Author: admin

ఈ ఐపీఎల్ సీజన్ లో పేలవంగా ఆడుతూ వస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్ లో ఆ జట్టుకు ఇది10వ పరాజయం. 13 మ్యాచ్ లలో కేవలం 3 మాత్రమే గెలిచింది. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో తన చివరి మ్యాచ్ ను విజయంతో ముగించింది. ప్లే ఆఫ్ రేసు కు దూరమైన ఆ జట్టు నామమాత్రపు గెలుపుతో సీజన్ కు గుడ్ బై చెప్పేసింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆయుష్ మాత్రే 43 (20; 8×4, 1×6), బ్రెవిస్ 42 (25; 2×4, 3×6), శివమ్ దూబే 39 (32; 2×4, 2×6) పరుగులు…

Read More

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకున్నారు. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు: వివిధ పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం. టూరిజం పాలసీకి అనుగుణంగా ప్రోత్సాహకాలు. డైకిన్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థకు శ్రీసిటీలో విస్తరణకు అనుమతి. ప్రాజెక్టు వయబిలిటీ దృష్టిలో ఉంచుకుని తిరిగి 500 ఎకరాలు కేటాయింపు. సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం. త్వరలోనే విద్యుత్ ఇంధన వనరుల కేంద్రంగా అనంతపురం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏలూరులో ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయం. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లా యూనివర్సిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం. 20 శాతం సీట్లు ఏపీ విద్యార్థులకు కేటాయించేలా రిజర్వేషన్.

Read More

ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రధమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా వెలుగొంది ‘ఆంధ్రకేసరి’ గా కీర్తిప్రతిష్టలు పొందిన ఆ మహనీయుడు మనందరికి స్ఫూర్తి ప్రదాతని కొనియాడారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొని బ్రిటీష్ తుపాకికి గుండెను చూపిన ఆయన సాహసం ఎన్నటికీ మరువలేం. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగనిరతి ఆదర్శవంతమని పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్: స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్ర‌కాశం పంతులు గారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయ‌న‌. నేడు ప్రకాశం పంతులుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు.

Read More

యష్ రాజ్ ఫిల్మ్స్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలో అగ్ర కథానాయకులు ఎన్టీఆర్ -హృతిక్ రోషన్ లు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘వార్-2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేశారు. అత్యద్భుతమైన విజువల్స్, నిర్మాణ విలువలతో వచ్చిన టీజర్ అంచనాలను మరింత పెంచేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ యాక్షన్ ఎపిసోడ్స్ టీజర్ కే హైలెట్ గా నిలిచాయి. కియారా అద్వానీ, జాన్ అబ్రహం, షాబిర్ ఆహ్లూవాలియా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఏడాది ఆగష్టు 14న ఇండిపెండెన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. https://youtu.be/9Dve2VMOv5U?si=gKZM45D6dPbG4VZX

Read More

విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రయాణ సమయం తొమ్మిది గంటలుగా రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ట్రైన్ పట్టాలెక్కితే దాదాపు 3 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ రైలు బెంగళూరు వెళ్లేవారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకూ ఉపయోగపడనుంది. మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్ కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. వారంలో మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు నడిచే ఈ రైలు (20711) విజయవాడలో 5.15 గంటలకు బయలుదేరి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి తదితర స్టేషన్ల మీదుగా ఎస్ఎంవీటీ బెంగళూరు 14.15 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ రైలు (20712) బెంగళూరులో 14.45 గంటలకు ప్రారంభమై విజయవాడ 23.45 గంటలకు వస్తుంది.

Read More

ప్లే ఆఫ్ రేసుకు ఇప్పటికే దూరమైన సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ కు కూడా ప్లే ఆఫ్ అవకాశాన్ని దూరం చేసింది. తాజాగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ అలవోకగా విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 65 (39; 6×4, 4×6), ఏడెన్ మార్క్రమ్ 61 (38; 4×4, 4×6) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. నికోలస్ పూరన్ 45 (26; 6×4, 1×6) ఫర్వాలేదనిపించాడు. ఎషాన్ మలింగ 2 వికెట్లు, కమ్మిన్స్, హార్ష్ దూబే, హార్షల్ పటేల్ లు వికెట్లు తీశారు. ఇక టార్గెట్ ఛేజింగ్ లో సన్ రైజర్స్ ఎక్కడా తడబడకుండా బ్యాటింగ్…

Read More

రాష్ట్రంలో అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలు, వారి సానుభూతిపరుల జాడలపై అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ పోలీస్ శాఖ, పరిపాలనా శాఖలకు సూచించారు. ఈ మేరకు పలు సూచనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ, రాష్ట్ర డీజీపీకి లేఖలు రాశారు. తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అన్నారు. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. దేశ భద్రత, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం వచ్చిందనీ, దీనిపై సంబంధిత శాఖలతో సమన్వయం అవసరమని చెప్పారు.

Read More

ప్రజలకు అందించే సేవల్లో పూర్తిస్థాయి సంతృప్తి రావాల్సిందేనాని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, సేవలపై సమీక్ష సమీక్ష నిర్వహించారు. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు పేర్కొన్నారు. ఆర్టీసీలో సౌకర్యాలు, సదుపాయాలు ఇంకా మెరుగుపడాలని అన్నారు. దీపం లబ్దిదారుల ఖాతాలో ఒకేసారి 3 సిలిండర్ల సొమ్ము వేయనున్నట్లు పేర్కొన్నారు. డాటా అనలిటిక్స్‌కు అన్ని శాఖల్లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Read More

ప్రపంచంలోని శరణార్థులందరికీ ఆశ్రయం కల్పించడానికి భారత్ ధర్మశాల కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు ఆశ్రయం కల్పించాలంటూ శ్రీలంక జాతీయుడు పెట్టుకున్న పిటిషన్‌ను నేడు కొట్టివేసింది. ఈ దేశంలో స్థిర నివాసం కల్పించాలనే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించింది. జస్టిస్ దిపాంకర్ దత్తా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇప్పటికే 140 కోట్ల జనాభాతో ఇబ్బందులు పడుతున్నామని విదేశీ పౌరులందరినీ చేర్చుకోవడానికి ఇది ధర్మశాల కాదని పేర్కొంది.

Read More

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, ఐటీ షేర్లలో అమ్మకాలు సూచీల జోరును తగ్గించాయి. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 271 పాయింట్లు నష్టపోయి 82,059 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 24,945 వద్ద ముగిసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.85.40గా కొనసాగుతోంది. ఇక సెన్సెక్స్ 30లో ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, ఎస్.బీ.ఐ, హెచ్.డి.ఎఫ్.సి షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More