భారతీయ సినిమాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మలయాళ నటుడు మోహన్ లాల్.ముఖ్యంగా తమ చిత్ర పరిశ్రమను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.మలయాళ చిత్రాలకు ఆదరణ పెరగడం ఆనందంగా ఉందని చెప్పారు.ప్రస్తుత రోజుల్లో సౌత్ సినిమా,నార్త్ సినిమా అనే తేడా లేదని..అంతా ఒక్కటే అని ఆయన అన్నారు.ప్రేక్షకులు అన్ని భాషల్లో చిత్రాలు చూస్తున్నారు.భవిష్యత్ లోనూ దీనినే కొనసాగించాలి అని తెలిపారు.నటీ నటులు,దర్శక నిర్మాతలు జాగ్రత్తగా ఉంటూ అద్భుతమైన సినిమాలు తీయాలని సూచించారు.మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం బరోజ్ 3డీ.మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది.ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకు పరిమితం అయ్యింది.
Author: admin
రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉన్న విషయం తెలిసిందే.రష్యా కు సపోర్ట్ చేస్తున్న ఉత్తర కొరియా.. తమ దేశ సైనికులను ఉక్రెయిన్ పై దాడి కోసం రంగంలోకి దింపింది.ఈ క్రమంలోనే తమకు బందీలుగా దొరికిన ఉత్తర కొరియా సైనికులను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.ఉత్తర కొరియా సైనికులకు కనీస రక్షణ సౌకర్యాలు కల్పించకుండా రష్యా యుద్ధ రంగంలోకి దించిందని ఆరోపించారు.యుద్ధంలో పోరాడుతూ గాయపడిన ఉత్తర కొరియా సైనికులను తమ సైన్యం బంధించిందని,ఆ తర్వాత వారు చనిపోయారని వెల్లడించారు.తీవ్రంగా గాయపడిన వారిని తాము కాపాడలేకపోయామని పేర్కొన్నారు.రష్యా తీరును ఆయన తప్పుపట్టారు.సైనికుల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు అన్నారు.
తమిళ అగ్ర నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విడాముయర్చి’.ఈ చిత్రానికి మగిల్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది.నిన్న ఈ సినిమా నుంచి ‘సవదీక..’ అనే ఫాస్ట్‌బీట్ పాటను విడుదల చేశారు.ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.ఓ భయంకరమైన ఏడారిలో తప్పిపోయిన తన భార్య కోసం కథానాయకుడు చేసే అన్వేషణ,ఆ ఎడారిలో గ్యాంగ్‌స్టర్స్ నుండి అతనికి ఎదురయ్యే ప్రతిఘటన నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం.ఇందులో అజిత్ పాత్ర కొత్త పంథాలో ఉంటుందని తెలుస్తుంది.ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రం అర్జున్, రెజీనా, నిఖిల్ నాయర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తమిళ,తెలుగు భాషల్లో భారీ స్థాయిలో సంక్రాంతికి విడుదల కానుంది. https://youtu.be/5BJDFKs41pI?si=or8YElQOljNReVo3
20.37 లక్షల మంది భక్తులు నవంబర్ నెలలో శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల కానుకలు ద్వారా రూ 113 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం సమకూరింది. 97 లక్షలు లడ్డూలు విక్రయం జరిగింది. అన్నప్రసాదాలు స్వీకరించిన 19.74 లక్షల మంది భక్తులు కాగా తలనీలాలు సమర్పించిన 7.31 లక్షల మంది భక్తులుగా ఉన్నారు. ఈ వివరాలను టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా వివరించారు.
విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట పేరుతో కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొని నిరసనలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ స్పందించారు. కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ గళమెత్తిన ప్రజానీకానికి తోడుగా, ప్రజల తరఫున చేపట్టిన నిరసనలను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. పార్టీ పిలుపునకు స్పందించి ప్రజలకు బాసటగా నిలుస్తూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. ప్రజల పక్షంగా, ప్రజాసమస్యలపట్ల పార్టీ శ్రేణులు కనబరుస్తున్న అంకితభావానికి, చిత్తశుద్ధికి హ్యాట్సాఫ్ అంటూ జగన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
ఇటీవల వెస్టిండీస్ జరిగిన టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు తాజాగా జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. నేడు జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ దీప్తి శర్మ (6/31), రేణుకా సింగ్ (4/29) ధాటికి 38.5 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటయింది. చినెల్లే హెన్రీ 61 (72; 5×4, 3×6). హాఫ్ సెంచరీతో రాణించింది. క్యాంప్ బెల్ 46 (62; 7×4) పరుగులతో పర్వాలేదనిపించింది. అల్లెన్ (21) పరుగులు చేసింది. భారత బౌలర్లలో తీశారు. ఇక లక్ష్య ఛేదనలో భారత్ 28.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించింది. దీప్తి శర్మ 39 నాటౌట్ (48;3×4, 1×6), హార్మన్ ప్రీత్ కౌర్ 32(22;7×4), జెమీమా…
సంధ్య థియేటర్ ఘటనను ఉద్దేశించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు.హీరో చుట్టుపక్కల ఉండే వాళ్ళ తీరును ఆయన తప్పుబట్టారు.చిరంజీవి,బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు కూడా ఒకానొక సమయంలో అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లేవారని…ఎవరికీ ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు పటించేవారని అన్నారు.”ఇటీవల జరిగిన పరిస్థితులు చూస్తే బయట ఉన్నవాళ్లకు కూడా ఒక స్పష్టత వస్తుంది.సినిమా వాళ్లను ఫ్యాన్స్ దేవుళ్లుగా చూస్తారు.దానికి అనుగుణంగా హీరోలు వ్యవహరిస్తున్నారు.ఎక్కడికి వెళ్లినా నాలుగు కారుల్లో వెళ్లాలి.రోడ్ షో చేయాలని భావిస్తున్నారు. ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువ అయ్యాయి.అలా చేయకుండా సైలెంట్ గా వెళ్లి సినిమా చూసి వచ్చేస్తే ఇలాంటి ఘటనలు జరగవు.అప్పటి హీరోలు థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడాలనుకుంటే మల్టీ ఫ్లెక్స్ కు వెళ్ళేవారు.ఒకవేళ సింగిల్ స్క్రీన్ కు వెళ్ళాలని ఉన్నా… ఎవరికి చెప్పకుండా వెళ్లి వచ్చేసేవారు.ఇప్పుడు అలా కాదు…అభిమాన హీరో వస్తున్నాడని ముందే సందేశాలు పంపిస్తున్నాను.దాని వల్ల అభిమానులు…
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి ఓ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని నాగ వంశీ నిర్మిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఉద్దేశించి నాగ వంశీ తాజాగా మాట్లాడారు.దీనిని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు.విజయ్ దేవరకొండ సినిమా మార్చి 28 విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు.ఒకవేళ ఆ సమయంలో ‘హరిహరవీరమల్లు’ విడుదలైతే ఇది వాయిదా పడుతుంది.ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది. అయితే ఇది రెండు పార్టులుగా వస్తుంది. రెండు కథలు విడివిడిగానే ఉంటాయి.దీన్ని ప్రారంభించినప్పుడు ఒక భాగమే అనుకున్నాం…కానీ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నప్పుడు రెండో పార్ట్ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.అల్లు అర్జున్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత చర్చించుకొని ముందుకువెళ్తామని చెప్పారు. ఏప్రిల్ లేదా మే లో షూటింగ్ ప్రారంభించాలి అనుకుంటున్నామని ఆయన అన్నారు.
స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ను ఉద్దేశించి మాట్లాడారు అగ్ర నటుడు,బిగ్ బి అమితాబ్ బచ్చన్.అల్లు అర్జున్ టాలెంట్ ను అమితాబ్ బచ్చన్ మెచ్చుకున్నారు.కాగా ఇప్పటివరకు లభించిన గుర్తింపులన్నిటికీ అల్లు అర్జున్ పూర్తి అర్హుడు అని అన్నారు.నేను కూడా అతడికి వీరాభిమానిని అమితాబ్ చెప్పారు.ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రూల్ విడుదలై మంచి విజయం సాధించింది.కాగా మీరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూడండి అంటూ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యానించాడు.అతడు గొప్ప ప్రతిభావంతుడు…అతడితో నన్ను పోల్చొద్దు’ అంటు సరదాగా అన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాలి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీయ సూచీలు జోరు కనబరిచాయి. ఫార్మా, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఫైనాన్స్ తదితర రంగాల్లో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 226 పాయింట్ల నష్టంతో 78,699 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 63 పాయింట్ల లాభంతో 23,813 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.52గా కొనసాగుతోంది. టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
