Author: admin

అల్లు అర్జున్ అసలైన వ్యక్తిత్వం గురించి ఏంఐఏం ఎమెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు ఆయన తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ…సంధ్య థియేటర్ ఘటన గురించి చెబితే పెద్దగా బాధపడకుండా సినిమా గురించి మాత్రమే సన్నిహితులతో చర్చించిన దుర్మార్గుడంటూ అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు.పుష్ప సినిమా విడుదల రోజు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందని పక్కనున్న వాళ్లు చెబితే…’అయితే మన సినిమా హిట్ అయినట్టే’ అంటూ సంతోషం వ్యక్తి చేసినట్లు సన్నిహితుల ద్వారా తనకు తెలిసిందన్నారు.పోలీసులు చెబుతున్న వినకుండా హీరోయిజం చూపించేందుకు వచ్చి రేవతి కుటుంబంలో తీరని శోఖం మిగిల్చారు. బయట మహిళా అభిమాని చనిపోయింది.చిన్న పిల్లవాడు చావు బతుకుల్లో ఉన్నాడని పోలీసులు చెబుతున్నా పట్టించుకోలేదు.తొక్కిసలాట గురించి సమాచారం ఇస్తే.. ‘అయితే మన సినిమా హిట్ అయినట్టే’ అంటూ సంబరాలు చేసుకున్నాడు.అంతటితో ఆగకుండా వెళ్లిపోవాలని చెప్పినా వినకుండా.. సినిమా మొత్తం చూశాడు.బయటకొచ్చి కార్ రోప్ ఎక్కి చేతులూపుతూ హంగామా చేశాడు.మానవత్వం లేకుండా…

Read More

నేడు ప్రారంభమైన ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో మొదటి రోజే భారీ రికార్డు నమోదైంది. పంజాబ్ అరుణాచల్ ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఆటగాడు అనుమోల్ ప్రీత్ మెరుపు శతకం నమోదు చేశాడు. 45 బంతుల్లోనే 12×4, 9×6 లతో 115 పరుగులు చేశాడు. 35 బంతుల్లో శతకం సాధించాడు. దీంతో లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ లో అరూణాచల్ ప్రదేశ్ 48.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటయింది. అశ్వనీ కుమార్ 3 వికెట్లు, మయాంక్ మార్కండే‌3 వికెట్లు, బల్తేజ్ సింగ్ 2 వికెట్లు తీశారు. ఇక అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ 12.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.

Read More

తెలంగాణ అసెంబ్లీలో ‘పుష్ప’ బెనిఫిట్‌ ఘటన, అల్లు అర్జున్‌ అరెస్ట్‌ గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది.అల్లు అర్జున్‌ తీరుపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.బెనిఫిట్‌ షోకు హీరోలు హాజరు కావడానికి పోలీసులు అంగీకరించలేదని.. అయినప్పటికీ ఆయన సంధ్యా థియేటర్‌కు ర్యాలీగా వచ్చారని అన్నారు.అరెస్ట్‌ చేస్తామని హెచ్చరిస్తామని చెప్పిన తర్వాతనే ఆయన థియేటర్‌ నుంచి వెళ్లిపోయారని తెలిపారు.వెళ్లేటప్పుడు కూడా ర్యాలీగా వెళ్లారని అన్నారు.మధ్యంతర బెయిల్‌పై అల్లు అర్జున్‌ బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని సినీ ప్రముఖులు పరామర్శించడాన్ని సీఎం తప్పు బట్టారు.ఆయనకు ఏమైనా కన్ను పోయిందా? కాలు విరిగిందా? పరామర్శించడానికి అని ప్రశ్నించారు.తాను సీఎంగా ఉన్నంతకాలం సినిమాలకు సంబంధించి ప్రత్యేక రాయితేలకు అనుమతి ఇవ్వమని తెలిపారు.

Read More

అల్లూరి సీతారామరాజు జిల్లా బల్లగరువులో అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జిల్లాకు వచ్చినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఒక మహాత్ముడు నడిచిన నేల ఇది. గిరిజన ప్రజలకు అండగా ఉన్న మహానుభావుడి పేరు పెట్టిన నేల, ఆయన పోరాడిన నేల, ఈ నేల డోలి రహిత గ్రామాలుగా ఉండాలని అన్నారు. 6 నెలల క్రితం యువత బలంగా మార్పు రావాలని అనుకున్నారు. మార్పు వచ్చింది మీకు రోడ్లు పడ్డాయి. మార్పు వచ్చింది పంచాయితీ సర్పంచ్ లకు విలువ లేని పరిస్థితుల్లో ఈరోజు తల ఎత్తుకుని మేము సర్పంచులం అని చెప్పుకునే స్థాయిలో మేము పెట్టామని పవన్ పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం అంటే..ఇక్కడున్న సగటు గిరిజన యువకుడు, గిరిజన యువతి భాగస్వామ్యం అయినట్టేనని అన్నారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు,…

Read More

ఈ రోజు, ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా, ధ్యానాన్ని వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని మరియు దాని పరివర్తన సామర్థ్యాన్ని అనుభూతి పొందాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరి జీవితానికి, అలాగే మన సమాజానికి శాంతి మరియు సామరస్యాన్ని తీసుకురావడానికి ధ్యానం ఒక శక్తివంతమైన మార్గం. సాంకేతికత యుగంలో, యాప్‌లు మరియు గైడెడ్ వీడియోలు మన నిత్యకృత్యాలలో ధ్యానాన్ని చేర్చడంలో సహాయపడే విలువైన సాధనాలని ఆయన పేర్కొన్నారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరు ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ధ్యానం ప్రాధాన్యతను తెలియచెప్పేందుకు ఐక్య రాజ్యసమితి  డిసెంబర్ 21ని ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ధ్యాన దినోత్సవ  శుభాకాంక్షలు తెలిపారు.

Read More

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది అనంతరం నేడు తిరిగి ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 17న విచ్చేసిన రాష్ట్రపతి రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. గత రాత్రి బొల్లారం అధికార నివాసంలో రాష్ట్రంలోని ప్రముఖులకు  తేనేటీ విందు ఇచ్చారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎం రేవంత్ రెడ్డి, సహచర మంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మిలిటరీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేడు హకీంపేట్ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి తిరుగు ప్రయాణం అయ్యారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మహిళాభివృధ్హి శాఖామంత్రి సీతక్క రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు.

Read More

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా మధుమూర్తి నియమితులయ్యారు. మూడు సంవత్సరాల పాటు ఆయన ఈపదవిలో కొనసాగనున్నారు. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ఆదేశించారు.

Read More

ఇటీవల తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల భూప్రకంపనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు మరోసారి ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. తాళ్లూరు, గంగవరం, రామభధ్రాపురం ఇతర గ్రామాలలో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. పసుపు గల్లు, ముండ్లమూరు, , తూర్పు కంభంపాడు, వేశాడు, మారెళ్లలో కూడా భూమి కంపించింది.

Read More

అరుంధతి సినిమాలో పశుపతి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు బాలీవుడ్ నటుడు సోనూసూద్.తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన అరుంధతి విషయాలు గుర్తు చేసుకున్నారు.ఆ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని అన్నారు.’ నా కెరీర్ లో ఎప్పటికిగుర్తుందేది అరుంధతి’లోని పశుపతి.మేకప్ కు ఆరేడు గంటల టైం పట్టేది.మేకప్ వల్ల దద్దుర్లు వచ్చాయి.పగలు, రాత్రి నిరంతరాయంగా చిత్రీకరణ జరిగింది.షూటింగ్ మొత్తం పూర్తయ డైరెక్టర్ నుండి ఎప్పుడు ఫోన్ కాల్ వచ్చినా మళ్లీ యాక్ట్ చేయమంటారేమోనని భయపడేవాడిని.సినిమా విడుదల తర్వాత ముంబయి నుండి మళ్లీ హైదరాబాద్ వెళ్ళా…థియేటర్ల వద్ద ప్రేక్షకుల రద్దీ చూసి ఆశ్చర్యపోయా.సినిమా నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో అప్పుడర్థమైంది.అదంతా జరిగి అప్పుడే 15 ఏళ్లు గడిచాయంటే నమ్మలేకపోతున్నా” అని పేర్కొన్నారు.

Read More

2024లో తన మనసు గెలిచిన చిత్రాలు, రచనలు, మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ను ఉద్దేశించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.ఆయన షేర్‌ చేసిన చిత్రాల జాబితాలో భారతీయ దర్శకురాలు పాయల్‌ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఆల్‌ వీ ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ మొదటి స్థానంలో ఉంది. 2.కాన్‌క్లేవ్‌, 3.ది పియానో లెసెన్‌, 4.ది ప్రామిస్డ్‌ ల్యాండ్‌, 5.ది సీడ్‌ ఆఫ్‌ ది స్కేర్డ్‌ ఫిగ్‌, 6.డ్యూన్‌: పార్ట్‌, 7.అనోరా, 8.డీడీ, 9.షుగర్‌కేన్‌, 10.ఏ కంప్లీట్‌ అన్‌నోన్‌ ఈ చిత్రాలకు తనకు బాగా నచ్చాయని అన్నారు. సినీ ప్రియులు వీటిని వీక్షించమని ఆయన రికమెండ్‌ చేశారు. లంచ్‌, యాయో, జంప్, ఫేవరెట్‌, యాక్టివ్‌, గోల్డ్‌ కోస్ట్‌ వంటి మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ ఈ ఏడాది తనని ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.

Read More