Author: admin

చైనాలో విజృంభిస్తో్న్న హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు భారత్‌లో వెలుగు చూశాయి.కర్ణాటకలో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.బెంగళూరులో 3,8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్‌ సోకినట్లు తెలిపింది. వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్‌ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలతో భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది.ఇటీవలే డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ అధ్యక్షతన జాయింట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ సమావేశం నిర్వహించింది.

Read More

సోషల్‌మీడియా వేదికగా తాను వేధింపులు ఎదుర్కొంటున్నానని నటి హనీరోజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.దీంతో సోమవారం ఉదయం ఎర్నాకులం పోలీసులు దాదాపు 27 మందిపై కేసు నమోదు చేశారు.అందులో కుంబళంకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేశారని స్థానిక పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.‘‘వివరణాత్మక విమర్శలు, నా లుక్స్‌పై వేసే సరదా జోక్స్‌, మీమ్స్‌ను నేనూ స్వాగతిస్తా.వాటిని పెద్దగా పట్టించుకోను.కానీ దానికంటూ ఒక హద్దు ఉంటుందని నేను నమ్ముతున్నా.అసభ్యకరంగా చేసే కామెంట్స్‌ను ఏమాత్రం సహించను.అలాంటి కామెంట్స్‌ చేసే వారిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా’’ అని తాజాగా ఆమె పోస్ట్‌ పెట్టారు.

Read More

ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించారు. ఉండి హైస్కూలులో ఆధునికీకరించిన భవనాలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో సంభాషించారు. చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ వద్దు బ్రో.. డ్రగ్స్ వైపు అసలు వెళ్ళకండి. మీరు ఇప్పుడు టెన్త్ క్లాస్. బాగా చదువుకోండి. మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. మీరు బాగా చదివితే, మీ కుటుంబం కూడా బాగుపడుతుందని పేర్కొన్నారు. నా అజెండా ఒక్కటే, వచ్చే 5 ఏళ్ళలో ప్రైవేటు స్కూల్స్, కాలేజెస్ కి ధీటుగా ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలు మార్చేయాలని… మీరు బాగా చదువుకోవాలి అనేదే నా కోరికని లోకేష్ స్పష్టం చేశారు. అంతకుముందు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీఐఐసీ చైర్మన్ శివరామరాజు, టీడీపీ స్థానిక…

Read More

కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయిందని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరమని అన్నారు. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ ఈనెల 4న రాత్రి ద్విచక్రవాహనంపై ఇళ్లకు వెళ్తున్నారు.ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి అని ఆ వేడుకలో ఒకటికి రెండుసార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు. గత ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు. కనీస నిర్వహణ…

Read More

ధాన్యం సేకరణకు సంబంధించి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. జనవరి 5వ తేదీ నాటికి ఖరీఫ్ సీజన్లో 4,15,066 మంది రైతుల నుంచి 27,00,00 MT ధాన్యం సేకరణ చేసినట్లు వివరించారు. బాధ్యతలు విస్మరించిన గత పాలకులు నాటి ఖరీఫ్ లో 2,12,431 మంది నుంచే ధాన్యం తీసుకొందని అయితే కూటమి ప్రభుత్వం ధాన్యం సేకరణ చేయడమే కాకుండా 24 గం.లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేస్తున్నట్లు తెలిపారు. రూ.6,083.69 కోట్లు చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. వైసీపీ వాళ్లు రైతులకి ధాన్యం డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వలేదనే వాస్తవాన్ని గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతాంగం మేలు కోసం ఎప్పుడూ ఆలోచనలు చేస్తారని అన్నారు. రైతుల కుటుంబాల్లో సంక్రాంతి సందడి తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం అంటూ మనోహర్ పేర్కొన్నారు.

Read More

ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకుని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఆయనను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో అవకతవకలు జరగాయనే ఆరోపణల నేపథ్యంలో వాటిని రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలంటూ బీపీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతుగా పాట్నాలోని గాంధీ మైదాన్ లో గత నాలుగు రోజులుగా ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహారదీక్షను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

Read More

పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏడు సంవత్సరాల తరువాత వివిధ కేటగిరీల కింద రూ.996.47 కోట్లను పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అందజేసింది. పునరావాసం నిమిత్తం రూ.586.71 కోట్లు, భూ సేకరణకు రూ.235.23 కోట్లు, నిర్మాణ పనులకు రూ.174.53 కోట్లు సంబంధిత వ్యక్తుల ఖాతాల్లో ఈ రెండు రోజుల్లోనే జమచేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. 17 మంది ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా వీరి పిటీషన్లను కొట్టివేసింది. ఇప్పటి వరకు ఈకేసులో 89 మందిని నిందితులుగా చేర్చారు. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏ71గా ఉన్నారు. ఈడీ విచారణకు హాజరైన వైసీపీ నేత విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టు సెజ్ కు సంబంధించిన కేసులో…

Read More

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. భారీ బడ్జెట్ తో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితర భారీ తారాగణంతో రూపొందుతున్న ఈచిత్రం నుండి తాజాగా కాజల్ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆమె ఈచిత్రంలో జగన్మాత పార్వతీ దేవి పాత్రలో కనిపించనున్నారు. ముల్లోకాలు ఏలే తల్లి ! భక్తుల్ని ఆదుకునే త్రిశక్తి !శ్రీ కాళ హస్తి లో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక ! అని ఉన్న పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. పలు భాషల్లో రూపొందుతున్న ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ❤️ https://t.co/yKClQK6IgB— Kajal Aggarwal (@MsKajalAggarwal) January 6, 2025

Read More

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘సీజ్ ద షిప్’ అంటూ ఆదేశించడం జాతీయ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాకినాడ సముద్రతీరంలో గత 55 రోజులుగా నిలిచిపోయిన ఆ స్టెల్లా షిప్ కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. ఆ నౌకలో అధికారులు గుర్తించిన రేషన్ బియ్యం అన్ లోడ్ చేసే ప్రక్రియ పూర్తి కావడంతో పాటు షిప్ నిలిపినందుకు చెల్లించాల్సిన యాంకరేజ్ చార్జి, కార్గో షిప్ లోకి ఎక్కించినందుకు కట్టాల్సిన ఎక్స్ పోర్టు రుసుము పోర్టు అథారిటీకి స్టెల్లా నౌక స్టీమర్ ఏజెంట్ చెల్లించి నోడ్యూస్ ధ్రువీకరణ పొందడంతో కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో స్టెల్లా షిప్ పశ్చిమ ఆఫ్రికా తీరం వెళ్లడానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ విషయాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తాజాగా ధ్రువీకరించారు.

Read More

దేశ జాతీయతే మన ఏకైక విధానంగా ఉండాలని మన మాతృభూమికి నివాళిగా ఈ విలువలను పరిరక్షించుకోవాలని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ అన్నారు.మన జాతీయ పరివర్తనకు పునాది సామాజిక సామరస్యం, కుటుంబ జ్ఞానోదయం, పర్యావరణ స్పృహ, స్వావలంబన మరియు పౌర విధులు అనే ఐదు కీలక స్తంభాలపై ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రారంభమయిన నేషనల్ క్యాడెట్ కాప్ రిపబ్లిక్ డే క్యాంప్-2025 లో ఆయన పాల్గొన్నారు. అద్భుతమైన బ్యాండ్ ప్రదర్శనతో ఎన్.సిసి క్యాడెట్‌లు ఆకట్టుకున్నారు. వారి ప్రదర్శనను ఉపరాష్ట్రపతి ఆసాంతం ఆసక్తిగా వీక్షించారు.

Read More