Author: admin

ఆర్థిక మోసాల‌కు చెక్ పెట్టేందుకు‌ భారతీర రిజ‌ర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మనదేశ బ్యాంకుల వెబ్ డొమైన్ ఇక నుండి బ్యాంక్.ఇన్ ఆని క‌లిగి ఉండాల‌ని, అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ‌ల‌కు ఫిన్‌.ఇన్ డొమైన్ ఉండాల‌ని సూచించింది. డిజిట‌ల్ లావాదేవీలులో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థ‌ల‌పై విశ్వాసం పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ సంజ‌య్ తెలిపారు. ఈ ఏప్రిల్ నుండి బ్యాంక్.ఇన్ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఆ త‌ర్వాత ఫిన్‌.ఇన్ రిజిస్ట్రేష‌న్లు ఉండనున్నట్లు గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాల‌జీ (ఐడీఆర్‌బీటీ) దీనికి రిజిస్ట్రార్‌గా వ్య‌వ‌హ‌రించనుంది.

Read More

టీటీడీ బోర్డు రద్దు చేయాలన్న పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇటీవల జరిగిన తొక్కిసలాటపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కోరుతూ రామచంద్ర యాదవ్‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. తొక్కిసలాట బాధితులకు పరిహారం పెంచాలని పిటిషనర్ కోరారు. ఈక్రమంలో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టును ఆశ్రయించాలని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. పిటీషన్ లో పేర్కొన్న అంశాలపై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని తెలిపింది. పిటీషన్ పై విచారణకు నిరాకరించింది.

Read More

మహారాష్ట్ర ఎన్నికలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు సంధించారు. మహారాష్ట్రలో 5 సంవత్సరాలలో కంటే 5 నెలల్లో ఎక్కువ మంది ఓటర్లను ఈసీ ఎందుకు చేర్చింది? మహారాష్ట్రలోని మొత్తం వయోజన జనాభా కంటే 2024లో ఎక్కువ మంది ఓటర్లు ఎందుకు ఉన్నారు? అని ప్రశ్నించారు. అలాగే తమకు ఉన్న అనుమానాలు లో ఒక దానిని అడుగుతున్నాం ఉదాహరణకు కమ్తీ నియోజకవర్గం, ఇక్కడ బీజేపీ సాధించిన ఓట్లు దాదాపుగా జోడించబడిన కొత్త ఓటర్ల సంఖ్యకు సమానమని పేర్కొన్నారు. ఈసీ తప్పనిసరిగా ఈ ప్రశ్నలకు సమాధానమివ్వాలి మరియు 2024 లోక్ సభ ఎన్నికలు మరియు 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండింటి యొక్క మహారాష్ట్ర ఓటర్ల జాబితాలను తమకు అందించాలని కోరారు. Our questions to the Election Commission on the Maharashtra elections: – Why did EC add more voters in Maharashtra…

Read More

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు థమన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. వీరితో పాటు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా థమన్ ను చంద్రబాబు సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో థమన్ పంచుకున్నారు. విజనరీ లీడర్, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసిన ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. తలసేమియా బాధితులకు సాయం అందించేందుకు ఫండ్ రైజింగ్ కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో థమన్ ఆధ్వర్యంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ జరగనుంది. ఈ మ్యూజికల్ నైట్ కోసం పూర్తి సేవా థృక్పథంతో తమన్ తన వంతు సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును థమన్ కలిశారు. థమన్ చేస్తున్న మంచి పనిని సీఎం చంద్రబాబు అభినందించారు.

Read More

టాటా సంస్థల అధినేత రతన్ టాటా గత ఏడాది అక్టోబర్ లో మరణించిన విషయం తెలిసిందే.అయితే రతన్ టాటా కేవలం లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా మాత్రమే కాకుండా, గొప్ప మానవతావాదిగా, సమాజ సేవకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.రతన్ టాటా మరణానంతరం రూ.వేల కోట్ల ఆస్తిని తాను నెలకొల్పిన ఫౌండేషన్లకు,సోదరుడు జిమ్మీ టాటాతో పాటు తన సహాయకులు,పెంపుడు శునకానికి చెందేలా వీలునామా రాసి తన మంచి మనసు చుట్టుకున్నారు.అయితే వీలునామాలో ఓ రహస్య వ్యక్తికి రూ.వందల కోట్లు ఇవ్వాలంటూ…రతన్ టాటా పేర్కొన్నారని సమాచారం.తాజాగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కాగా ఆ వీలునామాలో ఉన్న రహస్య వ్యక్తి పేరు చూసి టాటా కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.ఆ రహస్య వ్యక్తి ఎవరో కాదు దాదాపు 6 దశాబ్దాలుగా రతన్ టాటాకు నమ్మకస్తుడిగా సేవలు అందించిన జంషెడ్పుర్ కు చెందిన ట్రావెల్స్ వ్యాపారవేత్త…

Read More

అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం కొమిటోని చెరువు వద్ద చేపట్టిన ఆకస్మిక తనిఖీలో భారీ మొత్తంలో ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్‌ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు , సిబ్బందిని డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అభినందిస్తూ ట్వీట్ చేశారు. 195 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో మరియు అక్రమ స్మగ్లింగ్‌ చేస్తున్న 8 మంది నేరస్థులను పట్టుకోవడంలో కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మరియు రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ ఆపరేషన్ మన విలువైన సహజ సంపదను రక్షించడంలో మన బృందాల యొక్క తిరుగులేని నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంలో మీ అంకితభావం, అప్రమత్తత మరియు సత్వరం స్పందించడం అభినందనీయమన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వన్యప్రాణులు మరియు అటవీ…

Read More

ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను కొత్త ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈరోజు వివరించారు. ఇది ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా తొలి సమీక్ష. కాగా, రెపోరేటు 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. 6.25 శాతంగా ఆర్బీఐ రెపోరేటు ప్రకటించింది. గత ఐదేళ్లలో తొలిసారి రెపోరేటు తగ్గింపు జరిగింది. జీడీపీని 6.7 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది. ఇక గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది. మరికొన్ని కీలక అంశాలు: ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణం తగ్గొచ్చు. 2025-26లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.2 శాతంగా నమోదయ్యే అవకాశం. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్స్ లో 6.7 శాతం వృద్ధి రేటు. సెకండ్ క్వార్టర్స్ లో 7 శాతం. మూడో, నాలుగో క్వార్టర్స్ లో 6.5 శాతంగా ఉండొచ్చని అంచనా. ఈ సంవత్సరం మార్చి తో…

Read More

బలగం చిత్రంతో అందరినీ ఆకట్టుకున్నాడు కామెడియన్ & దర్శకుడు వేణు.గ్రామీణ నేపథ్యంతో వచ్చిన “బలగం” చిత్రం మంచి విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.ఈ ప్రాజెక్ట్ అనంతరం, వేణు కొత్తగా “ఎల్ల‌మ్మ” అనే సినిమాను చేయ‌బోతున్నాడని ప్రకటించాడు.కాగా “ఎల్ల‌మ్మ” చిత్రంలో నాని లేదా నితిన్ హీరోగా నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసినప్పటికీ ఇప్ప‌టి వరకు ఎటువంటి అప్‌డేట్ లేదు.అయితే చాలా రోజుల తర్వాత ఈ సినిమా దర్శకుడు వేణు గురించి ఒక అప్‌డేట్ ఇచ్చాడు.”ఎల్ల‌మ్మ” సినిమా కోసం మేము సిద్ధమవుతున్నాము,త్వ‌ర‌లోనే మ‌రిన్ని అప్‌డేట్స్‌ ఇవ్వ‌డం జరుగుతుందని పేర్కొన్నాడు.ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.దీనితో ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రిలో ప‌ట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది.

Read More

వైయస్‌ఆర్‌సీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షులు సాకే శైలజానాథ్‌ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆపార్టీలో చేరారు. శైలజానాథ్‌ తో పాటు వైఎస్సార్‌సీపీలో చేరిన ఏఐసీసీ మెంబర్‌, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడులు ప్రతాప్‌ రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, వేంపల్లి సతీష్‌ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.విశ్వేశ్వర రెడ్డి, తలారి రంగయ్య, మేరుగ నాగార్జున, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక శైలజా నాథ్ అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుండి 2004, 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేశారు. 2022లో ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన జనసేన పార్టీ తెలంగాణ లో కూడా గుర్తింపు పొందింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేనను ప్రాంతీయ పార్టీగా గుర్తించిందని అలాగే తెలంగాణ లో కూడా గుర్తించి గాజు గ్లాసు గుర్తును ఇవ్వాలని ఆ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాశారు. ఈమేరకు అనుమతిస్తూ ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Read More