Author: admin

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హాసీనా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని భారత్ స్పష్టం చేసింది. ఇటీవల బంగ్లాదేశ్ జాతిపితగా పరిగణించే షేక్ ముజీబుర్ రెహమాన్ చారిత్రాత్మక నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ షేక్ హాసీనా బంగ్లాదేశ్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. వీటిని తీవ్రంగా పరిగణించిన అక్కడ అధికారులు ఢాకాలోని భారత తాత్కాలిక హైకమీషన్ కు సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ తాజాగా స్పందించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హాసీనా వ్యాఖ్యలు భారత్ కు ఆపాదించడం సరికాదని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ హై కమీషనర్ తో ఇటీవల జరిగిన చర్చలలో ఈ విషయాన్ని స్పష్టం చేశామని తెలిపారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసీనా వ్యాఖ్యలు భారత్ కు సంపాదిస్తే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని…

Read More

అప్పుడు ఎప్పుడో ఏఎన్ఆర్ మనం చిత్రంలో కొన్ని సెకన్లు పాటు కనిపించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆ తర్వాత సైరాలో మాత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసై వెంకన్నగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.కాగా రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కిలో అశ్వద్ధామగా అద్భుతంగా నటించాడు.ఇందులో అమితాబ్ బచ్చన్ నటనకి థియేటర్లు దద్దరిల్లిపోయాయి.అశ్వద్ధామ అంటే ఆయనే గుర్తువచ్చేలా చేసారు. గత ఏడాది జరిగిన అక్కినేని నాగేశ్వరరావు జాతీ అవార్డుల వేడుకలో నేనూ తెలుగు నటుడినే…నన్ను కూడా గుర్తు పెట్టుకోండి అంటూ ఆయన చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి.అయితే అమితాబ్ బచ్చన్ చెప్పినట్లుగా ఆయనలోని నటుడిని మన దర్శకులే ఎక్కువగా వాడుకుంటున్నారు..గౌరవిస్తున్నారు.అయితే తాకగా విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో రానున్న సినిమాలో కీలక పాత్ర కోసం అమితాబ్ పేరు వినిపిస్తుంది.అయితే ఈ చిత్రం 1850ల నాటి…

Read More

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఘోర పరాజయం దిశగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇండీ కూటమిపై విమర్శలు గుప్పించారు.ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేస్తూ … రామాయణం సీరియల్ సంబంధించిన జిఫ్ ఇమేజ్ ను షేర్ చేశారు.’జీవితమంతా కొట్టుకుంటూ ఉండండి…ఒకరినొకరు అంతం చేసుకోండి’ అని అందులో ఉంది.ఇండియా కూటమి పార్టీలు కొట్లాడుకుంటుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ ఆయన పరోక్షంగా విమర్శించారు. Aur lado aapas mein!!! https://t.co/f3wbM1DYxk pic.twitter.com/8Yu9WK4k0c— Omar Abdullah (@OmarAbdullah) February 8, 2025

Read More

‘వేవ్స్’ (వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్) ను భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. భారత్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హాబ్ గా మార్చడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ ను నిర్వహించనున్నట్లు ప్రధాని మోడీ ఇప్పటికే తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖ నటులు, వ్యాపారవేత్తలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, ఆనంద్ మహీంద్రా, షారుక్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఇందులో భాగం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అడ్వైజరీ బోర్డులో ఉండడం పట్ల ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. WAVES (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్) కోసం అడ్వైజరీ బోర్డ్‌లో భాగం…

Read More

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ప్రారంభమైంది. 19 కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే ఫలితాలు ఇప్పటివరకు కనిపిస్తున్నాయి. దాదాపుగా 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా బీజేపీ ముందుకు పోతోంది.తాజా ఫలితాల సరళిని పరిశీలిస్తే ఫలితాల్లో బీజేపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తుంది. మెజార్టీ మార్క్ దాటేసిన బీజేపీ.. 45 స్థానాల్లో బీజేపీ, 24 స్థానాల్లో ఆప్ లీడ్.. ఒకే ఒక్క చోట ఆధిక్యంలో కాంగ్రెస్ కొనసాగుతోంది.

Read More

ఐసీసీ ఈవెంట్ లు మినహాయిస్తే క్రికెట్ లో దాదాపుగా ఇప్పుడు అన్నీ కూడా ద్వైపాక్షిక సిరీస్ లే ఎక్కువగా జరుగుతున్నాయి.‌ కానీ ఒకప్పుడు ట్రై యాంగిల్ సిరీస్ లకు చాలా క్రేజ్ ఉండేది. మళ్లీ ఇప్పుడు అర దశాబ్దం తర్వాత మళ్లీ ట్రై యాంగిల్ సిరీస్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే డానికి ముస్తాబవుతోంది. పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాల మధ్య ట్రై యాంగిల్ సిరీస్ నేటి నుండి ప్రారంభం కానుంది. వన్డే ఫార్మాట్ లో త్వరలో జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహాకంగా ఈ మూడు టీమ్ లు ఉపయోగించుకోనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సిద్ధం చేసిన లాహోర్, కరాచీ స్టేడియాలలో ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి. మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్, న్యూజిలాండ్ లు తలపడనున్నాయి.

Read More

గ్రామ స్వరాజ్యానికి నిదర్శనం… విస్సాకోడేరు గ్రామ పంచాయతీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. గ్రామస్థాయిలో ఉన్న సమస్యలను గ్రామ స్థానిక సంస్థలు పరిష్కరించడమే స్థానిక స్వయం పరిపాలన అంటారని ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ, గ్రామ తాగు నీటి సమస్యకు పరిష్కారం చూపేలా రూ.10 లక్షల ఖర్చుతో 2 ఫిల్టర్ బెడ్లను మరమ్మత్తు చేయడంతోపాటుగా, నిరుపయోగంగా ఉన్న నీటి శుద్ధి కేంద్రం మరమ్మత్తులు చేయడం, నూతన పైప్ లైన్లు వేయడం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా విస్సా కోడేరులో తమ గ్రామ త్రాగునీటి సమస్యను తామే పరిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ స్వరాజ్య దిశగా అడుగులు వేసిన విస్సా కోడేరు గ్రామ పంచాయతీనీ, గ్రామ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా అభినందించారు. అలాగే ఈ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన జిల్లా పంచాయతీరాజ్, నీటి సరఫరా శాఖ…

Read More

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్, అమెరికాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 10 నుండి 12వ తేదీ వరకు ఫ్రాన్స్ లో 12 నుండి 13వ తేదీ వరకు అమెరికాలో పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఫ్రాన్స్ లో జరగనున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి అధ్యక్షత వహించనున్నారు. అనంతరం అక్కడ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ను పరిశీలిస్తారని విక్రమ్ పేర్కొన్నారు. 12 సాయంత్రం ఫ్రాన్స్ నుండి బయలుదేరి వాషింగ్టన్ చేరుకుంటారు. 13 ఉదయం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరి నేతృత్వంలోని బృందం సమావేశమైంది. సచివాలయంలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరిని శాలువాతో సన్మానించి, స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ ను సీఎం అందించారు. స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికకు చేయూతనివ్వాలని సీఎం చంద్రబాబు ఈసందర్భంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీని కోరారు. నూతన సాంకేతికత – ఆవిష్కరణలు అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అవకాశాలుపై ప్రజంటేషన్ ఇచ్చారు.ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1వ తేదీ నుండి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.ఈ మేరకు ఇంటర్‌ బోర్డు ఇంటర్‌ హాల్‌టికెట్లను విడుదల చేసింది.అయితే ఈసారి వాట్సప్‌ గవర్నెన్స్‌లో ఇంటర్‌ హాల్‌ టికెట్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.విద్యార్థులు వాట్సప్‌ ద్వారానే నేరుగా ఫిబ్రవరి 7వ తేదీ నుండి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పించినట్లు బోర్డు పేర్కొంది.కాగా ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు కళాశాలల హాల్‌టికెట్లు ఆపేయడం వంటి ఘటనలు లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా 161 సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా తాజాగా ఇంటర్‌ హాల్‌ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.వాట్సప్‌ నంబరు 95523 00009 ద్వారా…

Read More