Author: admin

అవినీతి రహిత రాజకీయాలనే నినాదంతో ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ఊబిలో పీకల లోతు కూరుకుపోయింది.కాగా ప్రస్తుత ఓటమికి కారణం ఇదే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఆ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ పై ఆరోపణలు రావడం ఆప్ కు భారీగా నష్టం చేసిందని చెబుతున్నారు.ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో దారుణమైన ఓటమికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో ఒకటి లిక్కర్ స్కాంలో ఆప్ నేతలు జైలుకు వెళ్లడం,మరొకటి శీష్ మహల్ పునర్నిర్మాణం కోసం భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే…ఈ ఆరోపణలు రెండో కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తి చేశారు.అయితే అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడాన్ని ఢిల్లీ ఓటర్లు జీర్ణించుకోలేకపోయారు.అదేవిధంగా తాను సామాన్యుడినని,ఆడంబరాలకు,ఆర్భాటాలకు దూరంగా ఉంటానని పదే పదే వ్యాఖ్యానించే కేజ్రీవాల్ తన అధికారిక భవనం…

Read More

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 సంవత్సరాల తరువాత ఢిల్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుని సత్తా చాటింది. ఆ పార్టీ 47 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టి బోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ బీజేపీ విజయంపై స్పందించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. జనశక్తి ప్రధానం! అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు విజయాన్ని అందించారని తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం అందించిన ఢిల్లీలోని నా ప్రియమైన సోదరీమణులు మరియు సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆశీర్వాదాలు పొందడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీని అభివృద్ధి చేయడంలో, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో అలాగే వికసిత్ భారత్‌ను నిర్మించడంలో ఢిల్లీ ప్రధాన పాత్ర పోషించేలా చేయడానికి కృషి చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ అద్భుతమైన ఫలితానికి కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలను అభినందించారు.

Read More

దేశంలో విమాన విడిభాగాల తయారీపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక వేత్తలు, నిపుణులు, మంత్రిత్వశాఖ అధికారులు పాల్గొన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, విమానయాన తయారీలో భారత్ ను ప్రపంచానికి కేంద్రంగా మార్చే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. దేశం యొక్క సొంత ప్రాంతీయ రవాణా విమానాలను అభివృద్ధి చేయడంపై ఈ సమావేశం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన ‘ఎక్స్’ లో తెలిపారు. దేశ వృద్ధిలో స్వయం సమృద్ధ విమానయాన రంగంగా మన ఎంఆర్ఓ(మెయింటెనెన్స్, రిపేర్, ఆపరేషన్స్) పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా నిలవడమే కీలకంగా చర్చలు సాగాయని పేర్కొన్నారు. ప్రజల పట్ల అంకితభావానికి ఇదే నిదర్శనం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు రైల్వే శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం, పార్లమెంటు సభ్యుడిగా పదేళ్ల పోరాటం, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరడం ఆనందంగా భావిస్తున్నట్లు…

Read More

ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానానికి కూటమి అభ్యర్థి,మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ నామినేషన్‌ వేశారు.కూటమి పార్టీల తరఫున టీడీపీ,జనసేన ,బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి ప్రదర్శనగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలసి గుంటూరు కలెక్టరేట్‌కు ఊరేగింపుగా వెళ్లారు.ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కొలుసు పార్థసారథి,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌,శాసన సభ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు,ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, కామినేని శ్రీనివాసరావు, తెనాలి శ్రావణ్‌కుమార్‌, గల్లా మాధవి, మొహమ్మద్‌ నసీర్‌, జూలకంటి బ్రహ్మారెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు,భాష్యం ప్రవీణ్‌, అరవిందబాబు,ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు ఆలపాటికి రాజేంద్ర ప్రసాద్ కు తోడుగా ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్మికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ నామినేషన్‌ పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మనోహర్‌ మాట్లాడుతూ కూటమి పిలుపులో భాగంగా జనసేన ఆలపాటికి అన్ని…

Read More

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.కాగా ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ…ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందనేది ముందే ఊహించిందేనని చెప్పారు.ఢిల్లీ ప్రజలు ఆప్ ను చీపురుతో ఊడ్చేశారని అన్నారు.ప్రజలు ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను కోలుకున్నారని…అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వద్దనుకున్నారని చెప్పారు.మేధావి వర్గం మొత్తం బీజేపీకే ఓటు వేసిందని తెలిపారు.తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ మేధావి, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.శాసనసభలో ప్రజల సమస్యలపై ప్రశ్నించేది బీజేపీ మాత్రమేనని బండి సంజయ్ అన్నారు.

Read More

ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రివాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా లకు ఢిల్లీ ప్రజలు షాక్ ఇచ్చారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు సీనియర్ నేతలను ఢిల్లీ ప్రజలు ఘోరంగా ఓడించారు.కాగా మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అయితే చివరి రౌండ్ వరకు ఓటమి అంచుల్లో ఉన్నఢిల్లీ ఆపద్ధర్మ సీఎం అతిషి అనూహ్యంగా విజయం సాధించారు.కల్కాజీ నియోజకవర్గం నుండి పోటీపడిన ఆమె బీజేపీ అభ్యర్థి, తన సమీప ప్రత్యర్థి రమేష్ బిధూరీపై ఆమె విజయం సాధించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా రమేశ్ బిధూరీ సీఎం అతిషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఆ వ్యాఖ్యలు అతిషికి మేలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read More

ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో …బీజేపీకి పట్టం కడుతూ..ఆమ్ ఆద్మీ పార్టీ కు ఢిల్లీ ప్రజలు షాక్ ఇచ్చారు.ఆ పార్టీ అధ్యక్షుడు ,ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజరీ వాల్ కు కూడా సైతం పోటీ చేసిన చోట ఓటమి పాలయ్యారు.ఈ మేరకు విద్యావంతులు,ఉద్యోగులు ఓట్లు వేసే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులోనూ కేజ్రీవాల్ వెనుకబడ్డారు.అనంతరం మొదలైన ఈవీఎంల ఓట్ల లెక్కింపులో 2 & 3 రౌండ్లు స్వల్ప మెజార్టీ కనబర్చినప్పటికీ 200 నుండి 300 ఓట్లకు మించి అధిక్యం కనబర్చలేదు.అయితే మొత్తం 13 రౌండ్లకు గానూ మొదటి రౌండ్‌లో కేజ్రీవాల్‌పై పర్వేశ్ 74 ఓట్ల మెజార్టీ సాధించారు.2వ రౌండ్‌లో కేజ్రీవాల్ 328 ఓట్లు ఎక్కువ సాధించారు.దీనితో కేజ్రీవాల్ స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. కాగా 3వ రౌండ్‌లో కేజ్రీవాల్ దాదాపు 90 ఓట్లు పర్వేష్‌పై ఎక్కువుగా సాధించారు.అనంతరం నాల్గవ రౌండ్ పర్వేష్ అధిక్యం సాధించగా..5వ రౌండ్‌లో కేజ్రీవాల్ అధిక్యాన్ని…

Read More

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చెందారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ బీజేపీ నేత పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో ఓడిపోయారు. 3 వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ను న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్లు ఓడించారు. జంగ్పూరాలో మరో ఆప్ అగ్రనేత మనీష్ సిసోడియా ఓటమి చెందారు. సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ 600 ఓట్ల తేడాతో విజయభేరీ మోగించారు. జైలుకు వెళ్లొచ్చిన సానుభూతి కూడా సిసోడియాను గట్టెక్కించలేకపోయింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోయారని కేజ్రీవాల్పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని లిక్కర్ స్కామ్తో కేజ్రీవాల్ ప్రతిష్ఠ మసకబారిందని అన్నా హజారే పేర్కొన్నారు.

Read More

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా టైఫాయిడ్ ను అరికట్టేందుకు భారత్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది.ఈ మేరకు పశ్చిమ బెంగాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు.కాగా ఈ వ్యాక్సిన్ సాల్మోనెల్లా టైఫీ,సాల్మోనెల్లా పారాటిఫై-ఏ ఇన్ఫెక్షన్ను నివారిస్తుందని చెబుతున్నారు.మనదేశంలో ప్రతి ఏడాది కోటిపైగానే టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయని సమాచారం.అయితే ప్రపంచవ్యాప్తంగా టైఫాయిడ్ రోగుల సంఖ్యలో భారత్ అగ్రస్థానంలో ఉంది.అయితే సాల్మొనెల్లా టైఫీ, సాల్మొనెల్లా పారాటైఫీ దేశంలో ఏటా కోటి మందికిపైగా టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయని రిపోర్ట్స్ తెలుపుతున్నాయి.తాజాగా దీనికి వ్యాక్సిన్ తయారు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది. అయితే ఇది టీబీ సంక్రమణ కంటే చాలా ఎక్కువ.ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉపయుక్తంగా ఉండనుందని ఐసీఎంఆర్ తెలిపింది.టైఫాయిడ్ ను తగ్గించేందుకు యాంటీబయాటిక్పై ఆధారపడడాన్ని తగ్గిస్తుందని పేర్కొంది.టైఫాయిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరడం,తదితర ఆరోగ్య సంరక్షణ…

Read More

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీదే అధికారం అని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం మొత్తంగా 70 స్థానాలకు గాను 45కు పైగా స్థానాల్లో ఆ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. ఆప్ 22 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ఈ ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తూ పోస్టు చేశారు. ‘బీజేపీని మరోసారి గెలిపిస్తున్నందుకు రాహుల్ గాంధీకి అభినందనలు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి 2024 లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను జతచేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క చోట కూడా ముందంజలో లేకపోవడం గమనార్హం. Congrats to Rahul Gandhi for winning the election for BJP, yet again!Well done 👏 https://t.co/79Xbdm7ktw— KTR (@KTRBRS) February 8,…

Read More