భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కాస్త నెమ్మదించే దిశగా అడుగులు పడుతున్నాయి. కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియా లో నేటి సాయంత్రం ఓ పోస్ట్ పెట్టారు. “అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టేందుకు భారత్, పాక్ అంగీరించాయి. సరైన సమయంలో రెండు దేశాలు విజ్ఞతతో, సంయమనంతో వ్యవహరించాయి. దానికి ధన్యవాదాలని ట్రంప్ తన పోస్ట్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని భారత్, పాక్ వేర్వేరు ప్రకటనల్లో ధ్రువీకరించాయి.
Author: admin
ఇక నుండి ఉగ్రవాద దాడిని యుద్ధ చర్యగా పరిగణించాలని భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్రవాద చర్యలను సహించేది లేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్‌లోకి చొరబడి వెంటాడి మరీ విధ్వంసకారులను మట్టుబెట్టాలని ఉగ్రవాద చర్యలను సరైన రీతిలోనే ఎదుర్కోవాలని ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అజిత్ దోవల్, సీ.డీ.ఎస్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా శత్రుదేశాన్ని బెంబేలెత్తించిన ‘ఆపరేషన్ సిందూర్’ అనే టైటిల్ పై మూవీ రాబోతుంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ ‘సిందూర్’ పేరుతో బాలీవుడ్ లో సినిమాను రూపొందిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన చేసి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కనుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో యూనిఫాం ధరించి రైఫిల్ పట్టుకొని నుదుటన సిందూరం పెట్టుకుంటోన్న మహిళ కనిపిస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి త్వరలోనే ఇందులో నటీనటుల వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
పాక్ ఆర్మీ పోస్ట్ ను భారత దళాలు ధ్వంసం చేశాయి. బోర్డర్స్ దాటేందుకు దీనిని లాంచ్ ప్యాడ్ గా ఉగ్రవాదులు దీనిని వాడుతున్నారు. దీంతో పాటు ట్యూబ్ డ్రోన్స్ భారత్ పై ప్రయోగించేందుకు వీలుగా అక్కడ లాంచ్ ప్యాడ్ ఉంది. దానిని కూడా మన సెక్యూరిటీ ఫోర్సెస్ ధ్వంసం చేశాయి. గత రెండు రోజులుగా బోర్డర్స్ లో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. పాక్ డ్రోన్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారత దళాలు విజయవంతంగా కూల్చేశాయి. రాజౌరీ లో పాక్ చేసిన కాల్పుల్లో ఒక ప్రభుత్వ అధికారి ప్రాణాలు కోల్పోయారు.
భారత్, పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న పరిస్థితులపై జీ7 కీలక సూచన చేసింది. అత్యంత సంయమనం పాటించాలని, తక్షణమే సైనిక ఘర్షణను తగ్గించుకుని చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఏడు దేశాల కూటమి (జీ7) పిలుపునిచ్చింది. న్యూక్లియర్ పవర్ కలిగిన ఈ రెండు పొరుగు దేశాల మధ్య సైనిక ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఈమేరకు కీలక ప్రకటన చేసింది. జరుగుతున్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, డిప్లామాటిక్ చర్చల ద్వారా శాశ్వత పరిష్కారానికి మా మద్దతు ఉంటుందని జీ7 దేశాలు స్పష్టం చేశాయి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా విదేశాంగ మంత్రులతో పాటు యూరోపియన్ యూనియన్ ఉన్నత ప్రతినిధి ఈ మేరకు ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత్, పాకిస్థాన్‌లు అత్యంత సంయమనం పాటించాలని కోరుతున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల…
భారత్ లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 8వ తేదీ రాత్రి నుండి పాకిస్థాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. నేటి తెల్లవారుజామున అమృత్సర్ లోని ఖాసా కంటోన్మెంట్ గగనతలంలో మన సెక్యూరిటీ ఫోర్సెస్ శత్రు డ్రోనును గుర్తించాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ఎయిర్ డిఫెన్స్ విభాగాలు వెంటనే దాన్ని కూల్చివేశాయని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను, చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ పైనా డ్రోన్లతో దాడికి పాక్ యత్నించినట్లు తెలుస్తోంది. శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. శ్రీనగర్ ఎయిర్ బేస్ పై డ్రోన్లతో దాడి చేయగా.. సైన్యం వీటిని విజయవంతంగా తిప్పికొట్టింది. చండీగఢ్ లోనూ తెల్లవారుజామున దాడులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. పఠాన్కోట్లో ఉదయం 5 గంటలకు భారీ పేలుళ్ల శబ్దాలు వచ్చినట్లు తెలిపారు. జమ్మూ నుండి గుజరాత్ వరకు పలుచోట్ల పాక్ దాడులకు పాల్పడగా.. భారత…
భారత సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్థాన్ డ్రోన్ ఎటాక్స్ చేయగా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ గుజరాత్ లోని 36 ప్రాంతాలను టార్గెట్ చేసుకుని 300-400 డ్రోన్స్ తో ఈ దాడులకు పాల్పడినట్లు భారత సైన్యం తెలిపింది. పాకిస్థాన్ తమ పౌర విమానాలను డిఫెన్స్ షీల్డ్ లా ఉపయోగించుకుంటోందని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లు కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాధమిక నివేదిక ప్రకారం టర్కీకి చెందిన ‘ఆసిస్ గార్డ్ సోంగర్’ డ్రోన్స్ ప్రయోగించినట్లు తెలిపారు. పాక్ దాడులను భారత్ విజయవంతంగా అడ్డుకుందని తెలిపారు. పాక్ కుయుక్తులను ఎండగట్టారు. అప్రమత్తంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. పాకిస్థాన్ దళాలు సరిహద్దు ప్రాంతాలపై దాడులకు పాల్పడటం, భారత సైన్యం వాటిని సమర్థంగా తిప్పికొట్టడంతో యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో దేశీయ సూచీలు వరుసగా రెండో రోజూ కూడా భారీ నష్టాలను చవిచూశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 880 పాయింట్లు నష్టపోయి 79,454 వద్ద స్థిరపడగా… నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ కూడా దాదాపు 265 పాయింట్ల నష్టంతో 24,008 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.85.41గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.
పాకిస్థాన్ తో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడులు చేసిన పాక్ ను భారత్ సమర్థంగా ఎదుర్కొంది. బోర్డర్ లోదాడులు చేసి భారత్ ను ఇబ్బంది పెట్టాలనే పాక్ దుష్ట ఆలోచనలకు చెక్ పెట్టే విధంగా చర్యలు చేపట్టనుంది. దీంతో ఆ దేశానికి అలాంటి అవకాశం ఇవ్వకుండా భారత ఆర్మీని మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత ఆర్మీ చీఫ్ కు మరిన్ని అధికారాలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని పేర్కొంది. ఇందులోని అధికారులను, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు అధికారం కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి వీరు పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది. , చీఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాల అధిపతులు, రక్షణా శాఖ కార్యదర్శులతో…
ఉరవకొండ నియోజకవర్గం, చాయాపురంలో హంద్రీనీవా సుజల స్రవంతి పనులను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఇంజనీర్లు, అధికారులను పనుల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులు కూడా సీఎం వెంట ఉన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ సమగ్ర రూపం, పనుల ప్రగతి, చిట్ట చివరి ప్రాంతాలకు ఎప్పటిలోగా నీరు అందిస్తారు? అనే వివరాలను అధికారులను అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలో అధికారులతో పాటు దిగి పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనులను డ్రోన్లతో పర్యవేక్షిస్తున్న సిబ్బందిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
