ప్రధానమంత్రి మోడీ ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) 2025 ను ఇటీవల అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. భారతీయ చిత్ర పరిశ్రమ నుండి అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంటర్టైన్మెంట్ రంగం గురించి పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక ఈ క్రమంలో లైకా సంస్థ తమ రానున్న ప్రాజెక్టులపై కీలక ప్రకటన చేసింది. ప్రధానమంత్రి మోడీ విజన్, లక్ష్యాలకు అనుగుణంగా భారత్‌ను అంతర్జాతీయ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీర్చిదిద్దేందుకు తొమ్మిది ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు లైకా ప్రకటించింది. మహావీర్ జైన్ ఫిల్మ్స్‌తో కలిసి ఈ ప్రాజెక్టులను సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలిపింది.
Author: admin
అశేష జన వాహిని మధ్యలో, అతిరథ మహారధులు సమక్షంలో అమరావతి పునః ప్రారంభం అయింది. కనుల పండుగగా జరిగిన ప్రజా రాజధాని పనుల పునః ప్రారంభ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్య-ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర – రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. తెలుగులో కూడా మాట్లాడారు. అమరావతిని ఒక శక్తిగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడే రాజధాని అమరావతికి పట్టిన గ్రహణం వదిలేసిందని ప్రధాని వ్యాఖ్యానించారు. శరవేగంగా అధునాతన మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటున్న ప్రపంచ దేశాల్లో భారతదేశం ముందుంది. ఆ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ కూడా అందుకుంటోందని ఈరోజు రాష్ట్రంలో వేలకోట్ల రోడ్డు, రైల్వే ప్రాజక్టులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. వచ్చే జూన్ 21న ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా 10వ…
ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ లాగా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా దాదాపు ప్లే ఆఫ్ రేసు కు దూరమైనట్లే. తాజాగా ఆ జట్టు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడి మరో పరాజయం ఖాతాలో వేసుకుని పాయింట్స్ టేబుల్ లో 9వ స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ శుభ్ మాన్ గిల్ 76 (38; 10×4, 2×6), జాస్ బట్లర్ 64 (37; 3×4, 4×6)లు హాఫ్ సెంచరీలతో రాణించగా…సాయి సుదర్శన్ 48 (23; 9×4), వాషింగ్టన్ సుందర్ 21 (16; 1×6) పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లు పరుగులు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఉనద్కత్…
2023లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ సినిమా పై ఇప్పటికే అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ మళ్లీ మాస్ మేకోవర్‌లో కనిపించనుండగా, పాన్ ఇండియా స్థాయిలో ప్రముఖ నటులు భాగమవుతుండటం సినిమాపై హైప్‌ను పెంచుతోంది.ఈ నేపథ్యంలో తాజాగా సినిమా సెట్స్ నుంచి లీకైన ఓ స్టిల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఆ స్టిల్‌లో తెలుగు నందమూరి బాలకృష్ణ పోలీస్ యూనిఫారంలో దర్శనమిచ్చారు.దీంతో ఆయన చిత్రంలో శక్తివంతమైన పోలీస్ పాత్రలో నటిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్,కన్నడ నటుడు శివరాజ్ కుమార్, మలయాళి అగ్రనటుడు మోహన్‌లాల్‌తో కలిసి బాలయ్య ఉన్న చిత్రం లీక్ అయింది.ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.జైలర్-2 కథ మరింత ఉత్కంఠభరితంగా సాగనుందని సమాచారం.మొదట ఎస్.జె.సూర్య కీలక పాత్రలో ఉన్నారని వార్తలు వచ్చినప్పటికీ,బాలకృష్ణ పాత్రను చిత్రబృందం సీక్రెట్‌గా ఉంచింది.కానీ…
అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. గత ఐదేళ్లుగా అస్తవ్యస్తమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ పై ఉంటే ప్రధాని మోడీగారి వ్యక్తిగత శ్రద్ధతో కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందించిందని అన్నారు. ఒక్క అమరావతి నిర్మాణమే కాదు… రాష్ట్రంలో 26 జిల్లాలను కూడా అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు. ఈరోజు అమరావతి పునర్నిర్మాణం జరుపుకుంటుంది అంటే, అది అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమించిన రాజధాని రైతులు, రైతు కూలీలు, మహిళల విజయమని పేర్కొన్నారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇక్కడ కనీసం 5 లక్షల మంది పిల్లలు చదువుకునే అవకాశం కలుగుతుందని వివరించారు. ఈరోజు అమరావతి పునర్నిర్మానాన్ని ప్రారంభించడానికి వచ్చిన మోడీ గారిని మూడేళ్ళ తర్వాత అమరావతి నగరాన్ని ప్రారంభించడానికి మళ్ళీ రావాలని కోరారు. ఇక ఐటీ విప్లవానికి నాంది పలుకుతూ గతంలో హైదరాబాద్‌లో నిర్మించిన హైటెక్ సిటీని నాటి ప్రధాని అటల్ బిహారీ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునః నిర్మాణ పనులు అట్టహాసంగా నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మరియు రాజధాని ఆశలను తుడిచిపెట్టిందని పరదాల మాటున పరిమాణ సాగింది. రైతుల త్యాగాలను స్మరించుకుని, వారికి ధన్యవాదాలు తెలుపాల్సిన బాధ్యత ఉంది. వారి త్యాగాన్ని గుర్తిస్తూ, జవాబుదారీగా వ్యవహరిస్తూ రాజధాని నిర్మాణం జరిగేలా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. కనీసం సొంత ఇల్లు కూడా లేకుండా 140 కోట్ల భారతీయుల కోసం అనుక్షణం కష్టపడుతున్న గొప్ప నాయకుడు ఆయన మన కష్టాలను, రైతుల…
ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో టూరిస్ట్ లపై జరిగిన ఉగ్రదాడి ఘటనను ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మరోసారి స్పందించింది. ఉగ్రవాదుల ఏరివేతలో భారత్ కు పాకిస్థాన్ సహకరించాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇక ఇరు దేశాలు కూడా సంయమనం పాటించాలని, విస్తృత ప్రాంతీయ ఘర్షణలకు ఆస్కారం ఇవ్వకూడదని సూచించారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ తమ భూభాగం నుండి పనిచేస్తున్న ఉగ్రవాదులను వేటాడి, కట్టడి చేసే విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని, ఈ అంశంపై భారత్‌కు సహకరిస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటికే అమెరికా అత్యున్నత…
రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతూ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో ప్రతి పౌరునికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవుతుందని తెలిపారు. సంపద సృష్టితో రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా నిలబడుతుందని ఇందుకు సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రజల తరపున మరొక్క మారు కృతజ్ఞతాపూర్వక స్వాగతం పలుకుతున్నానంటూ రాసుకొచ్చారు.
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన ‘క’ చిత్రం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ ఫిల్మ్ అవార్డు సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా టీమ్ కు నెటిజన్లు విషెస్ తెలియజేస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో ఫాంటసీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకు సుజిత్, సందీప్‌లు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. నయన్ సారిక, తన్వీ రాయ్ తదితరులు నటించారు. గతేడాది అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లు కొల్లగొట్టి భారీ హిట్ గా నిలచింది. కథా కథనం , నటీ నటుల నీటిని అన్నీ కలిసి ఆడియన్స్ నుండి విశేష స్పందన అందుకుని మంచి చిత్రంగా నిలిచింది. ఇక తాజాగా అరుదైన ఘనతను దక్కించుకుంది.
కులం పేరుతో పాస్టర్‌ను దూషించిన కేసులో నమోదు చేసిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.ఫిర్యాదుదారుడు క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్లు తన ఫిర్యాదులోనే పేర్కొన్నందున, షెడ్యూల్డ్ కులాల ఆర్డర్–1950 ప్రకారం ఆయనకు ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం చేసింది.గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021లో అక్కల రామిరెడ్డి సహా ఆరుగురిపై ఎస్సీ అట్రాసిటీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టగా, పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.అయితే నిందితులు హైకోర్టును ఆశ్రయించగా,పాస్టర్‌గా పదేళ్లుగా సేవలందిస్తున్న ఆయనకు ఎస్సీ హోదా ఉండదని హైకోర్టు పేర్కొంది. న్యాయవాది ఫణిదత్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ తీర్పు వెలువరిస్తూ, క్రైస్తవ మతంలో కులవ్యవస్థ లేనందున ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదని స్పష్టం చేశారు. తహసీల్దార్ ఇచ్చిన కుల ధృవీకరణ పత్రం ఆధారంగా కూడా మతం మారిన వారికి రక్షణ కలగదని తెలిపారు. ఈ…
