ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) 2025ను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంవత్సరంగా ప్రకటించింది. ప్రతి రంగంలోనూ ఏఐ కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో భవిష్యత్తు అంతా ఏఐ మీదనే ఆధారపడి నడుస్తుందనే సాంకేతిక నిపుణుల అంచనాల నేపథ్యంలో భారత్ ను కృత్రిమ మేధలో విశ్వగురువుగా మార్చాలన్న లక్ష్యంతో ఏఐసీటీఈ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, పాలిటెక్నిక్ తదితర కోర్సుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉంచి, విద్యార్థులను ఆ రంగంలో నిపుణులుగా మార్చాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా పలు చర్యలు తీసుకోవాలని ప్రణాళిక రూపొందించింది. ఈ నెలాఖరు నాటికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అమలు ప్రణాళికను సమర్పించాలని దేశవ్యాప్తంగా తన పరిధిలోని దాదాపు 14 వేల విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ కి, డైరెక్టర్లకు ఏఐసీటీఈ లేఖ రాసింది. వచ్చే విద్యా సంవత్సరానికి అనుమతులు ఇచ్చే సమయంలో ఆయా కళాశాలలు సమర్పించిన ప్రణాళికలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఏఐ లో ఉత్తమ పనితీరు…
Author: admin
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన విషయం విదితమే. కాగా, ఏపీ సీఎం చంద్రబాబు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని మన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అవిశ్రాంతంగా దేశానికి సేవలందించారని కొనియాడారు. అనేకపదవులు సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు. గొప్ప దార్శనికుడిని కోల్పోయామని అన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, ఎంపీలు బైరెడ్డి శబరి, కేశినేని శివనాధ్ తదితరులు ఉన్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం. గొప్ప దార్శనికుడిని కోల్పోయాం. #ChandrababuNaidu pic.twitter.com/ZxlVN615do— Telugu Desam Party (@JaiTDP) December 27, 2024
భారత రక్షణా రంగ పరిశోధనా సంస్థ (డీ.ఆర్.డీ.ఓ) గగనతల సాంకేతికతకు సంబంధించిన స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధిలో కీలక ముందడుగు వేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న కావేరీ ఇంజన్ ప్రాజెక్టుకు సంబంధించి పరీక్షలకు కావేరీ ఇంజన్ సిద్ధమైందని ప్రకటించింది. డీ.ఆర్.డీ.ఓ పరిధిలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిషమెంట్(జీ.టీ.ఆర్.ఈ) ఈ ఇంజన్ ను అభివృద్ధి చేసింది. ఇక ఈ ఇంజన్ ల నేపథ్యానికి వెళితే యుద్ధవిమానాలకు అవసరమైన ఇంజన్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకోవాలన్న లక్ష్యంతో కావేరీ ఇంజన్ ప్రాజెక్టు 1980లో ప్రారంభమైంది. ఆ తర్వాత నాలుగు దశాబ్దాల కాలంలో అనేక సవాళ్లను చూసింది వాటిని అధిగమించి చివరకు స్వదేశీ విమాన ఇంజన్ రానుంది. తదుపరి దశలో భాగంగా కావేరీ ఇంజన్ ను పలు విమానాల్లో, పలు రకాల వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించనున్నారు. వాటిలో సైతం విజయవంతమైతే విమాన ఇంజన్ల కోసం విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. భారత రక్షణ రంగ పరిశోధనల్లో ఇదొక మైలురాయిగా…
చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన దుమారం రేపుతోంది.ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై ఆరు కొరడా దెబ్బలు భరించి.. మురుగన్‌కు మొక్కు చెల్లించుకున్నారు.‘‘డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నేను పాదరక్షలు ధరించను. చెప్పులు లేకుండానే నడుస్తా. ఎన్నికల్లో విజయం సాధించడానికి డబ్బులు ఎరగా చూపం.రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళ్తాం.ఎన్నికల్లో విజయం సాధించేంతవరకు చెప్పులు ధరించను’’ అని నిన్న ప్రెస్ మీట్ లో అన్నామలై అన్నారు.
చరిత్ర సృష్టించే గొప్ప ఆలోచనలను ఏ శక్తీ అడ్డుకోలేదు అనే ఫ్రెంచ్ తత్వవేత్త విక్టర్ హ్యూగో మాటను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిరూపించారు.భారతదేశం ప్రపంచశక్తిగా,ఆర్థిక శక్తిగా మారే సమయం వచ్చిందని,దానిని ఎవరూ ఆపలేరు అంటూ…అప్పటి ఆర్ధిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణలు భారత ప్రగతిని పూర్తిగా మార్చేశాయని చెప్పాలి.దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మన దేశం అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది.అయితే సమస్యను ఎదుర్కోవడం కోసం ఆర్ధిక సంస్కరణలు చాలా అవరమని అందరికీ తెలుసు…కానీ రాజకీయ పార్టీల మధ్య సమన్వయం లేకపోవడంతో ఎవరూ ఆర్ధిక సంస్కరణలు చేయడానికి ముందుకు రాలేదు.అయితే 1980 సమయంలో దేశంలో ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి.1990 నాటికి ఈ సమస్యలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రూపాన్ని సంతరించుకున్నాయి. 1991 కంటే ముందు భారతదేశం భారీ రుణాలు తీసుకునే దేశం కాదు.కానీ అప్పటి పరిస్థితులను బట్టి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.అంతకు ముందు వరకు చిన్న చిన్న…
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు (నాలుగో టెస్టు) లో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 474 పరుగులకు ఆలౌటయింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. రెండో రోజు ఓవర్ నైట్ స్కోర్ 311-6తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ స్టీవ్ స్మిత్ 140(197;13×4, 3×6) సెంచరీతో జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు. పాట్ కమ్మిన్స్ 49 (63;7×4) పరుగులు చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు,జడేజా 3 వికెట్లు, ఆకాష్ దీప్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మొదట్లోనే రోహిత్ శర్మ (3) వికెట్ కోల్పోయింది. కే.ఎల్.రాహుల్ 24 (42;3×4), జైశ్వాల్ 82(118;11×4,1×6), విరాట్ కోహ్లీ 36(86; 4×4)…
మాజీ ప్రధాని,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం అత్యంత బాధాకరమని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు.ఆయన భారత దేశ ఆర్థికశిల్పి అని ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈమేరకు ఆమె ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో మన్మోహన్ సింగ్ ఉన్న ఫోటోను తన పోస్ట్ కు జత చేశారు. రెండు సార్లు దేశ ప్రధానిగా, అంతకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, మన దేశానికి సింగ్ జి అందించిన సేవలు అమూల్యమని కొనియాడారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో మన్మోహాన్ సింగ్ సంస్కరణలు కీలకం. ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్ధిక మాంద్యం ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడకుండా గాడిలో పెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ గారిదేనని పేర్కొన్నారు. సమాచార హక్కు…
2023-24లో అధికార భారతీయ జనతా పార్టీ అత్యధికంగా రూ.2,604 కోట్ల విరాళాలను సేకరించింది. దేశంలో రెండవ పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ రూ.281.38 కోట్లు విరాళాలు అందుకుంది. ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఈ వివరాలను ఉంచింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 31 నాటికి ఈ విరాళాలొచ్చాయని వెల్లడించింది. అయితే ఇవి ఎలక్టోరల్ బాండ్ల విరాళాలు కాకుండా వాటిని స్వయంగా పార్టీలు వెల్లడిస్తాయి. ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా బీజేపీ రూ.723 కోట్లు, కాంగ్రెస్ రూ.150 కోట్లు విరాళాలొచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి సోనియా, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్ తదితర సీనియర్ నేతలు రూ.138 లక్షల చొప్పున విరాళాలందించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.11.06 కోట్లు, సీపీఎంకు రూ.7.64 కోట్ల విరాళాలొచ్చాయి.
సీఎం చంద్రబాబు..! మాజీ ప్రధాన మంత్రి, ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ జీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. “మేధావి రాజనీతిజ్ఞుడు, వినయం, జ్ఞానం, కలగలిపిన వ్యక్తి. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల నుంచి ప్రధానమంత్రిగా ఆయన నాయకత్వం వరకు దేశానికి అవిశ్రాంతంగా సేవలందించి లక్షలాది మందిని ఉద్ధరించారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి, ఆత్మీయులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి అని పోస్టు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి..! మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, మానవతావాది. ఆయన తీసుకున్న అసామాన్య నిర్ణయాల్లో మానవతా దృక్పథం కూడా ఒకటి. మన్మోహన్‌సింగ్.. అసలైన నవభారత నిర్మాత. భరతమాత ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత: పవన్ కల్యాణ్ “భారత…
నా మార్గదర్శని కోల్పోయానని రాహుల్ గాంధీ అన్నారు.జ్ఞానం,సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని నడిపించారు.ఆర్థికశాస్త్రంలో ఆయన లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తి.మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని చెప్పారు రాహుల్ గాంధీ. Manmohan Singh Ji led India with immense wisdom and integrity. His humility and deep understanding of economics inspired the nation.My heartfelt condolences to Mrs. Kaur and the family.I have lost a mentor and guide. Millions of us who admired him will remember him with the… pic.twitter.com/bYT5o1ZN2R— Rahul Gandhi (@RahulGandhi) December 26, 2024
