2022లో విడుదలైన ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి సీక్వెల్‌గా “ఓదెల-2” తెరకెక్కింది.ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది కథ అందించడంతో పాటుగా , ఆయనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అకోశ్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుంది.తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.ఇందులో తమన్నా లేడీ అఘోరాగా పాత్రలో కనిపిస్తుంది.సంపత్ నందితో కలిసి మధు క్రియేషన్స్ పతాకంపై డి. మధు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. https://youtu.be/Cb1XauMhTtc?si=NDryXHZ1cArYacJF
Author: admin
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ చిత్రంలో గంగూలీ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు కనిపించనున్నట్లు తెలుస్తుంది.ఈ మేరకు ఇదే విషయంపై గంగూలీ స్పందించాడు.నాకు తెలిసి నా బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు నటించనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఈ చిత్రం ప్రకటించిన అనంతరం తెరపైకి రావడానికి కనీసం సంవత్సరం కంటే ఎక్కువ సమయం పడుతుందంటూ” గంగూలీ అన్నారు.ఈ చిత్రానికి సంబంధించి రాజ్ కుమార్ రావుని సంప్రదించగా…ఆయన కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తుంది.అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఈ చిత్రాన్ని లవ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది.విక్రమాదిత్య మొత్వానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న భాషా వివాదం నేపథ్యంలో దిగ్గజ నటుడు, మక్కల్ నీది మయమ్ (ఎమ్.ఎన్.ఎమ్) అధినేత కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ 8వ వార్షికోత్సవ దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భాష కోసం తమిళులు ప్రాణాలు కోల్పోయారని కాబట్టి ఇలాంటి వాటితో ఆటలు వద్దని ఏ భాష ఆవసరమో తమిళులకు ముఖ్యంగా చిన్నారులకు తెలుసని అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా త్రిభాషా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుచేయడాన్ని తమిళనాడు లోని స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. దీనిపై బీజేపీ-డీఎంకే లో మధ్య భిన్న అభిప్రాయాలున్నాయి. తమపై హిందీని రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేసింది. వీటి వేదికగా చేస్తున్న పోస్టుల వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జి సజ్జల భార్గవ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన సందర్భంలో హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. వీటి వేదికగా చేస్తున్న అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తమ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు చట్టం అనుమతిస్తుందన్న కారణంతో వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసభ్య పోస్టులు పెట్టడానికి వీల్లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టుల నిరోధానికి ఏవిధమైన చర్యలు తీసుకుంటున్నారో సంబంధించిన వివరాలు తమ ముందుంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళనలు చేస్తుంటే వారి విజ్ఞప్తి పట్టించుకోరా అని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోస్టర్ విధానంలో తప్పులు సరిదిద్దే అంశంపై, మెయిన్స్ పరీక్ష నిర్వహణపై కూటమి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని, ఆందోళనలో ఉన్న మెయిన్స్ అభ్యర్థులను పిలిచి చర్చించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన సీఎం చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నట్లు షర్మిల ట్వీట్ చేశారు. ఏపీపీఎస్సీ కూడా మొండిగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం. గ్రూప్-2 మెయిన్స్ కి అర్హత సాధించిన 92,250 మంది అభ్యర్థుల తరుపున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2023 డిసెంబర్ 11న ఇచ్చిన నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తప్పులను సరిదిద్దకుంటే నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులతో నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. రోస్టర్ విధానంలో తప్పుల తడకతో ఝార్ఖండ్…
మానవాళిపై ఈ శతాబ్దంలో అత్యంత ప్రభావం చూపిన కరోనా వైరస్ ను పోలినటువంటి మరో కొత్త వైరస్ ను చైనాలో గుర్తించారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్‌ను హెచ్‌కెయూ 5 – కోవ్ – 2గా పేర్కొన్నారు. ఇది కోవిడ్ 19కి కారణమైన సార్స్ – సీఓవీ 2ను పోలి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ విషయాన్ని హాంకాంగ్‌కు చెందిన ఒక ప్రముఖ పత్రిక తన కథనంలో పేర్కొందని తెలుస్తోంది. ఇది జంతువుల నుండి మానవులకు సంక్రమించే ముప్పు ఉందని అయితే దీని సామర్థ్యం కోవిడ్ 19తో పోలిస్తే తక్కువేనని సైంటిస్ట్ లు అభిప్రాయపడుతున్నారు. గబ్బిలాల్లో కరోనా వైరస్ గురించి విస్తృత రీసెర్చ్ లు చేసిన ప్రఖ్యాత వైరాలజిస్ట్ షీ ఝెంగ్ లీ ఈ రీసెర్చ్ టీమ్ కు నేతృత్వం వహించారు. ఈ రీసెర్చ్ కు సంబంధించి పరిశోధనా పత్రం సెల్ జర్నల్‌లో రివ్యూకు ఉంచినట్లు కథనంలో పేర్కొన్నారు.
రాష్ట్ర సచివాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ ప్రాధాన్యతలకు సంబంధించిన అంశాలపైన ఈసందర్భంగా చర్చించారు. రాష్ట్రంలో మహిళలలు, చిన్నారుల రక్షణ, తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు. హెల్ప్ డెస్కుల ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మహిళా దినోత్సవమైన మార్చి 8 నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ రూపకల్పన ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని ఈసందర్భంగా ఆదేశించారు.
భారత సంతతికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ రాగదీపిక పుచ్చా బ్లాక్ హోల్స్ మీద చేసిన పరిశోధనలలో ఆమె సాధించిన ఆవిష్కరణల పట్ల ఏపీ సీఎం చంద్రబాబు హార్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆమెకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గుంటూరులోని తెనాలికి చెందిన ఆమె ప్రపంచ వేదికపై తమదైన ముద్ర వేసిన ప్రముఖ మహిళల జాబితాలో చేరిందని కొనియాడారు. ఆమె మరియు ఆమె బృందం మరిన్ని విజయాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఇక రాగ దీపిక వారి టీమ్ చిన్న గెలాక్సీలు వాటిలోని బ్లాక్ హోల్స్ పై చేసిన రీసెర్చ్, వాటి ఫలితాలకు గుర్తింపు లభించింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టులో రిషబ్ పంత్ కు బదులుగా కే.ఎల్.రాహుల్ ను ఎంపిక చేసుకోవడంపై కోచ్ గంభీర్ కు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. వన్డే ఫార్మాట్ లో రాహుల్ కు ఉన్న గణాంకాలే అతని ఎంపికకు కారణమని తెలిపాడు. మన జట్టు పటిష్టమైన జట్టని ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫేవరెట్ అని పేర్కొన్నాడు. పంత్ కూడా అద్భుతమైన ఆటగాడని అయితే రాహుల్ కు మంచి గణాంకాలు ఉన్నాయని రాహుల్ కు గంభీర్ మద్దతిచ్చేందుకు అదే కారణమని అన్నాడు. రాహుల్ పంత్ మధ్య తేడా చాలా స్వల్పమని పేర్కొన్నాడు. భారత బ్యాటింగ్ లైనప్ పైనా ప్రశంసలు కురిపించాడు. జట్టుకు మంచి ఆటగాళ్లు ఉన్నారని భారత్ లో టాలెంట్ కు కొరత లేదన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సౌతాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ పై 107 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా కరాచీ నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. రికెల్టన్ 103 (106; 7×4, 1×6) సెంచరీతో రాణించగా…బావుమా 58 (76; 5×4), వాన్ డెర్ డస్సెన్ 52 (42; 3×4, 2×6), మర్క్రమ్ 52నాటౌట్(36; 6×4, 1×6) హాఫ్ సెంచరీలతో కదంతొక్కడంతో భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నబీ 2 వికెట్లు, ఫరూకీ, అజ్మతుల్లా, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు. ఇక టార్గెట్ చేధించే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ 43.3 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటయింది. రహ్మత్ షా 90 (92; 9×4, 1×6) ఒక్కడే చెప్పుకోదగిన ప్రదర్శన కనబరిచాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు.…
