ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ చెస్ లో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ ను వేగంగా పరిష్కరించి ‘ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్-175 పజిల్స్’ రికార్డును సృష్టించాడు. కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే ఈ ఘనత అందుకున్నాడు. దీంతోపాటు దేవాంశ్ సాధించిన మరో రెండు రికార్డులను ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ – లండన్’ అధికారికంగా ధ్రువీకరించింది. వ్యూహాత్మకమైన – ఆటతీరుతో 11 నిమిషాల 59 సెకన్లలో చెక్ మేట్ పజిల్స్ పూర్తిచేసి దేవాంశ్ ప్రపంచ రికార్డు సాధించాడు. “5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్” అన్న పుస్తకం నుంచి తీసుకున్న పజిల్స్ ఈ పోటీని రూపొందించారు. దేవాంశ్ ఇటీవల 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోమ్ని కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తిచేశాడు. అలాగే, 9 చెస్బోర్డుల్ని కేవలం 5 నిమిషాల్లో సెట్ చేశాడు. లోకేష్ ఈ ఘనత సాధించడం పట్ల కుటుంబ సభ్యులు…
Author: admin
భారత మహిళా క్రికెట్ జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. స్వదేశంలో వెస్టిండీస్ పై ఇటీవలే టీ20 సిరీస్ ను 2-1తో గెలిచుకున్న సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తాజాగా వడోదర వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో 211 పరుగుల తేడాతో రికార్డు స్థాయిలో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. స్మృతి మంథాన 91 (102;13×4), హార్లీన్ డియోల్ 44 (50,2×4, 1×6), ప్రతీక రావల్ 40(69;4×4), హార్మన్ ప్రీత్ 34 (23, 3×4, 1×6), జెమీమా రోడ్రిగ్స్ 31(19;3×4,1×6) పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. విండీస్ బౌలర్లలో జైదా జేమ్స్ 5 వికెట్లు పడగొట్టింది. హేలే మ్యాథ్యూస్ 2 వికెట్లు, డాటిన్ 1 వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 26.2 ఓవర్లలో 103…
అండర్-19 మహిళల ఆసియా కప్ లో భారత అమ్మాయిలు సత్తా చాటారు. అద్భుతమైన ఆటతీరుతో టైటిల్ విజేతగా నిలిచారు. తాజాగా జరిగిన ఫైనల్ లో 41 పరుగులతో బంగ్లాదేశ్ పై విజయం సాధించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. త్రిష 52(47; 5×4,2×6) జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించింది. మిథిలా (17),నిక్కీ (12), ఆయుషీ(10) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫర్జానా 4 వికెట్లు, నిశ్చిత 2 వికెట్లు తీశారు. ఇక స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ ఘోరంగా విఫలమైంది. 18.3 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో ఆయుషీ 3 వికెట్లు, పర్ణిక 2 వికెట్లు, సోనమ్ 2 వికెట్లు పడగొట్టారు. అర్థ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన త్రిష “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” గా నిలిచింది.
భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ వెంకట దత్తసాయిల వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ సాగర్ లేక్ లో గల రఫల్స్ హోటల్ ఈ వేడుక వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, అతిథుల మధ్య నిన్న రాత్రి ఈ వివాహం జరిగింది.నేడు హైదరాబాద్ లో రిసెప్షన్ జరగనుంది.
పౌరులుగా అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు.సంధ్య థియేటర్ ఘటనపై ఆయన స్పందించారు.వ్యక్తిగతంగా తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.“సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం.అల్లు అర్జున్ కు మేం వ్యతిరేకం కాదు.చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకున్నాం.పౌరుల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యం.ఆయన సినీ హీరో కావొచ్చు.. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాలి.ఇలాంటి ఘటనలు పౌరుల భద్రతకు మంచిది కాదు.ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదు.జర్నలిస్టుపై దాడి కేసులో సినీనటుడు మోహన్ బాబు పై కేసు నమోదు చేశాం.చట్ట ప్రకారం ఆయనపై చర్యలు ఉంటాయి ‘ అని ఆయన అన్నారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఆయనకు కువైట్ తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ తో సత్కరించింది. కువైట్ ఎమిర్ షేక్ మిశాల్ అల్ అహ్మద్ అల్ జాబెర్- అల్ – సబా ఈ పురస్కారాన్ని మోడీకి అందించారు. వివిధ దేశాల నుండి ప్రధాని మోడీ అందుకున్న 20వ ఇంటర్నేషనల్ అవార్డు ఇది కావడం గమనార్హం. గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్ ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు. ఇక కువైట్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ నేడు ఆ దేశ ఎమిర్ తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య పటిష్టమైన సంబంధాలతో పాటు ఐటీ, ఫార్మా, ఫిన్ టెక్, భద్రత వంటి కీలక రంగాల్లో సహాకారం పై చర్చించినట్లు ట్వీట్ చేశారు. మరోవైపు క్రౌన్ ప్రిన్స్ షేక్…
మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. కాలయాపన తప్పా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత కనిపించడం లేదని ఆరోపించారు. అధికారం చేపట్టిన 6 నెలల్లో పండుగలు, పబ్బాలు పేరు చెప్పి దాటవేశారు. బస్సులు కొంటున్నాం అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మంత్రివర్గ ఉప సంఘం పేరుతో మరికొన్ని రోజులు సాగతీతకు సిద్ధమయ్యారని షర్మిల విమర్శలు గుప్పించారు. చిన్న పథకం అమలుకు కొండత కసరత్తు దేనికోసం ? తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పథకం అమలు చేసి చూపించారు కదా? అని ప్రశ్నించారు. జీరో టిక్కెట్ల కింద నెలకు రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వడానికి మీ ప్రభుత్వం దగ్గర నిధులు లేవా అని ప్రశ్నించారు. ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి ? కనీసం నూతన సంవత్సర కానుక కిందైనా…
పరస్పర అంగీకారంతో జరిగిన శృంగారాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.చట్టంలోని సెక్షన్లను కొందరు పురుషులను వేధించేందుకు ఉపయోగిస్తున్నారని స్పష్టం చేసింది.తనపై నమోదైన రేప్ కేసును కొట్టివేయాలంటూ ఓ యువకుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం యువతి ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టినట్టు స్పష్టమవుతున్నదని పేర్కొంది.ఈ మేరకు యువకుడిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని పోలీసులను ఆదేశించింది. కేసు విచారణ,తీర్పు సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.అత్యాచారం మహిళలపై జరిగే చాలా హేయమైన చర్య…కానీ కొందరు మహిళలు తమతో సంబంధం కలిగిన పురుషుడిని వేధించేందుకు చట్టాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు.యువకుడు సమర్పించిన వాట్సప్ చాటింగ్‌లు,రికార్డింగ్స్ బట్టి చూస్తే ఇద్దరూ పరస్పరం అంగీకారంతోనే శారీరక బంధంలోకి ప్రవేశించినట్టు స్పష్టమవుతున్నది.స్త్రీలు చట్టాన్ని దుర్వినియోగం చేయడం వల్ల పురుషులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో చెప్పేందుకు ఈ కేసు స్పష్టమైన ఉదాహరణ అని చెప్పింది.
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా సిరీస్ లో కీలకమైన నాలుగో టెస్టు జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ లలో ఇరు జట్లు 1-1తో ఉన్నాయి. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. కాగా, ఈ మ్యాచ్ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మెల్ బోర్న్ మైదానంలో సరికొత్త చరిత్రను సృష్టించేందుకు విరాట్ కోహ్లి చేరువలో ఉన్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టేందుకు చేరువయ్యాడు. ఎంసీజీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 449 పరుగులతో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అజింక్యా రహానె 369 పరుగులతో ద్వితీయ స్థానంలో 316 పరుగులతో విరాట్ కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు. నాలుగో టెస్టు మ్యాచ్…
అంతర్జాతీయ క్రికెట్ కు ఇటీవల గుడ్ బై చెప్పారు భారత క్రికెటర్ అశ్విన్. ఆయన ప్రతిభను ప్రశంసిస్తూ సినీ,రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో వరుస పోస్టు లు పెడుతున్నారు.తాజాగా ఆయన అభినందించారు ప్రధాని మోదీ.అశ్విన్ కు ప్రత్యేకంగా లేఖ రాశారు.’ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మీ నిర్ణయంపై ఆశ్చర్యానికి గురయ్యారు.ఎన్నో ఆఫ్ బ్రేక్స్,క్యారమ్ బంతులతో ప్రత్యర్థులను హడలెత్తించారు.ఇప్పుడీ నిర్ణయం కూడా క్యారమ్ బాల్ మాదిరిగా ఉంది.అయితే,ఇలాంటి ప్రకటన చేయడం కూడా అత్యంత కఠినమని అందరికీ తెలుసు.భారత్ కోసం అద్భుతమైన ప్రదర్శన చేశావు.అందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నా.జట్టు కోసం వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టావు.మీ అమ్మగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడూ జట్టు కోసం ఆలోచించావు.చెన్నై వరదలు వచ్చినప్పుడు సాయం చేసేందుకు ముందుకొచ్చావు.ఇక నుండి జెర్సీ నంబర్ 99ని మేం మిస్ కాబోతున్నాం” అని మోదీ తెలిపారు.
