Author: admin

నూతన సంవత్సర వేడుకలకు అయోధ్య రామ మందిరం అంగరంగ వైభవంగా సిద్ధం అవుతోంది.బాల రాముడిని ప్రతిష్టించి సంవత్సరం కావొస్తుండటంతో భారీగా భక్తులు తరలి రానున్నారని అధికారులు తెలిపారు.ఎటువంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. “భక్తులకు స్వాగతం పలికేందుకు అంతా సిద్ధంగా ఉంది. జనవరి 15 వరకు హోటల్ గదులన్నీ ముందుగానే బుక్ అయ్యాయి” అని స్థానిక హోటల్ యజమాని అంకిత్ మిశ్రా తెలిపారు.చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే గదుల లభ్యత ఉన్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.ఇదే అదనుగా కొందరు హోటళ్ల యజమానులు ఒక్కరోజుకు రూ.10వేల వరకు వసూలు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రఖ్యాత స్థలాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాలు కూడా పెంచుతున్నట్లు చెప్పారు.

Read More

అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పుష్ప2: ది రూల్.ఇందులో రష్మిక కథానాయికగా నటించింది.బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలను చిత్ర బృందం ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది.తాజాగా‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది.దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా శ్రేయా ఘోషల్ ఆలపించారు.జాతర సన్నివేశం తర్వాత వచ్చిన ఈ పాట సినీ ప్రియులను ఎంతగానో అలరించింది. https://youtu.be/LH6c2bTM8p0?si=aO22i4e-Z6NuMI5t

Read More

అభిమానుల తీరుపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును ఈరోజు మధ్యాహ్నం ఆయన పరామర్శించారు. అనంతరం ఈఘటనను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పలువురు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘ఓజీ ఓజీ’ అని స్లోగన్లు చేశారు. దీనిపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ…ఎప్పుడు ఏం స్లోగన్లు ఇవ్వాలో మీకు తెలియదు..పక్కకు రండి అన్నారు.

Read More

ఏపీ సీఎం చంద్రబాబును ఇమిటేట్ చేసిన ఒక వ్యక్తి వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఒక వేడుకకు ఒక మిమిక్రీ ఆర్టిస్టు అచ్చం చంద్రబాబు వేషధారణలో వచ్చారు. వేదికపైకి వచ్చి అందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబులా మాట్లాడుతూ అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ఒక అభిమాని ఈ వీడియో షేర్ చేయగా దానికి లోకేష్ బదులిచ్చారు. సీఎం చంద్రబాబు లా ఆకట్టుకున్న ఆ వ్యక్తిని లోకేష్ మెచ్చుకున్నారు. తాను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యానని పేర్కొన్నారు. చంద్రబాబు మాదిరి కనిపించడానికి, మాట్లాడేందుకు ఎంత కష్టపడ్డాడో చూడండని అన్నారు. 😂😍 I've become a fan of this man. Can see how hard he has worked to look and talk like @ncbn Garu.…

Read More

విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న ఈ మహాసభలు జరిగే ప్రాంగణానికి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టడం ఆ మహానుభావుడు తెలుగు జాతి కోసం చేసిన అద్వితీయ త్యాగాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తోందని పేర్కొన్నారు. అలాగే ప్రధాన వేదికకు తెలుగు భాషాభివృద్ధి కోసం గణనీయ కృషి చేసిన రామోజీరావు గారి పేరు పెట్టడం కూడా అభినందనీయమని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ మహాసభలకు విచ్చేసిన అతిథులకు, పాల్గొంటున్న తెలుగుభాషాభిమానులకు అందరికీ ధన్యవాదాలు. ఈ మహా సభలు విజయవంతం అవ్వాలని కోరుకుంటూ…. నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Read More

వర్షపాతం పరంగా తిరుపతి మరో రికార్డును బద్దలు కొట్టింది. తాజాగా కురిసిన వర్షాలతో ఈశాన్య రుతుపవనాల సీజన్ (అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు)లో తిరుపతి1000 మి.మీ మార్కును దాటింది. అలాగే తిరుపతి జనవరి 1, 2024 నుండి 162 సెం.మీలతో వరుసగా రెండవ సంవత్సరం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వర్షపాతం నమోదైన నగరంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలలో టాప్ 5 లో ఉన్న ప్రాంతాలు: 1.తిరుపతి (162 సెం.మీలు) 2.భద్రాచలం (153సెం.మీలు) 3. నర్సాపురం (145 సెం.మీలు), 4. నందిగామ (137 సెం.మీలు) 5.మెదక్ (134 సెం.మీలు).

Read More

అనారోగ్యంతో ఈనెల 26న తుదిశ్వాస విడిచిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో‌ఢిల్లీలోని నిగమ్ భోధ్ ఘాట్లో ఆయన భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్జీప్ ధనఖడ్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రక్షణా శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తదితరులు హాజరై మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాడె మోశారు. త్రివిధ దళాల అధిపతులు మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు. అంత్యక్రియలకు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి,…

Read More

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు (నాలుగో టెస్టు) లో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 164-5తో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ రిషబ్ పంత్ (28),రవీంద్ర జడేజా (17) వికెట్లను కోల్పోయినా నితీష్ కుమార్ రెడ్డి 105 నాటౌట్ (176; 10×4, 1×6) కెరీర్ లో మొదట సెంచరీతో, వాషింగ్టన్ సుందర్ 50 (162; 1×4) హాఫ్ సెంచరీలతో బ్యాటింగ్ భారాన్ని తమ భుజస్కంధాలపై మోశారు. కీలకమైన భాగస్వామ్యంతో భారత్ ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. పరిణితితో కూడిన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమ్మిన్స్ 3 వికెట్లు, బోలాండ్ 3 వికెట్లు, లైయన్ 2 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 474 పరుగులకు ఆలౌటయింది. ప్రస్తుతం…

Read More

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ తీవ్రంగా ఖండించారు.ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు.మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.ఈ మేరకు విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అన్నారు.ఇలాంటి దౌర్జన్యాలకు,రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని అన్నారు. ఈ దాడి ఘటన గురించి అధికారులతో పవన్ చర్చించారు.కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని,బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.ఎంపీడీఓకు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని అధికారులకు సూచించారు.జవహర్ బాబుపై దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల,ప్రజాస్వామ్యం పట్లా ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని పవన్ అన్నారు.మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న అప్రజాస్వామిక దాడిపై విచారణ చేయడంతోపాటు…

Read More

ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో ఐఏఎస్‌గా స్వచ్ఛంద విరమణ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని ఇంతియాజ్‌ తెలిపారు.కాగా కర్నూలు నియోజకవర్గం నుండి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయానని చెప్పారు.దీనితో తన బంధువులు, శ్రేయోభిలాషులతో చర్చించి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.అయితే రాజకీయాలకు మాత్రమే దూరంగా ఉంటానని…ప్రజా సేవకు కాదని స్పష్టం చేశారు.ఒక రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిగా, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా మెరుగైన సమాజం కోసం తన వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఇంతియాజ్‌ తెలిపారు.

Read More