Author: admin

గత అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ భారత్ లో ఎవరినో గెలిపించడానికి రూ.182 కోట్లు విడుదల చేశారని ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా దీనిపై భారత ప్రభుత్వం స్పందించింది. ఓటింగ్ పెంచడం ద్వారా భారత ఎన్నికలలో జోక్యం చేసుకునేందుకు యూఎస్ ఎయిడ్ (USAID) ప్రయత్నించిందనే వార్తలు పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై సంబంధిత విభాగాలు దృష్టి పెట్టినట్లు తెలిపింది. యూ.ఎస్ కార్యకలాపాలు, నిధులకు సంబంధించి అమెరికా ప్రభుత్వ యంత్రాంగం తెలిపిన సమాచారాన్ని చూశామని అవి తీవ్ర కలవరపెడుతున్నాయని ముఖ్యంగా భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం ఆందోళనకు దారితీశాయని పేర్కొన్నారు. ఇప్పుడు దీనిపై బహిరంగంగా మాట్లాడడం తొందరపాటు అవుతుందని సంబంధిత అధికారులు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పూర్తి సమాచారం వచ్చాక దీనిపై మరిన్ని వివరాలు తెలియపరుస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.

Read More

స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం లభించింది.కాగా ప్రముఖ హాలీవుడ్ సినిమా న్యూస్ మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ తాజాగా ది ‘హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ పేరుతొ భారత్ లోనూ మ్యాగజైన్ ప్రారంభించనుంది.ఈ మేరకు భారత్ లో ఈ మ్యాగజైన్ ఫస్ట్ ఎడిషన్ ను అల్లు అర్జున్ కవర్ పేజీ తో ముద్రించనుంది.అల్లు అర్జున్: ది రూల్ పేరిట కవర్ పేజీ కథనం కూడా రూపొందించారు.అల్లు అర్జున్ కథానాయకుడిగా తెలుగులో తీసిన పుష్ప-2 చిత్రం హిందీ సినిమా చరిత్రను తిరగరాసిందని ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా తెలిపింది.అంతే కాదు అల్లు అర్జున్ ను స్టార్ ఆఫ్ ఇండియా అని పేర్కొంది. With Pushpa 2, a film shot in Telugu, @alluarjun has made Hindi movie history.The Star of India, #AlluArjun is on the launch issue of #TheHollywoodReporterIndia's magazine.On stands…

Read More

ఈ వారాంతాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగించాయి. వారం చివరి రోజైన నేడు ఆటో స్టాక్స్ లో అమ్మకాలతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ వాణిజ్య యుద్ధం భయాలు కొనసాగుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 424 పాయింట్లు నష్టపోయి 75,311 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 117 పాయింట్ల నష్టంతో 22,795 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.66గా కొనసాగుతోంది. ఎల్ అండ్ టీ, హెచ్.సీ.ఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, హెచ్.డి.ఎఫ్.సి షేర్లు లాభాల్లో ముగిశాయి.

Read More

న్యూఢిల్లీలో అంతర్జాతీయ ఆరోగ్య వేదిక 12వ సంచికను ఉద్దేశించి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మాట్లాడారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన జాతీయ ఆరోగ్య మిషన్ ఇతర పథకాల కింద అందించిన సేవల వల్ల రోగులకు ఆరోగ్య చికిత్స నిమిత్తం సొంతంగా ఖర్చు పెట్టే అవసరం తగ్గిందని పేర్కొన్నారు. 2018లో ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన లక్ష్యం అందరికీ ఆరోగ్య చికిత్స సౌకర్యం కల్పించడమేనని తెలిపారు. దేశంలో 40% జనాభాకు ఈ పథకం కింద చికిత్స అందుతుందని ఆయన వివరించారు. ఇటీవల సామాజిక ఆర్థిక హోదాతో సంబంధం లేకుండా 70 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు గల వయోవృద్ధులందరికీ కూడా ఈ పథకాన్ని విస్తరించిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమం కేవలం సమావేశం కంటే ఎక్కువని ఇది భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణను మార్చడానికి ఉద్దేశించిన ఉద్యమమని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం సంపూర్ణమైన…

Read More

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం “హరిహర వీరమల్లు”.ఈ చిత్రాన్ని పిరియ‌డిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని దర్శకులు రూపొందిస్తున్నారు.అయితే ఈ చిత్రాన్ని 2025 మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.ఈ మేరకు చిత్రబృందం ప్రమోషన్స్ మొదలు పెట్టింది.ఇప్ప‌టికే మాట వినాలి అనే ఫ‌స్ట్ సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది.తాజాగా సెకండ్ సింగిల్ అప్‌డేట్‌ ఇచ్చింది. కాగా కొల్లగొట్టినాదిరో అనే రెండో సింగిల్ ప్రోమోను విడుదల చేశారు.ఈ పాట‌లో నిధి ఆగ‌ర్వాల్‌తో పాటు అనసుయ కూడా కనిపించింది.ఈ సెకండ్ సింగిల్ ‘కొల్లగొట్టినాదిరో’ పాటను ఫిబ్రవరి 24న సాయంత్రం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు కొంత భాగానికి దర్శకత్వం వహించగా , అనివార్య కారణాల వలన అయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.ప్రస్తుతం మిగిలిన భాగానికి జ్యోతి కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు.రెండు భాగాలుగా వ‌స్తున్న ఈ చిత్రం మొద‌టి…

Read More

ఏపీ సీఎం చంద్రబాబు జోక్యంతో మిర్చి రైతులకు భారీ ఊరట లభించనుంది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో మిర్చి ధరలపై సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో మిర్చి రైతులను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖామంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ఢిల్లీలోని కృషి భవన్ లో ఈరోజు భేటీ అయినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నెల మొదటి వారం లో ఈ సమస్యను తెరపైకి తీసుకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు మార్గ దర్శకత్వంలో.. మిర్చి సేకరణ, ఎగుమతులను పెంచడానికి, మన రైతులను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించే మార్గాలపై చర్చించినట్లు తెలిపారు. మన మిర్చి రైతులను ఆదుకోవడానికి. కేంద్ర వ్యవసాయ మంత్రి ఎంతో ఆసక్తి కనబరిచారని వివరించారు. వారికి ప్రయోజనం చేకూర్చేలా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) ధరను పెంచుతామని హామీ ఇచ్చారని దీనిని ముందుకు…

Read More

స్టార్ డైరెక్టర్ శంకర్ కు ఈడీ షాక్ ఇచ్చింది.మనీలాండరింగ్ చట్టం ప్రకారం రూ. 10 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది.ఈనెల 17వ తేదీన ఆస్తులను అటాచ్ చేసినట్లు పేర్కొంది.అయితే ‘రోబో’ చిత్రాన్ని శంకర్ తన కథ ‘జిగుబా’ను కాపీ కొట్టి రూపొందించారు అంటూ…ఆరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లో పిటిషన్ దాఖలు చేశారు.శంకర్ కాపీరైట్, ఐటీపీ చట్టాలను ఉల్లంఘించారని పిటిషన్ లో పేర్కొన్నాడు.ఈ మేరకు ఈ కేసు విషయమై ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక కూడా శంకర్ కు వ్యతిరేకంగా వచ్చింది.కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని శంకర్ ఉల్లంఘించారని ఆ నివేదిక ఆధారంగా ఈడీ స్పష్టం చేసింది.అయితే అప్పట్లో ఆ సినిమాకు రెమ్యూనేషన్ శంకర్ రూ. 15 కోట్లు అందుకున్నట్లు తెలుస్తుంది.

Read More

ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టును పంచుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి ఎన్నో ఏళ్ల కిందట హైదరాబాద్ కు వలసవెళ్లి అక్కడే వెదురు బుట్టలు, విసనకర్రలు, కొబ్బరి ఆకులతో పలు ఉత్పత్తులు తయారు చేస్తూ జీవిస్తున్న ఒక వ్యక్తి గురించి హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ పోస్టు చేసింది. దీనిని షేర్ చేస్తూఏపీ సీఎం చంద్రబాబు స్ఫూర్తిదాయకమైన జీవిత పాఠమని అన్నారు. అతని కథ ఆంధ్ర ప్రదేశ్ కష్టపడి పనిచేసే తత్వం యొక్క స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. అతను అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లిపోవాల్సి రావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఆ వ్యక్తి పనితనం, ఆశావహ దృక్పథం బాగా నచ్చాయని తన కలలను, కళను కలగలిపి వస్తువులుగా మలిచి జీవనం సాగిస్తుండడాన్ని ప్రగాఢంగా అభిమానిస్తున్నానని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నామని తద్వారా…

Read More

ఇజ్రాయిల్‌లోని టెల్ అవివ్ దగ్గరలోని బాట్ యామ్‌లో పార్క్ చేసి ఉన్న 3 బ‌స్సుల్లో పేలుళ్లు సంభవించాయి.అయితే ఈ పేలుళ్ల ఉగ్ర‌వాదులు పని అయి ఉంటుందని ఇజ్రాయిల్ పోలీసులు అభిప్రాయ పడ్డారు.అయితే మ‌రో 2 బ‌స్సుల్లో అమ‌ర్చిన బాంబులు పేల‌లేద‌ని అధికారులు తెలిపారు.కాగా అనుమానితుల కోసం అన్వేషిస్తున్న‌ట్లు పోలీసులు చెప్పారు.ఈ మేరకు ఆ ప్రాంతంలో భారీ సంఖ్య‌లో పోలీసులను మోహ‌రించారు.దేశ‌వ్యాప్తంగా అన్ని బ‌స్సులు,రైళ్లను ఆపేశామ‌ని ర‌వాణాశాఖ మంత్రి మిరి రిగెవ్ వెల్లడించారు.బాంబు స్క్వాడ్ త‌నిఖీలు నిర్వ‌హించిన త‌ర్వాతే వాటిని పంప‌నున్న‌ట్లు పేర్కొన్నారు.పార్కింగ్ ప్రాంతంలో ఉన్న ఓ బ‌స్సుకు నిప్పు అంటుకున్న విజువ‌ల్స్ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Read More

ఢిల్లీలో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేదంటూ మాజీ సీఎం ఆతిశీ విమర్శించారు.అయితే ఢిల్లీ మహిళలను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు.తోలి కేబినెట్‌ సమావేశంలోనే మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చే పథకాన్ని ఆమోదిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చలేదంటూ విమర్శలు చేశారు.ఈ విమర్శలపై ప్రస్తుత ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్పందిస్తూ…తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క రోజు కూడా కాలేదు…అప్పుడే విమర్శలు చేస్తున్నారా..? అంటూ ఆమె మండిపడ్డారు.ఈ మేరకు ఆమెకు సీఎం గట్టి బదులిచ్చారు.కొత్త ప్రభుత్వానికి లెక్చర్‌ ఇవ్వొద్దని..బదులుగా తన సొంత పని చూసుకుంటే మంచిదని’ వ్యాఖ్యానించారు.తాము మొదటి రోజే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీలో ఆయుష్మాన్‌ భారత్ యోజనను ప్రారంభించినట్లు తెలిపారు. అయితే దీని ద్వారా ప్రజలకు రూ.10 లక్షల ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.కాగా ఢిల్లీని కాంగ్రెస్ 15 ఏళ్లు పాలించింది.ఆప్ 13 సంవత్సరాలు అధికారంలో ఉంది.ఆ సమయంలో మీరు ఏం చేశారు…అంటూ…

Read More