Author: admin

ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఇటీవల కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న డం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌ వంటి ఆసియా దేశాల్లో గత కొన్ని వారాలుగా కేసులు గణనీయంగా పెరగడమే కాకుండా, హాస్పిటల్స్ లో చేరేవారి సంఖ్య, మరణాలు కూడా అధికమవుతుండటం కలవరపెడుతోంది. ఇదివరకు తీసుకున్న వ్యాక్సిన్ల ద్వారా లభించిన రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గడం, కొత్త కరోనా వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందడమే ఈ ప్రస్తుత కరోనా ఉద్ధృతికి ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు.

Read More

పహాల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఉగ్రవాదంపై పోరాటం మరింత తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. అలాగే దేశంలోనే ఉంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు దేశ ద్రోహానికి పాల్పడుతున్న వారిని కూడా ఏరివేస్తోంది. పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తూ చిక్కిన హర్యానాకు చెందిన యూట్యూబ్ జ్యోతి మల్హోత్రా సహా పలువురిని అరెస్టు చేయగా… తాజాగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన షాజాద్ అనే ఒక వ్యాపారిని కూడా గూఢచర్యం ఆరోపణలతో అరెస్టు చేసినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ తెలిపింది. రాంపూర్ కు చెందిన వ్యాపారి పాకిస్థాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరపున సరిహద్దుల్లో అక్రమ రవాణా, గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. శత్రు దేశంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ జాతీయ భద్రతకు సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పాక్ కు చేరవేస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. పలుమార్లు పాక్ కు కూడా వెళ్లి వచ్చినట్లు తెలిపారు. బిజినెస్ ముసుగులో ఈ నీచుడు…

Read More

మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘భైరవం’ . తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. మే 30న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. కె.కె.రాధా మోహన్ నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. ముగ్గురు మిత్రుల కథతో, దేవాలయం నేపథ్యంగా సాగుతుంది. ట్రైలర్‌లో యాక్షన్‌, ఎమోషన్స్ ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్‌లుగా ఆదితి శంకర్‌, దివ్యా పిళ్లై, ఆనంది నటించారు. https://youtu.be/3qiqCTvhpOg?si=xnID0o-OSJZHDQ6L

Read More

నవంబర్ లో నంది నాటకోత్సవాలు, నంది అవార్డుల ప్రధానం చేయనున్నట్లు కళా, సాంస్కృతిక రంగాలకు పునరుజ్జీవం తెస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం, హేలాపురి కళాపరిషత్ ఆధ్వర్యంలో ఏలూరులోని శ్రీ మోతే గంగరాజు ప్రాంగణంలోని వైఎంహెచ్‌ఏ హాల్‌లో జరిగిన అంబికా సంస్థల వ్యవస్థాపకులు ఆలపాటి రామచంద్రరావు శతజయంతి ఉత్సవాల్లో, జాతీయ స్థాయి తెలుగు నాటక పోటీలో మంత్రి కందుల దుర్గేశ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. త్వరలో ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా.. తద్వారా కళా నాటక రంగాలకు చేయూతస్తామని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో మరిన్ని టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ ల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అమరావతిలో సినిమా రంగం ఎదిగేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Read More

ఇంగ్లాండ్ క్రికెటర్ ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు మొయిన్ అలీ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ‘ఆపరేషన్ సింధూర్’ జరిగిన సమయంలో తన తల్లిదండ్రులు పాక్ ఆక్రమిత కశ్మీర్లోనే ఉన్నారని తెలిపాడు. ఆ సమయంలో చాలా ఆందోళనకు గురి చేశాయని అన్నాడు. ఈ మేరకు ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ ఆ రోజును గుర్తుచేసుకున్నాడు. అప్పుడు వారున్న ప్రాంతం నుండి గంట ప్రయాణ దూరంలో ఉండే ప్రాంతంలో దాడులు జరిగాయి. చూస్తుండగానే పరిస్థితులు తీవ్రంగా మారాయి. వార్ మధ్యలో చిక్కుకున్నామని వారికి అర్థమైంది. అయితే, అదృష్టవశాత్తూ వారున్నచోట ఎలాంటి దాడులు జరగలేదు. వెంటనే అందుబాటులో ఉన్న ఒక్క ఫ్లైట్ ఎక్కి వారు ఆ ప్రాంతాన్ని వీడారు. వారు క్షేమంగా బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నట్లు మొయిన్ అలీ తెలిపాడు.

Read More

శాఫ్ అండర్-19 ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ మరోసారి టైటిల్ కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన ఫైనల్ లో భారత్ 1-1 (4-3) తో పెనాల్టీ షూట్ అవుట్ లో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో నిలిచాయి. భారత్ నుండి 2వ నిమిషంలో సింగమయుం షామి గోల్ చేయగా… బంగ్లాదేశ్ నుండి 61వ నిమిషంలో జోయ్ అహ్మద్ గోల్ చేసింది. పెనాల్టీ షూట్ అవుట్ లో బంగ్లాదేశ్ మొదటి 3 ప్రయత్నాలలో సఫలమైంది. భారత్ రెండే చేయగలిగింది. అయితే తర్వాత బంగ్లాదేశ్ రెండు సార్లు విఫలమైంది. భారత్ రెండుసార్లు గోల్స్ చేసి విజేతగా నిలిచింది.

Read More

ఐపీఎల్ సీజన్ 18 లో సమిష్టిగా రాణిస్తూ మంచి ప్రదర్శన కనబరుస్తున్న గుజరాత్ టైటాన్స్ మరో సూపర్ విక్టరీతో ఘనంగా ప్లే ఆఫ్స్ చేరింది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ కొట్టింది. మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కే.ఎల్.రాహుల్ 112 (65; 14×4, 4×6) సెంచరీతో రాణించాడు. అభిషేక్ పోరెల్ (30), అక్షర్ పటేల్ (25), స్టబ్స్ (21) పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో అర్షద్ ఖాన్, ప్రసీద్ కృష్ణ, సాయి కిషోర్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 19 ఓవర్లలోనే ఛేదించింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఆ జట్టు ఆటగాళ్లు సాయి సుదర్శన్ 108 (61; 12×4,…

Read More

ఐపీఎల్ సీజన్ 18 లోకి పంజాబ్ కింగ్స్ దూసుకెళ్లింది. తాజాగా ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. నేహాల్ వధేరా 70 (37; 5×4, 5×6), శశాంక్ సింగ్ 59 (30; 5×4, 3×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రేయాస్ అయ్యర్ (30), అజ్మతుల్లా (21 నాటౌట్), ప్రభ్ సిమ్రాన్ (21) పరుగులు చేయడంతో భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 2 వికెట్లు, మెపాకా, రియాన్ పరాగ్, ఆకాష్ మధ్వానీ ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. యశస్వీ జైశ్వాల్ 50 (25; 9×4, 1×6), వైభవ్…

Read More

మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకం అమలు తేదీ ఖరారైంది. ఆగష్టు 15 నుండి దీన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించారు. ఈ పథకం వల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.3,182 కోట్ల మేర భారం పడనుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా అదిగో ఇదిగో అంటూ ఆలస్యమవుతూ వచ్చిన ఈ అంశం తాజాగా స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటనతో ముహూర్తం ఖరారైంది. తాజాగా కర్నూలులో పర్యటించిన సీఎం చంద్రబాబు.. ఆగష్టు 15వ తేదీ నుండి.. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించనున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళల నుండి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

Read More

ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తన కుటుంబంతో కలిసి న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు . ప్రధాని అమరావతి వచ్చిన సందర్భంలో ఢిల్లీ రావాలని మంత్రి లోకేష్ ను ఆహ్వానించిన సందర్భంగా ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ‘యువగళం’ కాఫీ టేబుల్ పుస్తకాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. 2024 ఎన్నికలకు ముందు లోకేష్ చేపట్టిన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్‌లో పొందుపరిచారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని దానిపై సంతకం చేసి లోకేష్ కు అందించారు. ఇక‌, ఈ భేటీలో ప్రధాని మోడీ, లోకేష్ దంపతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. లోకేష్ కుమారుడు దేవాన్ష్‌ ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని స‌ర‌దాగా ముచ్చటించారు.

Read More