రాష్ట్రపతి ద్రౌపది ముర్మూపై కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై మీడియాతో స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ప్రముఖ నేతలు అత్యున్నత పదవి గౌరవాన్ని స్పష్టంగా దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు, అవి ఆమోదయోగ్యం కాదు. ప్రెసిడెంట్ చివరికి చాలా అలసిపోయారని, ఆమె మాట్లాడటం చాలా కష్టంగా ఉందని ఈ నాయకులు చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంపై వ్యాఖ్యలు చేసిన నాయకులకు భారతీయ భాష, యాసలతో పరిచయం లేకపోయి ఉండొచ్చు. అందుకే రాష్ట్రపతి అలసిపోయినట్లు వాళ్లకు అనిపించొచ్చు. ఏ సందర్భంలోనైనా, అటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం మరియు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. సత్యానికి దూరంగా ఏమీ ఉండదని రాష్ట్రపతి భవన్ స్పష్టం చేయాలనుకుంటోంది. రాష్ట్రపతి ఏ సమయంలోనూ అలసిపోలేదు. నిజానికి, అట్టడుగు వర్గాల కోసం, మహిళలు మరియు రైతుల కోసం, ఆమె ప్రసంగిస్తున్నప్పుడు ఆమె అలసిపోరని రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Author: admin
నేడు పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రసంగించారు. ఆమె ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగం ముగిసే సమయానికి ఆవిడ బాగా ఆలసిపోయారని మాట్లాడలేకపోయారని అన్నారు. అయితే సోనియా గాంధీ వ్యాఖ్యలను బీజేపీ తప్పు పట్టింది. అవి అభ్యంతరకరమని సోనియా గాంధీ వంటి నేతలు ఇలా మాట్లాడకూడదని ముఖ్యంగా రాష్ట్రపతిని ఉద్దేశించి ఇలా చేయడం పట్ల అభ్యంతరం తెలిపింది. మరోవైపు రాష్ట్రపతిని సోనియా అవమానించేలా మాట్లాడలేదని బీజేపీ అనవసర ఆరోపణలు చేస్తుందని కాంగ్రెస్ పేర్కొంది.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజు సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు. కూటమి ప్రభుత్వం మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగానే, కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజుని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించింది. పెనుగొండలో ఆర్యవైశ్యుల ఇలవేలుపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఈరోజు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నాను. ఇచ్చిన మాట ప్రకారం కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాం. రాష్ట్రాన్ని, తెలుగుజాతిని చల్లగా చూడమని ఆ అమ్మవారిని కోరుకున్నానని ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
భారత క్రికెట్ కు ఎనలేని సేవలందించిన దిగ్గజం క్రికెట్ ప్రపంచానికి పరిచయం అవసరంలేని పేరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్. తన కెరీర్ లో ఎన్నో రికార్డులు, అవార్డులు, మైలు రాళ్లు ఎవరూ అందుకోలేనన్ని పరుగులు, ప్రశంసలు ఉన్నాయి. తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డును సచిన్ అందుకోనున్నారు. ఈమేరకు రేపు బీసీసీఐ సత్కరించనుంది. రేపు జరగనున్న వార్షికోత్సవంలో ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం’ అందజేయనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ ఆఫ్ ది ఇయర్-2024’ అవార్డును సచిన్‌కు ప్రదానం చేయనున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. భారత క్రికెట్‌కు సచిన్ ఎన్నో సేవలు అందించారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్వీకరించబోయే 30వ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్. గత ఏడాది మాజీ కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు.
రేపు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వరుసగా నాలుగో రోజు సూచీలు జోరు కనబరిచాయి. ఐటీ, ఆటో వంటి కీలక రంగాల్లో షేర్ల మద్దతుతో దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 740 పాయింట్లు లాభపడి 77,500 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 258 పాయింట్ల లాభంతో 23,508 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.63గా కొనసాగుతోంది. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, నెస్లే ఇండియా, టాటా స్టీల్, టాటా మోటార్స్, టైటాన్, హెచ్.యూ.ఎల్, మారుతీ సుజుకి, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి.
భారత అండర్ 19 మహిళల జట్టు టీ20 ప్రపంచ కప్ లో ఫైనల్ చేరింది. తాజాగా నేడు జరిగిన సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 113 పరుగులు మాత్రమే చేయగలిగింది.డేవినా పెరిన్(45), అబి నోర్ గ్రోవ్ (30), అమలు సురేన్ (14) పరుగులు చేశారు. భారత బౌలర్లలో పరునిక సిసోడియా 3 వికెట్లు, వైష్ణవి శర్మ 3 వికెట్లు, ఆయుషీ శుక్లా 2 వికెట్లు పడగొట్టి స్వల్ప పరుగులకే కట్టడి చేశారు. లక్ష్యచేధనలో భారత్ 15 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 117 పరుగులు చేసింది. గొంగడి త్రిష (35), కమిలిని (56 నాటౌట్) పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 2న జరుగనున్న ఫైనల్ లో సౌతాఫ్రికాతో తలపడనుంది. Pic source:BCCI
ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా భారత్ స్వయం సమృద్ధి వైపు దూసుకు పోతున్న సమయంలో సరికొత్త ఏఐ సాంకేతిక పరిజ్ఞానం కూడా రూపొందించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాట్ జీపీటీ, డీప్ సీక్ లకు దీటుగా ఇండియా ఏఐ మిషన్ లో భాగంగా త్వరలోనే భారత్ కూడా సొంత జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ను అభివృద్ధి చేయనుందని భువనేశ్వర్ లో ‘ఉత్కర్ష్ ఒడిశా’ సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ ఏఐ మోడల్ పూర్తిగా ఇండియా ఏఐ కంప్యూటర్ సామర్థ్యంతో మన దేశంలోని లాంగ్వేజ్, కల్చరల్ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అతితక్కువ ఖర్చుతో రూపొందించనున్నారు. ఈ ఏఐ మోడల్ డెవలప్మెంట్ కోసం గత నెలలుగా స్టార్టప్ లు, పరిశోధకులు, ఏఐ నిపుణుల బృందాలు పని చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఏఐ లో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్…
తమిళనాడు వెల్లూరులో మహిళా వైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో తమిళనాడు మహిళా కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.అయితే 2022లో మహిళా వైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఈ ఘటనను పలువురు సభ్యులు శాసనసభలో లేవనెత్తారు.దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేసాయి.ఈ కేసులో ఐదో నిందితుడు మైనర్ కావడంతో జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు.తాజాగా ఈ కేసును విచారించిన వెల్లూరు సెషన్స్ జడ్జి ఎస్ మాగేశ్వరి భాను ముందు నిందితులను హాజరుపరచగా…నలుగురు నిందితులను దోషులుగా తేలుస్తూ.. 20 ఏళ్ళ పాటు కఠిన కారాగారా శిక్ష విధించారు.నిందితులు ఒక్కరో రూ.25వేల జరిమానా చెల్లించాలని ఆదేశించారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురుచ్చిత్తలైవిగా అభిమానులు పిలుచుకునే దిగ్గజ నేత జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే విధంగా బెంగళూరు కోర్టు చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 14, 15 తేదీలలో వాటిని అప్పగించాలని స్పెషల్ కోర్టు లో జడ్జి హెచ్.ఏ మోహన్ అధికారులను ఆదేశించారు. 1,562 ఎకరాల ల్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంట్లు, 27 కిలోల బంగారు, వజ్రాభరణాలు, పది వేలకు పైగా చీరలు, 750కి పైగా జతల చెప్పులు, వాచ్ లు, ఇతర వస్తువులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. ఈ ఆస్తులు, వస్తువులు తమకు చెందాలంటూ జయలలిత వారసులుగా చెబుతున్న జె. దీపక్, జె దీప వేసుకున్న అర్జీని ఇటీవలే కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. దాదాపుగా దశాబ్దం క్రితం తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ రూ. 913 కోట్లు అని పేర్కొంది. ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ బాగా పెరిగింది.
జమ్ముకశ్మీర్‌లో అక్రమమగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చి చంపాయి.నిన్న రాత్రి పూంచ్ సెక్టార్‌లోని ఎల్ఓసి వద్ద ఇద్దరు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు.అయితే భద్రతా బలగాలు వారిని అడ్డుకునేందుకు యత్నించగా, ఇరుపక్షాల మధ్య భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ మేరకు భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.అయితే నియంత్రణ రేఖ వద్ద రాత్రంతా కాల్పులు జరిగాయని, ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్ వేదికగా పేర్కొంది.అయితే ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టామని తెలియజేసింది. Terrorist movement detected in #Poonch sector along the #LineofControl.Alert troops opened fire leading to a heavy exchange of fire. Operations are underway. #IndianArmy@adgpi@NorthernComd_IA— White Knight Corps (@Whiteknight_IA) January 30, 2025
