Author: admin

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న విషయం తెలిసిందే.తాజాగా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు.తాను ఎక్కడికి పారిపోలేద్దన్నారు.సినిమా షూట్ లో బిజీ గా ఉన్నానని తెలిపారు.తనపై జరుగుతున్న ప్రచారం నిజం కాదంటూ…పెట్టిన కేసులపై అనుమానాలు ఉన్నాయని…తనపై పెట్టిన సెక్షన్స్ ఎలా వర్తిస్తాయో అర్దం కావట్లేదంటూ ఆయన వీడియో విడుదల చేశారు.ఏపీ పోలీసుల నోటీసులకు తాను భయపడడం లేదని అన్నారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయ్.‌..తాను పోస్టు ఎవరి ఉద్దేశించి పెట్టానో…వారికి కాకుండా ఇంకెవరో సంబంధం లేని థర్డ్ పార్టీ వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు,సెక్షన్లు ఎలా వర్తిస్తాయనేది తనకు అర్ధం కావట్లేదని అన్నారు.

Read More

దేశంలో 2022-23లో 23.58 కోట్ల టన్నులున్న పాల ఉత్పత్తి 2023-24లో 23.93 కోట్ల టన్నులకు చేరింది. 2014-15లో పాల ఉత్పత్తి కేవలం 14.63 కోట్ల టన్నులు. గత ఏడాది గేదెల నుండి పాల ఉత్పత్తి 16 శాతం తగ్గినా మొత్తం మీద ఉత్పాదకత పెరగడం గమనార్హం. అవు పాల ఉత్పత్తి భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో మన దేశమే అతి పెద్ద పాల ఉత్పత్తిదారు. శ్వేత విప్లవ పితామహుడు అయిన వరీస్ కురియన్ జన్మదినమైన నవంబరు 26ను ప్రతి సంవత్సరం జాతీయ పాల దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ప్రసంగించిన కేంద్ర పశు సంవర్థకశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ దేశంలో 2022-23లో తలసరి పాల లభ్యత 459 గ్రాములు కాగా ఇప్పుడది 471 గ్రాములకు పెరిగినట్లు తెలిపారు.

Read More

2025లో ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగే మహా కుంభమేళాలో రోబోలను ఉపయోగించాలని అధికారులు యోచిస్తున్నారు. అగ్నిప్రమాదాలు జరగకుండా పర్యవేక్షించేందుకు వీటిని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన 200 మంది ఫైర్ కమాండోలనూ కూడా అందుబాటులో ఉంచనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది చేరుకోలేని ప్రాంతాలకు వెళ్లేందుకు మూడు రోబోలను మహాకుంభమేళాలో సిద్ధంగా ఉంచనున్నారు. ఇవి ఒక్కొక్కటి 20 నుంచి 25 కిలోల బరువుంటాయి. మెట్లు ఎక్కడంతో పాటు మంటలను అదుపు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 35 మీటర్ల ఎత్తు నుండి నీటిని స్ప్రే చేసే వాటర్ టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు కూడా అందుబాటులో ఉంచనున్నారు.

Read More

డబ్ల్యూబీఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ డిసెంబర్ 11న చైనాలోని హాంగ్ఝౌలో ప్రారంభం కానుంది. కాగా, ఈ టోర్నీకి పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జోడి అర్హత సాధించింది. తాజాగా విడుదల చేసిన మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఈ జోడీ ఎనిమిదో స్థానంలో నిలిచి ఈ అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సంవత్సరం సింగపూర్ ఓపెన్, మకావు ఓపెన్లలో సెమీ ఫైనల్ చేరిన భారత ద్వయం. తాజాగా చైనా మాస్టర్స్ టోర్నీలో ప్రిక్వార్టర్స్ లో ఓటమి చెందింది. డబ్ల్యూబీఎఫ్ ఫైనల్స్ లో పి.వి.సింధు మాత్రమే ఇప్పటి వరకు టైటిల్ గెలిచింది.2018 లో ఆమె విజేతగా నిలిచింది. ఇక మరోవైపు సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీకి భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి దూరమయ్యారు. తాజాగా ప్రారంభమైన ఈ టోర్నీ నుండి సాత్విక్- చిరాగ్ జోడీ తమ ప్రవేశాన్ని ఉపసంహరించుకుంది.

Read More

ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్ ను ఖరారు చేసేందుకు ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) సమావేశం కానుంది. ఈనెల 29న వర్చువల్ గా నిర్వహించే భేటీలో షెడ్యూల్ పై తుది నిర్ణయం తీసుకోనుంది. 2025 ఫిబ్రవరి- మార్చిలో పాకిస్థాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. అయితే పాకిస్థాన్ లో పర్యటించేందుకు భారత్ విముఖత వ్యక్తం చేయడంతో షెడ్యూల్ ప్రకటన ఆలస్యమవుతోంది. ఈనేపథ్యంలో షెడ్యూల్ ని ఖరారు చేసేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది. 2008లో ముంబయిపై ఉగ్రవాదుల దాడి తర్వాత పాక్ లో భారత్ పర్యటించలేదు. అక్కడకి వెళ్లడం కుదరదని స్పష్టం చేసిన భారత్ తటస్థ వేదికపై యూఏఈలో తమ మ్యాచ్లు ఆడతామని తెలిపింది. అయితే ఈ ప్రతిపాదనకు పాక్ అంగీకరించలేదు. దీంతో షెడ్యూల్ పై నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ స్వయంగా రంగంలోకి దిగింది.

Read More

రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో నిన్న రాత్రి ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొంది.రాజ్‌సమంద్‌ బీజేపీ ఎమ్మెల్యే, విశ్వ‌రాజ్ సింగ్ మేవార్‌ను ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లోకి రాకుండా ఆయన బంధువులు అడ్డుకున్నారు.దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకొని పలువురు గాయపడ్డారు.ఈ పరిణామంతో మేవార్ రాజ కుటుంబంలో ఉన్న విబేధాలు మ‌రోసారి భ‌గ్గుమ‌న్నాయి.రాజ్‌పుత్‌ రాజు మహారాణా ప్రతాప్‌ వారసులైన మహేంద్ర సింగ్‌ మేవాడ్‌, అరవింద్‌ సింగ్‌ మేవాడ్‌ల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో వాడ్‌ రాజ్య 77వ మహారాజుగా విశ్వ‌రాజ్ సింగ్‌ సోమవారం పట్టాభిషేకం చేశారు.ప‌ట్టాభిషేకం అనంతరం ఏకలింగనాథ్ ఆలయం,ఉదయ్‌పుర్‌లోని సిటీ ప్యాలెస్ ఆయ‌న సంద‌ర్శించాల్సి ఉండ‌గా…ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా ఉన్న అర‌వింద్ సింగ్ దానికి అంగీక‌రించ‌లేదు. కోట‌లోకి నూత‌న మ‌హారాజు అనుమ‌తించ‌మ‌ని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేశారు.కోట త‌లుపులు మూసి ఉండ‌టంతో దాదాపు ఐదు గంట‌లు విశ్వ‌సింగ్ అక్క‌డే నిల్చుని ఉన్నారు.ఈ క్ర‌మంలోనే దాదాపు ఇరు వ‌ర్గాల మ‌ధ్య రాళ్ల‌దాడి జ‌రిగింది.

Read More

తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పౌర విమానయాన శాఖ తరపున పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి సిఎం భట్టి విక్రమార్కతో కూడిన బృందం ఈరోజు వారిని కలిసింది. ఈసందర్భంగా తెలంగాణలో విమానాశ్రయ అభివృద్ధిపై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి విమానాశ్రయానికి కావలసిన భూమి బదిలీ ప్రక్రియ పూర్తయిన వెంటనే త్వరితగతిన వరంగల్ విమానాశ్రయ పనులు ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి- రామగుండం, ఆదిలాబాద్‌లో విమానాశ్రయాలు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల అధ్యయనాల పరిశీలించిన తర్వాత దానికి అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రామ్మోహన్ నాయుడు ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.

Read More

సీనియర్ అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున తమ కుటుంబానికి సంబంధించిన మరో శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. అక్కినేని ఇంట మరో శుభకార్యం జరగనుంది. ఇప్పటికే ఆయన పెద్ద కొడుకు హీరో నాగచైతన్య, నేటి శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, చిన్న కొడుకు అఖిల్ అక్కినేని కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అఖిల్ చేయందుకోబోతున్న జైనాబ్ ఓ ఆర్టిస్ట్. ఆమె తండ్రి పేరు జుల్ఫీ రవన్జీ. తాజాగా ఈ జంట నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. అందరి ఆశీస్సులు ఈ జంటపై ఉండాలని ఆకాంక్షించారు. We are thrilled to announce the engagement of our son, @AkhilAkkineni8, to our daughter in law to be Zainab Ravdjee! We couldn't be happier to welcome Zainab into our family. Please join us…

Read More

రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. నాలుగు రాష్ట్రాల్లో 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 3,ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా నుండి ఖాళీగా ఉన్న ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఎన్నిక షెడ్యూల్ ని విడుదల చేసింది. ఏపీలో మోపిదేవి, వెంకటరమణ బీద మస్తాన్, కృష్ణయ్య రాజీనామాలతో 3 సీట్లు ఖాళీ అయ్యాయి. డిసెంబర్ 3 నుండి10 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. డిసెంబర్ 13న నామినేషన్ల ఉపసంహరణ ఉండనుంది. డిసెంబర్ 20న పోలింగ్. అదే రోజు కౌంటింగ్ జరుగనుంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు కాగా, 164 సీట్లలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలన్నా కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా ..ప్రస్తుతం వైసీపీ సంఖ్యాబలం 11 మాత్రమే. ప్రస్తుతం ఉప ఎన్నిక…

Read More

అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ బీఎస్ఈలో 105 పాయింట్లు కోల్పోయి 80,004 వద్ద ట్రేడింగ్ ముగించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ సైతం 27పాయింట్లు కోల్పోయి 24,194 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.84.33గా కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, జే.ఎస్.డబ్ల్యూ, టీ.సీ.ఎస్ షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More