రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’.ఇందులో కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు నిర్మించారు.సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమాకు చేయని విధంగా విదేశాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.డల్లాస్ వేదికగా జరిగిన వేడుకకు భారీ స్థాయిలో అభిమానులు తరలివచ్చారు.రామ్ చరణ్ ఎంట్రీ సమయంలో ఆడిటోరియం అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది.’స్టార్.. స్టార్.. గ్లోబల్ స్టార్’ అంటూ మార్మోగిపోయింది.ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.అభిమానులను ఉత్సాహ పరుస్తూ రామ్ చరణ్ తన డ్యాన్స్ తో అదరగొట్టారు.’ రా మచ్చా ‘ పాటకు ఆయన ఎస్ జె సూర్య స్టెప్పులు వేశారు. Dallas, looking forward to seeing you on December 21st!#Gamechanger pic.twitter.com/AOsvRcjIf6— Ram Charan (@AlwaysRamCharan) December 19, 2024
Author: admin
ఈశాన్య ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్దికి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు కేంద్ర హాం మంత్రి అమిత్ షా అన్నారు. త్రిపుర పర్యటనలో భాగంగా అగర్తలాలో జరిగిన ఈశాన్య మండలి 72వ ప్లీనరీలో హోంమంత్రి పాల్గొన్నారు. 8 రాష్ట్రాల సీఎంలు, గవర్నర్ లు హాజరయ్యారు. ప్రధాని మోడీ పాలనలో దేశంలో ఉగ్రదాడులు తగ్గాయని, ఈశాన్య రాష్ట్రాలలో 10,574 మంది సాయుధ మిలిటెంట్లు లొంగిపోయారని అమిత్ షా అన్నారు. 20 శాంతి ఒప్పందాలతో శాంతి నెలకొల్పారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాలలో రైళ్ల కనెక్టివిటీ కోసం రూ.81,000 కోట్లు. రోడ్ల నిర్మాణం కోసం రూ.41,000 కోట్లు కేంద్రం ఖర్చు చేసిందని తెలిపారు. నేషనల్ ఆర్గానిక్ కార్పోరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల కువైట్ పర్యటన నిమిత్తం నిన్న కువైట్ చేరుకున్నారు.కువైట్ ఉప ప్రధాని H.E షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబా,ఆ దేశ రక్షణ,అంతర్గత మంత్రులు..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు.ప్రధాన మంత్రి కువైట్ పర్యటనలో అరబిక్ లోకి అనువదించబడిన రామాయణం,మహాభారతంను పబ్లిషర్స్,ట్రాన్స్ లేటర్ అబ్దుల్ లతీఫ్ అల్నెసెఫ్…ప్రధాని నరేంద్ర మోదికి బహూకరించారు.ఈ సందర్భంగా ప్రధాని పవిత్ర గ్రంథాలపై సంతకాలు చేశారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కువైట్ పర్యటనలో భాగంగా సిటీలోని భారతీయ కళాకారుల ప్రదర్శనను వీక్షించారు.సోషల్ మీడియాలో వచ్చిన అభ్యర్థన మేరకు కువైట్‌లోని 101 ఏళ్ల IFS అధికారి మంగళ్ సైన్ హండాను కలిశారు
జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్-2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది గత పదేళ్ళలో భారత్ లో జరిగే తొమ్మిదవ అత్యున్నత స్థాయి షూటింగ్ టోర్నీ. ప్రతిష్టాత్మక షూటింగ్ ఈవెంట్ లకు భారత్ వేదికగా మారుతోంది. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ టోర్నీలకు ఇటీవల భారత్ ఆతిథ్యం ఇస్తూనే ఉంది. 2023లో భోపాల్ వేదికగా ప్రపంచ కప్ జరగ్గా తాజాగా జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ పోటీలకు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిలిచింది.
మాజీ సీఎం,వైసిపి అద్యక్షుడు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా…సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మేరకు ఆయన నిన్న ‘మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ గారు…మీకు చక్కటి ఆరోగ్యం, సుదీర్ఘ జీవితం ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.తన రాజకీయ ప్రత్యర్థికి చంద్రబాబు విషెస్ చెప్పడంపై నెట్టింట వైసీపీ,టీడీపీ ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. Warm birthday greetings to @ysjagan Garu. May he be blessed with good health and long life.— N Chandrababu Naidu (@ncbn) December 21, 2024
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఈరోజు 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు పాల్గొనే ఈ సమావేశంలో వస్తు సేవల పన్నుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఇక పాలసీ (భీమా) పై జీ.ఎస్.టీ మినహాయింపు సహా పలు అంశాలపై నిర్ణయాలు వాయిదా పడ్డాయి. ఏ.టీ.ఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ )ను జీ.ఎస్.టీ పరిధిలోకి తీసుకురావడానికి ఏకాభిప్రాయం కుదరలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ సమావేశం నిర్ణయాలను ఆమె మీడియాకు తెలిపారు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లపై జీ.ఎస్.టీ మినహాయింపు అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ఐ.ఆర్.డి.ఏఐ సహా మరికొన్ని ఇన్ పుట్స్ రావాల్సిన అవసరం ఉందని వివరించారు. జీ.ఎస్.టీ కౌన్సిల్ నిర్ణయాలు: రూ.2 వేల లోపు చెల్లింపులు చేసే పేమెంట్ అగ్రిగేటర్లకు జీఎస్టీ నుండి మినహాయిపు. పేమెంట్…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. అల్లు అర్జున్ ను థియేటర్ కు రావొద్దని పోలీసులు చెప్పినా వినకుండా వచ్చారని బాధిత కుటుంబాన్ని కనీసం ఏ ఒక్క సినీ ప్రముఖుడు కూడా పరామర్శించలేదని ఫైర్ అయిన సంగతి తెలిసిందే. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తన వ్యవహారశైలి పై వచ్చిన వార్తలను అల్లు అర్జున్ ఈసందర్భంగా ఖండించారు. తన క్యారెక్టర్ ను తక్కువ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని అన్నారు. ఎలాంటి ర్యాలీ చేయలేదని థియేటర్ కొద్ది దూరంలో తన కారు ఆగిపోయింది. కారు ముందుకు కదల్లేదు. చేయి చూపిస్తూ ముందుకు కదలండని పోలీసులు అంటేనే తాను బయటకు వచ్చి, చేతులు ఊపినట్లు పేర్కొన్నారు. థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత ఏ పోలీస్ లోపలికి వచ్చి జరిగిన సంఘటన గురించి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంశానికి సంబంధించి ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాలలో అధ్యయనం చేసి సిఫార్సు చేయాలని సూచించింది. రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ లో కన్వీనర్ గా రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత ఉన్నారు.
ఐటీ రంగంలో ఇటీవల లేఆఫ్ లు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. పలు కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. గతేడాది 12000 మందికి పైగా ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించిన అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజం గూగుల్ ఈసారి మేనేజరియల్ స్థాయిలో ఉన్న సిబ్బందిలో 10% మందికి లే ఆఫ్ ప్రకటించనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థల నుండి పోటీ తీవ్రంగా పెరుగుతుండడంతో తమ కార్యకలాపాల కెపాసిటీ పెంచుకునేందుకు ఈ లే ఆఫ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దేశ రాజధాని దిల్లీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.ఢిల్లీ మద్యం కేసులో మాజీ ముఖ్యమంత్రి,ఆప్ కన్వీనర్ ఆరవింద్ కేజ్రీవాల్ ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు అనుమతి లభించింది.ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈడీ కు కావాల్సిన అనుమతులు మంజూరు చేశారు.దీనిపై అధికారిక ప్రకటన విడుదల అయింది. సీఆర్‌పీసీ ప్రకారం..మనీలాండరింగ్‌కు సంబంధించి ప్రజాప్రతినిధులను విచారించాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి.ఈ క్రమంలోనే కేజ్రీవాల్ విచారించేందుకు అనుమతి కోరుతూ ఈ నెల ఆరంభం లో ఈడీ… ఎల్జీ ను ఆశ్రయించింది.అందుకు అంగీకరిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది.ఈ కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్ కొన్ని రోజుల పాటు తీహార్ జైల్ లో ఉన్నారు.సెప్టెంబర్ నెలలో విడుదల అయ్యారు. ఇటీవల ఈ కేసులో తనపై విచారణ ప్రక్రియను నిలిపివేయాలని కేజ్రీవాల్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
