రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2021-22 నుండి 2023-24 మధ్యకాలంలో వివిధ ఎకౌంటుల కింద విడుదల చేసిన నిధుల వివరాల గురించి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణకు రూ.1.22 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు రూ.1.48 లక్షల కోట్లకుపైగా నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అదనపు కేంద్ర సాయం, విదేశీ ఆర్థికసాయంతో చేపట్టే ప్రాజెక్టులు, ప్రత్యేక సాయం కింద ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తాజాగా లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వివరించారు. ఆర్థిక సంఘం నిధులు ఏపీకి రూ.44,156 కోట్లు, తెలంగాణకు రూ.8,133 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పధకాలలో ఏపీకి రూ.42,069 కోట్లు, తెలంగాణాకు రూ.39,736 కోట్లు, కేంద్ర విభాగ పథకాలు రూ.36,338 కోట్లు, తెలంగాణాకు రూ.69,729 కోట్లు, ప్రత్యేక సాయం కింద…
Author: admin
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రులతో వరుసగా ఆయన సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో ఆయన భేటీ అయ్యారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ గజేంద్రసింగ్ అంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. గతంలో ఆయన జలశక్తి మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం ఎంతగానో సహకరించినట్లు గుర్తు చేసుకున్నారు. ఏపీ పర్యాటక రంగానికి సంబంధించి షెకావత్ కు 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించినట్లు తెలిపారు. తమ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు. గండికోటను ఇండియన్ గ్రాండ్ కేనియన్ లా అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి మని కోరామని తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ స్వల్ప అస్వస్థతకు గురతయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఛాతీనొప్పితో ఆయన ఇబ్బందిపడ్డారు. దాంతో కుటుంబసభ్యులు ఆయన్ని చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సీనియర్ వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని..ఇది అత్యవసర చికిత్స కాదని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. 2018లో ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత్ దాస్ పదవీ బాధ్యతలు చేపట్టారు. 2021తో ఆయన పదవీ కాలం ముగిసినప్పటికీ..కేంద్రం మరో మూడేళ్ల ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది.ఈ క్రమంలోనే వచ్చే నెల 10వ తేదీతో పదవీ కాలం ముగియనుంది.బ్యాంకింగ్ రంగంలో ఆయన చేసిన సేవలు గుర్తించిన ప్రభుత్వం మరోమూడేళ్లు ఆయన్నే ఆర్‌బీఐ గవర్నర్‌గా కొనసాగించాలని భావిస్తుందని ఇటీవల వార్తలు వస్తున్నాయి.అదే కనుక నిజమైతే ఆ పదవీలో అత్యధిక కాలం కొనసాగిన వ్యక్తిగా ఆయన రికార్డు అందుకుంటారు.
బాలీవుడ్ ప్రముఖ పాప్ సింగర్ బాద్‌షాకు చెందిన సెవెల్లె క్లబ్‌పై బాంబు దాడి జరిగింది.చంఢీగర్‌లోని సెక్టార్ 26లో ఉన్న ఈ క్లబ్‌పై ఇద్దరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు.ఈరోజు తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్య క్తులు బైక్ వచ్చి.. lక్లబ్‌పై బాంబు విసిరి అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడింది ఎవరు? ఎందుకు ఇలాంటి పనులకు పాల్పడ్డారు? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారని టాక్.ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని సమాచారం.ఏబీసీడీ 2, ఆల్ ఈజ్ వెల్, కపూర్ అండ్ సన్స్, ఓకే జాను, వేదాళం, స్త్రీ, సాహో , జవాన్ వంటి చిత్రాల్లో బాద్‌షా పాటలు పాడారు.ఆయన ఆలపించిన స్పెషల్ సాంగ్స్ కూడా మంచి ఫేమ్ అందుకున్నాయి.
దాదాపు 14 ఏళ్ల నుంచి విదేశాల్లో జీవితం గడుపుతున్నారు ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ.తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన భారత్ నుంచి వెళ్లిపోవడానికి గల కారణాన్ని తెలియజేశారు.మనదేశంలో తనపై ఎలాంటి కేసులు లేవని అన్నారు.కాకపోతే మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి చంపేస్తామంటూ ఎన్నోసార్లు బెదిరింపులు వచ్చాయని….వాటిని తట్టుకోలేకే తాను విదేశాలకు వెళ్లిపోయానని ఆయన అన్నారు. ‘వాస్తవానికి, దేశం విడిచి పెట్టేటంతటి సీరియస్ కేసులేవీ నాపైన అప్పట్లో లేవు. దావూద్ ఇబ్రహీం నుంచి చంపేస్తామంటూ నాకు బెదిరింపులు వచ్చాయి.మ్యాచ్ ఫిక్సింగ్‌ను అస్సలు సహించను. అయితే,క్రికెట్ మ్యాచ్‌లు ఫిక్స్ చేయాలనుకున్న దావూద్ ఇబ్రహీం నాపై ఒత్తిడి పెంచాడు.అయితే, అవినీతికి వ్యతిరేకంగా ఆట సమగ్రతను కాపాడటంపైనే నా దృష్టంతా ఉంది.దీనికి తోడు వ్యతిరేక ప్రచారం నాపై ఎక్కువగా జరిగింది.ఆ క్రమంలోనే నేను భారత్ నుంచి విదేశాలకు పారిపోయి వచ్చా’ అని లలిత్ పేర్కొన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేశారు.ఈరోజు రాజ్‌భవన్‌లోని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.రాష్ట్రంలోని 14వ అసెంబ్లీ పదవీకాలం ముగియడంతో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.తదుపరి సీఎం ఎవరు ఎన్నిక కానున్నారనేది తెలియరాలేదు.ఈ విషయంపై స్పష్టత వచ్చే వరకూ ఆయనే ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.288 స్థానాలకు గాను 234 స్థానాల్లో మహాయుతి కూటమి ఘన విజయం అందుకుంది.ప్రతిపక్ష పార్టీ 48 సీట్లకే పరిమితమైంది.దీంతో బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తుంది. ఇప్పటివరకూ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఏక్‌నాథ్ షిండే ను మరోసారి సీఎంగా చేయాలని శివసేన పార్టీ కోరుకుంటుంది.
ప్రభుత్వ, లేదా ప్రైవేటు రంగాల్లో ఏదైనా ఉద్యోగంలో చేరితే తప్పకుండా కొన్ని డాక్యుమెంట్లపై సంతకం చేయాల్సి ఉంటుంది.ఉద్యోగి పాటించాల్సిన నియమ నిబంధనలు ఇందులో ఉంటాయి.సంతకం అంటే పెన్ను లేదా సిరాతో చేస్తాం.కానీ రక్తంతో సంతకం చేయడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. అవును మీరు వింటుంది నిజమే…జపాన్‌లోని బ్యాంకులో ఉద్యోగంలో చేరాలంటే తప్పకుండా మీ రక్తం చిందించాల్సిందే. జపాన్‌లోని ఒక బ్యాంకు పాటిస్తున్న ఈ వింత నిబంధన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 30 ఏళ్ల నుంచి అక్కడి వారు ఈ నిబంధన అవలంభిస్తున్నారు.ఎవరైనా కొత్త వ్యక్తి అక్కడ జాబ్‌లో చేరితే…అతడితో రక్తంతో సంతకం చేయించుకుంటారు.ఉద్యోగుల్లో నైతిక ప్రవర్తన, సామాజిక బాధ్యత పెంచడం కోసమే అలాంటి రూల్స్ పెట్టినట్లు బ్యాంక్ పేర్కొంది.అంతేకాకుండా.. బ్యాంకులో ఉద్యోగం చేసే ఉద్యోగులు డబ్బు దొంగిలించినా, లేదా దొంగతనానికి సహకరించినా ఆ మొత్తాన్ని చెల్లించి, lఆత్మహత్య చేసుకోవాలనేది అక్కడి మరో రూల్.ఈ వింత రూల్స్ చూసి తాను…
నటి నయతనతార,నటుడు ధనుష్ మధ్య ఇటీవల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీసిన ఈ వివాదంలో నయన్‌కు నటి పార్వతి తిరువోత్తు సపోర్ట్ చేశారు.నయన్‌కు మద్దతు తెలపడానికి గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.ఎలాంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా నయన్ ఈ స్థాయికి వచ్చారు.ఆమె లేడీ సూపర్‌స్టార్.నాకు తెలిసినంత వరకూ తను ఎప్పుడు అబద్ధాలు చెప్పరు.తనకు ఎదురైన ఇబ్బందుల గురించి తెలియజేస్తూ దాదాపు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు.తన సమస్యను తెలియజేయడంలో తప్పు లేదనిపించింది.అందుకే ఆమెకు సపోర్ట్ చేశా.దానిని చూసిన వెంటనే షేర్ చేయాలనిపించింది.ఇన్‌స్టా షేర్ చేశా.ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్కరి జీవితాల్లో వస్తుంటాయి..అలాంటప్పుడు మనకంటూ ధైర్యం చెప్పేవాళ్లు పక్కన లేకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు.అందుకే నేను ఆమెకు సపోర్ట్‌గా నిలిచానని పార్వతి తెలిపారు.దూత సిరీస్‌తో పార్వతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు. నయనతార – విఘ్నేశ్ శివన్ పెళ్లిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ…
ఏఆర్ రెహమాన్ తనకు తండ్రితో సమానమని ఆయన టీమ్‌లోని సభ్యురాలు మోహినిదే తెలిపారు.రెహమాన్ విడాకులతో తనకి సంబంధం ఉందంటూ వస్తోన్న వార్తలు చూస్తుంటే తనకు బాధగా ఉందని చెప్పారు.‘రెహమాన్ కుమార్తెలది నాది ఒకే వయసు.దాంతో ఆయన నన్ను ఒక కూతురులా చూసేవారు.దాదాపు 8 ఏళ్ల నుంచి ఆయన టీమ్‌లో వర్క్ చేస్తున్నా.ఆయన నాకు రోల్ మోడల్,నాకెంతో గౌరవం ఉంది.మా గురించి ఇప్పుడు ఇలాంటి వార్తలు రావడం చాలా బాధగా ఉంది.ఇలాంటి క్లిష్ట సమయాల్లో సానుభూతిని చూపించకుండా ఇలాంటి నిందలు వేయడం ఎంతో బాధను కలిగిస్తుంది.ఎదుటి వ్యక్తుల గురించి అసభ్యకరంగా మాట్లాడడం నేరంగా పరిగణించాలి’అని తెలిపారు.ఇప్పటికైనా ఇలాంటి వార్తలకు చెక్ పెట్టాలని కోరారు.వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని కోరారు.29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ రెహమాన్ – సైరా బాను దంపతులు నవంబర్ 19న విడిపోవాలనుకుంటున్నామని ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.అయితే అదే రోజు మోహిని దే…
భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాత పార్లమెంట్ ప్రాంగణంలోని సెంట్రల్ హాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. రాజ్యాంగానికి సంబంధించిన రెండు పుస్తకాలు, 75 వసంతాలకు గుర్తుగా స్మారక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు. దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సహా లోక్ సభ, రాజ్యసభ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల క్రితం ఇదేరోజున రాజ్యాంగం ఆమోదం పొందింది. ఇది మన పవిత్ర గ్రంథమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రాజ్యాంగ రూపకల్పన జరిగిందని వివరించారు. సమాజానికి రాజ్యాంగం మూలస్తంభం వంటిదని అన్నారు.రాజ్యాంగ రచనలో భాగస్వాములను స్మరించుకోవాలని పేర్కొన్నారు. మన రాజ్యాంగం సజీవ, ప్రగతిశీల…