమ్ముతాం. అందుకే దివ్యాంగులకు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మవిశ్వాసాన్ని అణువణువునా నింపుకుని అందరితో సమానంగా ముందడుగేస్తోన్నారని పేర్కొన్నారు. దివ్యాంగుల కోసం మూడు చక్రాల మోటారు వాహనాలు, స్వయం ఉపాధి పొందేందుకు రూ.1 లక్ష సబ్సిడీతో రుణాలు అందించి వారికి అండగా నిలిచామని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగుల పింఛన్ ను రూ. 3 వేల నుండి రూ. 6 వేలకు పెంచి ఇస్తున్నాం. దేశంలో దివ్యాంగులకు రూ. 6 వేలు పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అని చెప్పడానికి నేను చాలా సంతోష పడుతున్నాను. అవరోధాలను, సవాళ్లను అధిగమించి….మీరు జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాని చంద్రబాబు ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.

Read More

గ‌త కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిప‌డుతున్న‌ మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే అస్వస్థతకు గురయ్యారు.చికిత్స నిమిత్తం ఆయ‌న్ని ఠానేలోని జుపిట‌ర్‌ ఆస్పత్రికి తరలించారు.ప్ర‌స్తుతం వైద్యులు ప‌రీక్షిస్తున్నారు.తాను ఆరోగ్యంగానే ఉన్నాన‌ని ఆయ‌న ఆస్ప‌త్రి వ‌ద్ద మీడియాతో మాట్లాడారు.మ‌రోవైపు,కంగారు ప‌డాల్సింది, రోటీన్ చెక‌ప్ భాగంగానే ఆయ‌న ఇక్క‌డికి వ‌చ్చార‌ని స్థానిక వ‌ర్గాలు తెలిపాయి.ఇటీవల జరిగిన మ‌హారాష్ట్ర‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలకు గాను 234 స్థానాలతో మహాయుతి కూటమి ఘన విజయం అందుకుంది. అందులో బీజేపీ 132స్థానాలు గెలుపొందగా,శివసేన 57, ఎన్​సీపీ 41 సీట్లల్లో విజయం సాధించాయి. కొత్తప్రభుత్వం ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా మిత్రపక్షాల్లో ఏ ఒక్కరు మద్దతిచ్చినా బీజేపీ గద్దెనెక్కవచ్చు.అయితే బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తుంది.ఇప్ప‌టివ‌ర‌కూ ముఖ్య‌మంత్రిగా చేసిన త‌మ అభ్య‌ర్థి ఏక్‌నాథ్ శిండేనే మ‌రోసారి సీఎం చేయాల‌ని శివ‌సేన ప‌ట్టుబ‌డుతుంది.దీనితో మ‌హారాష్ట్ర నూత‌న ముఖ్య‌మంత్రిగా ఎవ‌రు ప‌దవీ…

Read More

“కాంతార‌” చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు క‌న్నడ న‌టుడు రిష‌బ్ శెట్టి.ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో కాంతార ప్రీక్వెల్‌గా రానున్న కాంతార చాప్ట‌ర్ 1తో పాటు,జై హ‌నుమాన్ వంటి బిగ్గెస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి.తాజాగా ఆయ‌న మ‌రో భారీ చిత్రాన్ని ప్ర‌క‌టించారు.ఛ‌త్రిప‌తి శివాజీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.’ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేది టైటిల్‌.భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈచిత్రానికి సందీప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వహించ‌నున్నారు.2027 జ‌న‌వ‌రి 21న ఇది విడుద‌ల కానుంది.ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ షేర్ చేసిన సందీప్..ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక యోధున్ని గౌరవిస్తూ దీనిని రూపొందిస్తున్నామ‌ని అన్నారు.మ‌రాఠా యోధుడు శివాజీ జీవితం, లెగ‌సీ భార‌తీయ చ‌రిత్ర‌లో చెర‌గ‌ని ముద్ర వేసింద‌ని తెలిపారు. Our Honour & Privilege, Presenting the Epic Saga of India’s Greatest Warrior King – The Pride of Bharat: #ChhatrapatiShivajiMaharaj.…

Read More

బంగ్లాదేశ్‌లో అల్ల‌క‌ల్లోల ప‌రిస్థితులు నెల‌కొని ఉన్న విష‌యం తెలిసిందే.హిందువుల‌తోపాటు వారి దేవాల‌యాల‌పైనా వ‌రుస దాడులు జ‌రుగుతున్నాయి. ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోన్న ఈ దాడుల‌ను ఉద్దేశించి ఆ దేశ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.న్యూయార్క్‌లో జరిగిన అవామీ లీగ్ కార్య‌క్ర‌మానికి ఆమె వర్చువల్‌గా హాజరైనట్లు తెలుస్తోంది.బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనసేను ఉద్దేశించి ఆమె ఇందులో కీల‌క ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది.ఈమేర‌కు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.‘మా దేశంలో జ‌రుగుతోన్న వ‌రుస హ‌త్య‌ల‌కు కార‌ణం నేనేనంటూ…ఇప్పుడు నాపై ప‌లు కేసులు పెడుతున్నారు.కానీ వాస్త‌వానికి ఆరోజు విద్యార్థి సంఘాల‌తో క‌లిసి ఆందోళ‌న‌ల‌కు దిగింది మ‌హ‌మ్మ‌ద్ యూన‌స్‌.ప్రార్థ‌నా మందిరాల‌పై దాడులు, అల్ల‌ర్లలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం, మాస్ట‌ర్ మైండ్ యూన‌స్‌దే’ అని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.బంగ్లాదేశ్‌లో జరిగిన అల్ల‌ర్ల కార‌ణంగా ఆమె స్వ‌దేశాన్ని వ‌దిలిన విష‌యం తెలిసిందే.ప్ర‌స్తుతం ఆమె భార‌త్‌లోని ఒక ర‌హ‌స్య ప్ర‌దేశంలో ఉన్న‌ట్లు…

Read More

మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ పథకంలో పనిచేసే వారికి యూపీఏ సర్కారు హాయాంలో తక్కువ వేతనాలు లభించేవి అని అయితే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత రెండు రెట్లకు పైనే వేతనాలు అందిస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది సహాయ మంత్రి పి. చంద్రశేఖర్ తెలిపారు. లోక్ సభలో డీఎంకే సభ్యుడు టి .ఆర్. బాలు జాతీయ ఉపాథి హామీ పథకంపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఉపాధి హామీ కింద పనిచేసే రోజులను కూడా తమ ప్రభుత్వం పెంచినట్లు వివరించారు. అప్పటి ప్రభుత్వంలోని బడ్జెట్ కేటాయింపులు ఇప్పుడు ఉన్న కేటాయింపులు లెక్కలతో సహా వివరించారు.

Read More

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జాతీయ దివ్యాంగ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ తమలో దాగి ఉన్న శక్తిసామర్ధ్యాలను గుర్తిస్తే ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకోవచ్చని పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులు వారి స్వశక్తిపై ఆధారపడి జీవించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని రాష్ట్రపతి అన్నారు. ఈ సంవత్సరం పదుల సంఖ్యలో పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యాపార, వాణిజ్యం ఇలా వివిధ రంగాలలో కూడా దివ్యాంగులు నేడు మిగిలినవారితో పోటీగా రాణిస్తున్నారన్నారని రాష్ట్రపతి పేర్కొన్నారు. పనిచేసే అవకాశాలు అందించబడితే, ఇతర వ్యక్తుల మాదిరిగానే, దివ్యాంగులలో కూడా ఆత్మవిశ్వాసం మరియు సార్థకమైన జీవితం గడిపే భావన వెలుగులోకి వస్తుందని తెలిపారు.

Read More

దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా చెప్పుకునే ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్-2025 ను మే 18న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఐఐటీ కాన్పుర్ తాజాగా తెలిపింది. జేయియి మెయిన్స్ కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. దేశంలోని 23 ఐఐటీల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం 17,695 బీటెక్ (ఇంజినీరింగ్), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2025-26 విద్యాసంవత్సరంలో మరికొన్ని సీట్లు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Read More

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఐటీ, టెక్స్ టైల్ పాలసీలకు ఆమోద ముద్ర పడనుంది. టూరిజం, స్పోర్ట్స్, మారిటైమ్ పాలసీల సవరణలను ఆమోదించే అవకాశం ఉంది. ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద పెండింగ్ గృహాల నిర్మాణం పూర్తిపై నిర్ణయం తీసుకోనున్నారు. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం అంశంపైనా ముఖ్యమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Read More