దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఆద్యంతం ఒడిదుడుకుల్లో పయనించిన సూచీలు చివరికి నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. ఐటీ షేర్లు లాభపడ్డాయి. ఫైనాన్షియల్, హెల్త్, ఆటోమొబైల్ షేర్లు నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 242 పాయింట్లు నష్టపోయి 77, 378 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 86 పాయింట్ల నష్టంతో 23,440 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.03గా కొనసాగుతోంది. టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్.సీ.ఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Author: admin
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీకి 25 సంవత్సరాలుగా అధికారం ఇవ్వలేదని ఢిల్లీని దేశ నేర రాజధానిగా మారుస్తుందంటూ ఇక్కడి ప్రజలపై ద్వేషం పెంచుకుందని తీవ్ర విమర్శలు చేశారు. ఇక రోహింగ్యా చొరబాటు దారుల పేరుతో పూర్వాంచల్, దళితుల ఓట్లను భారీగా తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే అపార్ట్మెంట్లకు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకునేందుకు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నిధులు మంజూరు చేస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరోవైపు పూర్వాంచల్ ఓటర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పూర్వాంచల్ సమ్మాన్ మార్చ్ పేరుతో కేజ్రీవాల్ నివాసం బయట బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్స్ ప్రయోగించారు దీంతో ఉద్రిక్తత నెలకొంది. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక…
పుష్ప ది రూల్‌తో విజయాన్ని అందుకున్నారు రష్మిక.తాజాగా ఆమె గాయపడినట్లు తెలుస్తోంది. జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న సమయంలో ఆమె గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.దీంతో ఆమె బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో నటిస్తున్న సికందర్ మూవీ షూటింగ్ ఆగిపోయింది.ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని రష్మిక సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి.త్వరలోనే ఆమె తదుపరి షూటింగ్స్‌లో పాల్గొననున్నారని తెలుస్తోంది.
పిఠాపురం నియోజకవర్గంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,500 గోకులాల ప్రారంభోత్సవం జరగనుంది. ఇక ఈ గోకులాల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేవారు చిన్న రైతులు, కౌలు రైతులు, బడుగు బలహీన, దళిత, గిరిజన వర్గాల వారని అన్నారు.ఈ స్థాయిలో ఇంత తక్కువ సమయంలో నిర్మించడం ఒక గణమైన విజయమని పేర్కొన్నారు. ఆవు బావుంటే రైతు బావుంటాడు.రైతు బావుంటే దేశం బావుంటుందని అన్నారు.మిల్క్ రెవల్యూషన్ అని గుజరాత్లో 60,000 కోట్ల రూపాయలు అక్కడ ఉన్న మహిళలు పాడి ద్వారా రాబడి ఉందన్నారు. గత వైసీపీ పాడి పరిశ్రమ, ముఖ్యంగా ప్రభుత్వ పాల డైరీలను చంపేశారని వాళ్ళ సొంత డైరీలని పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఈ రోజు మనం నిర్మించిన 12,500 గోకులాలు కానీ, భవిష్యత్తులో నిర్మించబోయే మరో 20,000 గోకూలాలు, వీటి వల్ల రక్షణ ఉంటుంది, ఎండపట్టున ఉండవు, శుభ్రత ఉంటుందని స్పష్టం చేశారు.…
భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు.తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హిందీ జాతీయ భాష కాదని వ్యాఖ్యానించారు.తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాల స్నాతకోత్సవం గురువారం జరిగింది.దీనికి అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు.ఇంగ్లీష్,తమిళం,హిందీ భాషల గురించి విద్యార్థులతో ముచ్చటించారు.‘హిందీ అధికారిక భాష మాత్రమే.జాతీయ భాష కాదు’ అంటూ వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.అశ్విన్ తీరును కొంతమంది తప్పుపడుతున్నారు.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ వైరస్ కొత్త వేరియంట్ ఎంపాక్స్ క్లాడ్ ఐబి వ్యాప్తిని తాజాగా కాంగో నుండి చైనాకు వచ్చిన ఓ ప్రయాణికుడిలో కనుగొన్నట్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. అతనితో సన్నిహితంగా ఉండడం వల్ల నలుగురికి ఎంపాక్స్ కొత్త వేరియంట్ సోకినట్లు వెల్లడించింది. దీంతో డబ్ల్యూహెచ్ఐ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ కొత్త వేరియంట్ కాంగో నుండి బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాతో సహా పొరుగు దేశాలకు వ్యాపించింది.చర్మంపై దద్దుర్లు, బొబ్బలు రావడం దీని లక్షణాలు. చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి కూడా ఉంటాయి. ఈ వైరస్ ను 1958లో తొలిసారిగా పరిశోధన కోసం డెన్మార్కు పంపించిన కోతుల్లో కనుగొనడంతో దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు.1970లో దీన్ని మనుషుల్లో మొదటి సారిగా గుర్తించారు.
సిద్ధార్థ్,ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘మిస్ యు’.ఈ సినిమాకి ఎన్.రాజశేఖర్ దర్శకత్వం వహించాడు.గత నెలలో విడుదలైన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది.ఇప్పుడీ చిత్రం ఓటీటీ వేదికగా విడుదలైంది.అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ ప్రకటించింది. సినిమా డైరెక్టర్ అవ్వాలంటూ కలలు కనే యువకుడు వాసు (సిద్ధార్థ్). ప్రొడ్యూసర్లను కలిసి కథలు చెప్పే ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే అంతలోనే ఓ ప్రమాదానికి గురై తన జీవితంలో చివరిగా గడిచిన రెండేళ్ల జ్ఞాపకాలను మర్చిపోతాడు. దీంతో కోలుకున్న వాసు అనుకోకుండా కలిసిన బాబీ (కరుణాకరన్)తో కలిసి బెంగళూరు వెళతాడు. అక్కడ కేఫ్‌లో పనిచేస్తున్న సమయంలో సుబ్బలక్ష్మి (ఆషికా రంగనాథ్)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు.అయితే ఆమె మాత్రం తన లవ్‌ను రిజెక్ట్ చేస్తుంది.తన తల్లిదండ్రులకి ఈ విషయాన్ని చెప్పి ఎలాగైనా సరే సుబ్బలక్ష్మిని ఒప్పించాలని తిరిగి ఇంటికి…
ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని అన్నారు ఎల్‌అండ్‌టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్.ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.ఎల్‌అండ్‌టీ ఉద్యోగులతో ఇటీవల ఆన్‌లైన్‌లో సుబ్రహ్మణ్యన్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సంస్థలో వారానికి ఆరు రోజుల పని విధానాన్ని అమలు చేయడాన్ని ఓ ఉద్యోగి ప్రశ్నించారు.దీనికి సమాధానంగా…ఆదివారాలు కూడా మీతో పని చేయించలేకపోతున్నందుకు నేను బాధపడుతున్నాను.మీతో ఆదివారాలు సైతం పని చేయిస్తే చాలా సంతోషపడతాను.ఎందుకంటే, నేను ఆదివారాలు కూడా పని చేస్తున్నాను.ఎంత సేపు ఇంట్లో కూర్చుంటావు? ఎంతసేపు నీ భార్యను అలా తదేకంగా చూస్తూ ఉండగలవు? ఆఫీసుకు వెళ్లి పని చేయడం ప్రారంభించు’ అని ఆయన వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.ఆయన తీరును వారు తప్పు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కిల్ సెన్సస్ కార్యక్రమాన్ని మరింత ప్రయోజనకరంగా చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించడానికి ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఎటువంటి ఆర్థికవనరులతో సంబంధం లేకుండానే స్కిల్ సెన్సస్ లో భాగంగా జనరేటివ్ ఎఐని ఉపయోగించి అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధృవీకరణ కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందించేందుకు ఇన్ఫోసిస్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్ఎస్డిసి) మధ్య మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం జరిగింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కిల్ సెన్సస్ డాటా ప్రివాలిడేషన్ కు ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమని లోకేష్ ఈసందర్భంగా పేర్కొన్నారు. దీనిద్వారా రాష్ట్రంలో యువత ప్రస్తుత నైపుణ్యాలను అంచనా వేసి, మార్కెట్ డిమాండ్ కు తగ్గట్టుగా వారికి స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇవ్వడానికి మార్గం…
ఒక ఆడపిల్ల చదువుకోవడానికి అయ్యే ఖర్చులను తల్లిదండ్రుల నుండి పొందే హక్కు వారికి ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది.చట్టబద్ధంగా అమలు చేయదగిన ప్రామాణిక హక్కు ఇదని వివరించింది.దీనిని తోసిపుచ్చలేమని తేల్చి చెప్పింది.భార్యాభర్తలు విడిపోయిన కేసులో వారి కుమార్తె ఐర్లాండ్‌లో చదువుకుంటుంది.భర్త తన భార్య,కుమార్తెకు కలిపి రూ.73 లక్షలు చెల్లించేందుకు అంగీకరించారు.ఈ సొమ్ములో రూ.43 లక్షలు తన కుమార్తె చదువు ఖర్చుల కోసం ఇస్తున్నట్లు తెలిపారు.భార్య రూ.30 లక్షలు స్వీకరించారు.భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు.కుమార్తె కోసం తండ్రి రూ.43 లక్షలు పంపించగా ఆ కుమార్తె దానిని తిరస్కరించింది.ఈ సొమ్మును తీసుకునేందుకు చట్టబద్ధ హక్కు కుమార్తెకు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
