Author: admin

నేటి ట్రేడింగ్ లో కూడా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల బాటలో పయనించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల నిర్ణయాలు రానున్న నేపథ్యంలో ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రధాన రంగాల షేర్లు సూచీలకు మద్దతుగా నిలివలేదు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 502 పాయింట్ల నష్టంతో 80,182 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 137 పాయింట్ల నష్టంతో 24,198 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.90గా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీ.సీ.ఎస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్, హెచ్.సి.ఎల్. టెక్నాలజీస్, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి.

Read More

రష్యా నూక్లియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ మరణించారు. స్కూటర్ బాంబు పేలడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. తన నివాసం నుండి బయటకు అడుగుపెడుతుండగా బాంబు పేలింది. దీంతో కిరిల్లోవ్ తో పాటు ఆయన సహాయకుడు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇగోర్ కిరిల్లోవ్ ను తామే హత్య చేసినట్లు ఉక్రెయిన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. తమ భూభాగంపై నిషేధిత రసాయనిక ఆయుధాల ప్రయోగానికి కిరిల్లోవ్ అనుమతించారని ఆరోపించాయి. ఇందుకు ప్రతీకారంగానే ఆయనపై దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Video footage has emerged showing the moment General Igor Kirillov, who was in charge of Russia’s nuclear protection forces, was killed in an explosion that a source in Ukraine’s security…

Read More

జమిలి ఎన్నికల బిల్లులను బీజేపీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, దీనిని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి‌. ఏపీసీసీ చీఫ్ షర్మిల జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు. పూర్తి మెజార్టీ లేకపోయినా రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనమని ఆమె’ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ఇది నియంతృత్వ చర్య అని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాజ్యాంగ సవరణలకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ బీజేపీకి లేదని లోక్‌సభలో ఓటింగ్‌తో తేలింది. కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలి..? ఇందులో ఏమన్నా అర్థముందా..? అని ప్రశ్నించారు. ఓటింగ్‌ వ్యవహారం బీజేపీకే బెడిసికొట్టిందని దుయ్యబట్టారు. జమిలి ఎన్నికలు జరపాలంటే కేంద్ర, రాష్ట్రాల చట్టసభలకు నిర్ణీత కాల వ్యవధి కల్పించే ఆర్టికల్ 83, 172లను కూడా సవరించాల్సి…

Read More

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. పార్లమెంటు లోని ప్రధాన మంత్రి కార్యాలయంలో వీరి సమావేశం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సి) నియామకం విషయమై ఈ భేటీ జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఛైర్మన్ ను ఎంపిక చేసే కమిటీలో ప్రధాన మంత్రి, కేంద్ర హోంమంత్రి, లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్, ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు సభ్యులుగా ఉంటారు. అయితే ప్రస్తుతానికి మోడీ, అమిత్ షా, మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ మధ్యే భేటీ జరిగింది.

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సిటీలో 75 ఎకరాల్లో జపాన్ కు చెందిన ప్రముఖ ఏసీ, రిఫ్రిజిరేటర్ల తయారీ కంపెనీ డైకిన్ రూ.వెయ్యి కోట్లతో తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. తైవాన్ కు చెందిన రెచి ప్రెసిషన్ భాగస్వామ్యంతో ఈ పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో మెజారిటీ వాటాదారుగా డైకిన్ ఉండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పెట్టుబడుల ప్రస్తావన కార్యరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీ సిటీలో పెట్టే యూనిట్ తో కలిపి దేశంలో మూడు యూనిట్లు ఏర్పాటు చేసినట్లు అవుతుంది. దేశంలో ప్రస్తుతం 2 మిలియన్ యూనిట్లను తయారు చేస్తున్నాం. 2030 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 మిలియన్ యూనిట్లకు చేర్చాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. దేశీయ మార్కెట్లో ఏసీ అమ్మకాలలో సింహభాగం దక్కించుకోవాలన్నదే మా ఆలోచన. ఈ ఒప్పందంతో దేశీయంగా మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఏసీలను అందించడం సాధ్యం అవుతుందని సంస్థ ప్రకటనలో తెలిపింది.

Read More

క్యాన్సర్‌ రోగంతో పీడించబడుతున్న ప్రపంచానికి రష్య శుభవార్త తెలిపింది.క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ కనుగొన్నట్టు వెల్లడించింది.ముందుగా ఆ దేశ ప్రజలకు ఉచితంగా ఇవ్వబోతున్నట్టు పేర్కొంది.ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.జనవరి 2025 నుండి రష్యన్ పౌరులకు ఇవ్వబోతున్నట్టు చెప్పారు.రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ TASS ప్రకారం రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రీ కప్రిన్ ఈ టీకా గురించి వెల్లడించారు. రష్యా రాజధాని మాస్కో నగరంలోని గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ TASSతో మాట్లాడుతూ…క్యాన్సర్‌ పెరుగుదలను వ్యాక్సిన్ ఆపగలదని చెప్పారు.క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా నిరోధించగలదని పేర్కొన్నారు.ఈ వ్యాక్సిన్‌ను క్యాన్సర్‌ను నివారించడానికి సాధారణ ప్రజలకు ఇవ్వకుండా క్యాన్సర్ రోగులకు చికిత్స చేయడానికి వినియోగిస్తామని తెలిపారు.ఈ వ్యాక్సిన్‌ను అన్ని రకాల క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు ఇవ్వవచ్చు అని అన్నారు.

Read More

SpaceX వ్యవస్థాపకుడు ఎలాన్ మాస్క్ మాట్లాడుతూ…. స్టార్ లింక్ శాటిలైట్ బీమ్‌లు భారత్ నిలిపివేయబడ్డాయని తెలిపారు.స్టార్ లింక్ ఇంటర్నెట్ ద్వారా వందంతులు వ్యాప్తి చేస్తూ, మణిపూర్‌లో అల్లర్లు సృష్టిస్తున్నారని వాదనకు ఆయన స్పందిస్తూ ఈ మేరకు ఈ ప్రకటన చేశారు.ఇంఫాల్ తూర్పు జిల్లాలో కీరావుకునౌలో జరిగిన సెర్చింగ్ ఆపరేషన్ లో భద్రతా దళాలు ఇటీవల భారీగా ఆయుధాలు & మందుగుండు సామగ్రితో పాటు కొన్ని ఇంటర్నెట్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి.ఇండియన్ ఆర్మీకి చెందిన స్పియర్ కార్ప్స్ స్వాధీనం చేసుకున్న వస్తువుల ఫోటోలను Xలో షేర్ చేసింది.అలానే సోషల్ మీడియా పరికరాల్లో ఒకదానిపై “స్టార్‌లింక్ లోగో” ఉందని గమనించారు.

Read More

సుస్థిరమైన నీటి వనరుల వినియోగంతో రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ విజయవంతంగా అమలు చేసేందుకు గ్రామీణ నీటిసరఫరా మరియు పారిశుధ్య విభాగం అధికారులతో విజయవాడలోని లెమెన్ ట్రీ హోటల్ లో జరుగుతున్న రాష్ట్రస్థాయి వర్క్ షాప్ లో ఏపీ డిప్యూటీ సీఎం,గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అమృతధార ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఇక ఈ వర్క్ షాప్ లో పవన్ మాట్లాడుతూ కనీసం రోజుకి సగటు మనిషికి 55 లీటర్ల పరిశుభ్రమైన నీరు అందించాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ కింద 4000 కోట్లు ఖర్చుపెట్టాం అంటున్నారని అయితే తాను ఏ జిల్లాకి వెళ్ళినా నీళ్ళు రావట్లేదు అనే ఫిర్యాదు వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. 95.44 లక్షల కుటుంబాలకు గాను 70.04 లక్షల గృహాలకు నీటి కుళాయిలు అందించబడ్డాయి ఇంకా 25.40 లక్షల నీటి కుళాయిలు ఇవ్వాల్సి ఉంది అని జల్…

Read More

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనీ పునర్వ్యవస్థీకరించనున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ సంస్థ 2025 నుండి ఉన్నత విద్యకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ ల నిర్వహణపై మాత్రమే దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ టెస్టులను నిర్వహించాలని స్పష్టం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనీ ప్రక్షాళన చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా పది నియామకాలను తీసుకురానున్నట్లు పేర్కొన్న ఆయన పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఉండే విధంగా ప్రక్షాళన చేస్తామని వివరించారు. నీట్-యూజీ క్వశ్చన్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులలో భాగంగా పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీ.యూ.ఈ.టీ-యూజీ)నుండి సంవత్సరానికి ఒక్కసారే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక నీట్-యూజీ టెస్టును ఆన్ లైన్ లో నిర్వహించాలా లేదా ఆఫ్ లైన్ లో నిర్వహించాలా అనే అంశంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖతో రెండు సార్లు చర్చించినట్లు తెలిపారు.…

Read More

ముంబయిలోని ఓ స్టార్‌ హోటల్‌పై నటి ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి సిబ్బంది వల్ల తాను ఎంతో ఇబ్బందిపడ్డానని అన్నారు.దాదాపు నెలన్నర క్రితమే తాను కొన్ని రూమ్స్‌ బుక్‌ చేసుకున్నానని..కాకపోతే నిన్న అక్కడికి వెళ్లినప్పుడు సిబ్బంది మాత్రం గదులు వెంటనే ఇవ్వలేదని..దాదాపు ఆరు గంటలపాటు వెయిట్‌ చేయించారని ఆమె పేర్కొన్నారు.సిబ్బంది తీరు, అహంకారం తనని ఎంతో ఇబ్బందిపెట్టిందన్నారు.ఇలాంటి స్టార్‌ హోటల్స్‌ కంటే చిన్న హోటల్స్‌ నయం అన్నారు.భవిష్యత్తులో తాను ఇక్కడికి రావాలనుకోవడం లేదన్నారు.

Read More