రామాయణంపై బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా జవాబు ఇవ్వలేకపోవడం గురించి ఇటీవల శక్తిమాన్ నటుడు ముఖేశ్ ఖన్నా స్పందించిన విషయం తెలిసిందే.తప్పు ఆమెది కాదని..ఆమె తండ్రిదని..పురాణాల గురించి పిల్లలకు నేర్పించకపోవడాన్ని తప్పుబట్టారు.దీనిపై తాజాగా శత్రుఘ్న సిన్హా స్పందించారు.‘‘రామాయణంపై ప్రశ్నకు సోనాక్షి సమాధానం ఇవ్వలేకపోవడం కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు.కానీ,ఆ వ్యక్తి రామాయణానికి సంబంధించిన అన్ని విషయాల్లో నిపుణుడా? మతాన్ని సంరక్షించే బాధ్యత ఆయనకు ఏమైనా అప్పగించారా?’’ అని ప్రశ్నించారు.తన కుమార్తె విషయంలో గర్వపడుతున్నానని అన్నారు.ఆమె ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చిందని తెలిపారు.2019లో కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో సోనాక్షి సిన్హా పాల్గొన్నారు.‘ఆంజనేయుడు ఎవరి కోసం సంజీవని పర్వతాన్ని తీసుకుచ్చారు?’ అని ప్రశ్నకు ఆమె తెల్లమొహం వేశారు.
Author: admin
అంతర్జాతీయ క్రికెట్ కు భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు పలికాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్టు ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కేవలం బౌలర్ గానే కాకుండా బ్యాట్ తోనూ రాణించి భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. మంచి ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 106 టెస్టు మ్యాచ్ లు ఆడిన అశ్విన్ 537 వికెట్లు తీశాడు. 3503 పరుగులు చేశాడు. అందులో 6 సెంచరీలు కూడా ఉన్నాయి. 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 116 వన్డేల్లో 156 వికెట్లు తీశాడు. 707 పరుగులు చేశాడు. ఒక హాఫ్ సెంచరీ (65) ఉంది. ఇక టీ 20లలో 65 మ్యాచ్ లలో 72 వికెట్లు పడగొట్టాడు. ఇక రిటైర్మెంట్ ప్రకటించే ముందు విరాట్ కోహ్లీతో డ్రెస్సింగ్ రూమ్ లో…
అంతర్జాతీయ క్రికెట్‌కు టీమ్ ఇండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. గబ్బాలో ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన అనంతరం ఆయన ఈవిషయాన్ని వెల్లడించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్లోహీని పట్టుకుని ఆయన భావోద్వేగానికి గురైన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
భారత్ అధికంగా సుంకాలు విధిస్తోందని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆక్షేపణ వ్యక్తం చేశారు.సుంకాలు విషయంలో ఇదే ఒరవడి కొనసాగితే తాము కూడా పన్నులు విధిస్తామని ఆయన తెలిపారు.అన్ని సందర్భాల్లో భారత్ అమెరికా దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తోంది.. ప్రతిగా పన్నులు విధిస్తాం…వారు 100 శాతం, 200 శాతం ఛార్జ్ చేస్తున్నారు.బ్రెజిల్ కూడా మాపై ఛార్జ్ చేస్తున్నప్పుడు మేమూ అలాగే చేస్తామని వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు తెరకెక్కించిన చిత్రం _లాపతా లేడీస్₹.ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమా 2025 ఆస్కార్ కు మన దేశం తరఫున అధికారికంగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.తాజాగా ఈ సినిమాకు నిరాశ ఎదురైంది.ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో ఇది చోటు దక్కించుకోలేక పోయింది.దీనిపై సినీ ప్రియులు నిరాశ వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి అవార్డు వస్తుందని భావించాం అని పేర్కొంటున్నారు.
బైడెన్ పాలనలో భారత్ – అమెరికా మధ్య సంబంధాలు ఎంతగానో బలపడ్డాయని ఆయన యంత్రాంగం పేర్కొంది.త్వరలో అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ కూడా ఆయా సంబంధాలు కొనసాగించాలని తెలిపింది.భవిష్యత్ లోనూ ఇరు దేశాల మధ్య బంధాలు ఇలాగే మంచిగా కొనసాగుతాయని ఆశిస్తున్నమ్మని తెలిపింది.ఈ మేరకు యూఎస్ లోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాను అమెరికావిదేశాంగశాఖ డిప్యూటీ సెక్రటరీ కర్ట్ కాంప్బెల్ కలిశారు.ఈ విధంగా మాట్లాడారు.బై డెన్ పదవీ కాలం త్వరలో ముగియనున్న విషయం తెలిసిందే.వచ్చే నెల 10వ తేది నుంచి ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది. వర్షం కారణంగా చివరి రెండు సెషన్ల ఆట సాధ్యం కాలేదు దీంతో అంపైర్లు మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. దీంతో 5 టెస్టుల ఈ సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఓవర్ నైట్ స్కోర్ 252-9 తో ఐదోరోజు ఆట ప్రారంభించిన భారత్ 260 పరుగులకు ఆలౌటయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 89 పరుగులు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కమ్మిన్స్ (22), అలెక్స్ క్యారీ (20నాటౌట్), హెడ్ (17), ఖవాజా (8), స్మిత్ (4), లబుషేన్ (1),మార్ష్ (2) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, ఆకాష్ దీప్ 2 వికెట్లు తీశారు. ఇక మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో…
ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన పట్ల హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు.తాజాగా ఆయన థియేటర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.ఈనెల 4న రాత్రి పుష్ప -2 ప్రీమియ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటనపై లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు.దీనిపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.ఈ ఘటనలో ఒక మహిళ మరణించిన విషయం తెలిసిందే.ఆమె కొడుకు శ్రీ తేజ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ విషయంలో ఇటీవల అల్లు అర్జున్ అరెస్టు ఆయ్యారు.శనివారం మధ్యంతర బెయిల్ పై విడుదల అయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’ పథకం మెనూను ప్రభుత్వం జోన్లవారీగా మార్చింది. విద్యార్థులకు అన్ని రకాల పోషకాలు అందేలా రూపొందించారు. సంక్రాంతి సెలవుల తర్వాత పాఠశాలలలో దీనిని అమల్లోకి తీసుకురానున్నారు. ఈ మెనూను నాలుగు జోన్లుగా స్థానికత ఆధారంగా చేసుకుని ఆహారం అందించనున్నారు. అంటే ఆయా ప్రాంతాల్లో విద్యార్థుల ఆహారపు అలవాట్లు, ఆసక్తిగా తినే ఆహారం ఆధారంగా రూపొందించారు. జోన్-1: ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం. జోన్-2: తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా . జోన్-3: గుంటూరు, నెల్లూరు, ప్రకాశం. జోన్-4లో చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం.
పైప్ లైన్లు ద్వారా గ్యాస్ వినియోగించే రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యుడు రమణకుమార్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తో భేటీ అయింది. రాష్ట్రంలో చేపట్టిన గ్యాస్ పైప్ లైన్లు నిర్మాణ ప్రాజెక్టుల గురించి చర్చింది. గుజరాత్ లోని గాంధీనగర్ జిల్లా గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్-టెక్ సిటీ లో గ్యాస్, విద్యుత్, టెలికం కేబుళ్లు మొత్తం భూగర్భంలోనే ఉంటాయి. ఆ నగరంలో అన్ని ఇళ్లకూ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా అవుతోంది. అదే విధంగా అమరావతికి పైపులైన్ ద్వారా గ్యాస్ అందించి, దేశంలో మొట్టమొదటి పైప్ ద్వారా గ్యాస్ వినియోగించే రాజధాని నగరంగా చేసే ప్రతిపాదన చేయగా ఈ ప్రతిపాదనకు సీఎస్ అంగీకారం తెలిపారు.
