Author: admin

వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు పలు సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం మొబైల్ ఫోన్‌లోనే అన్ని ధృవ‌ప‌త్రాలు పొందే విధంగా ప్ర‌తి పౌరుడికీ డిజీ లాక‌ర్ స‌దుపాయం క‌ల్పించే దిశగా అడుగులు వేస్తోంది. వీటి ద్వారా వాట్సాప్‌లోనే అన్ని ప‌త్రాలు డౌన్ లోడు చేసుకోవ‌చ్చు. డేటా అనుసంధానంతోనే పౌరుల‌కు మెరుగైన సేవ‌లు అందించవచ్చని డేటా అనుసంధాన ప్ర‌క్రియ స‌త్వ‌రం పూర్తి చేయాలని ప్ర‌తి శాఖ‌లోను ఒక చీఫ్ డేటా టెక్నిక‌ల్ అధికారిని నియ‌మించుకోవాలని అధికారుల‌కు ఐటీ, ఆర్టీజీ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని ఆదేశాలు ఇచ్చారు.

Read More

డెహ్రాడూన్‌ వేదికగా జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో బీచ్ వాలీ బాల్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నాలుగవ స్వర్ణ పతకం గెలిచిన నేపథ్యంలో క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పతకం సాధించడం అభినందనీయమని కొనియాడారు. జాతీయ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వైజాగ్ కి చెందిన క్రీడాకారులు దివ్య సాయి, మణికంఠ రాజును మంత్రి ప్రశంసించారు. క్రీడా పోటీల్లో క్రీడాకారులు మరిన్నీ పతకాల సాధించాలని ఈసందర్భంగా ఆకాంక్షించారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మంత్రులతో మాట్లాడుతూ..రానున్న 3 నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనాల్లోకి వెళ్లేలా కార్యచరణ రూపొందిచాలన్నారు.వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని,ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు.ఈ మేరకు కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో బడులు తెరిచే నాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.

Read More

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలు నేడు వెలువడ్డాయి. అయితే సూచీలు జోరును ఈ నిర్ణయాలు పెంచలేకపోయాయి. రెపో రేటును 25 బేసిస్ లు తగ్గించినా ఆ ప్రభావం మార్కెట్లపై పెద్దగా కనపడలేదు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 197 పాయింట్లు నష్టపోయి 77,860 వద్ద ముగిసింది.‌ నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 23,559 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.59గా కొనసాగుతోంది. , భారతీ ఎయిర్టెల్, జొమాటో, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రా టెక్ సిమెంట్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,కియార అద్వానీ జంటగా నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్.అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. RRR లాంటి బ్లాక్ బస్టర్ అనంతరం విడుదలైన రామ్ చరణ్ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే శంకర్ అదే పాత స్టోరీతో ప్రేక్షకుల ముందు రావడంతో ప్రేక్షకులు తిరస్కరించారు.కాగా ఈ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు,తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.

Read More

ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నాం. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే…మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్దివైపు అడుగులు వేస్తున్నాం. ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. అయితే ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలని టీమ్ వర్క్‌గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని తాను విశ్వసిస్తానని తెలిపారు. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు…

Read More

ప్రధాని నరేంద్రమోదీతో అక్కినేని కుటుంబం సమావేశం అయ్యింది.నేడు కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిసేందుకు నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పార్లమెంట్ కు వెళ్లారు. ఈ సమావేశంలో అక్కినేని బయోగ్రఫీపై వస్తున్న బుక్ గురించి చర్చించినట్లు సమాచారం.ప్రధానితో భేటి అయిన ఫొటోలు బయటకు రాలేదు.అక్కినేని ఫ్యామిలీ పార్లమెంట్లో దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.మన్ కీ బాత్ లో భాగంగా ఇటీవల ప్రధాని మోదీ అక్కినేని నాగేశ్వరరావుపై మాట్లాడిన సంగతి తెలిసిందే.తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినీ పరిశ్రమకు ఆయన అందించిన కృషిని మోడీ మన్ కీ బాత్లో మాట్లాడారు.అయితే ప్రధాని చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించి ధన్యవాదాలు తెలియజేశారు.

Read More

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈనెల 24 నుండి జరగనున్నాయి. 24న ఉదయం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ నెల 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 15 వర్కింగ్ డేస్ లో అసెంబ్లీ సమావేశాలు జరిపే యోచనలో ప్రభుత్వం ఉంది. మొదటి రోజు బీఏసీ సమావేశం అనంతరం సభను ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు.

Read More

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు పోటీగా తీసుకొచ్చిన ‘చాటీ జీపీటీ సెర్చ్’ తాజాగా అందుబాటులోకి వచ్చింది.కాగా ‘సైన్ ఇన్’ అవసరం లేకుండా.. ‘చాటీపీటీ సెర్చ్’ ఫీచర్ను అందరూ వినియోగించవచ్చు అని ‘ఓపెన్ఏఏఐ’ పేర్కొంది.నిన్నటి వరకు చాటీజీపీటీ సేవలు పొందేందుకు గూగుల్,యాపిల్,మైక్రోసాఫ్ట్ ఖాతా ద్వారా ‘సైన్ ఇన్’ కావాల్సిందే.ప్రస్తుతం ఆ అవసరం లేకుండా ‘చాటీపీటీ డాట్ కామ్’లోకి వెళ్లి, మనకి కావాల్సిన అంశాన్ని సెర్చ్ చేసుకోవచ్చు అని ‘ఓపెన్ఏఐ’ వెల్లడించింది.ఈ అంశంపై కంపెనీ సీఈవో శామ్ ఆల్ట్మోన్ సోషల్ మీడియా ‘ఎక్స్’లో సరదాగా స్పందిస్తూ…’మేక్ సెర్చ్ గ్రేట్ అగేయిన్’ అనే సందేశాన్ని పోస్ట్ చేశాడు.

Read More

వాహనదారులందరికీ దేశవ్యాప్తంగా ఒకే విధమైన టోల్ విధానం అమలు చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ మేరకు జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు భారీ ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాహనదారులు టోల్ ఛార్జీల అంశంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.దేశంలోని ప్రధాన జాతీయ రహదారులపై అధిక టోల్ ఛార్జీలు వసూలు చేయడం, రహదారి సేవలు తగినంతగా అందకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని వాహనదారులు అసంతృప్తి వ్యాక్తం చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా స్పందించారు.ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…ప్రయాణికులకు ‘త్వరలో’ ఉపశమనం లభిస్తుందని అన్నారు.కొత్త టోల్ పథకానికి సంబంధించిన తమ పరిశోధన పూర్తైందని.. .పూర్తీ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.అయితే టోల్ వసూళ్లపై సోషల్ మీడియాలో అనేక మిమ్స్ వస్తున్నాయని నాకు తెలుసు అన్నారు.చాలా మంది నన్ను ట్రోల్స్ చేస్తున్నారు.టోల్ విషయంలో ప్రజలు…

Read More