Author: admin

భారత మహిళా క్రికెట్ లో కీలక గుర్తింపు పొందిన పేసర్ జులన్ గోస్వామి పేరును దేశంలోని ప్రతిష్టాత్మక మైదానాల్లో ఒకటైన ఈడెన్ గార్డెన్స్ లోని ఒక స్టాండ్ కు పెట్టనున్నారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తాజాగా ఈ విషయం అధికారికంగా ప్రకటించింది. భారత క్రికెట్ కు ఆమె అందించిన సేవలకు గాను ఆమెకు ఈ గౌరవం లభించింది. జులన్ గోస్వామి భారత్ తరపున 204 వన్డేలకు, 68 టీ20లు, 12 టెస్టులు ఆడింది. వన్డేల్లో 255 వికెట్లు, టీ 20లలో 56 వికెట్లు, టెస్టులలో 44 వికెట్లు పడగొట్టి భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించింది. ఆమెతో పాటు భారత సైన్యంలో విశేష సేవలందించిన కల్నల్ ఎన్.జే.నాయర్ పేరును కూడా ఓ స్టాండ్ కు పెట్టాలని నిర్ణయించారు. ఆయన అశోక చక్ర, కీర్తి చక్ర పురస్కారాలు అందుకున్నారు. ఇక జులన్ గోస్వామి దీనిపై స్పందిస్తూ ఒక స్టాండ్ కు తన…

Read More

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జమిలి ఎన్నికల బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో కొందరు ఎంపీలు సభకు రాకపోవటాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణించనుంది.అయితే వారికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.20 మందికిపైగా ఎంపీలు లోక్‌సభకు గైర్హాజరైనట్లు తెలుస్తుంది.ఈ మేరకు జమిలి ఎన్నికల బిల్లులను ప్రవేశపెట్టే సమయంలో తమ పార్టీ ఎంపీలందరూ సభలో ఉండాలని బీజేపీ విప్‌ జారీ చేసింది.అయితే రెండు బిల్లులు ఆమోదం పొందటానికి బీజేపీ ఎంపీల గైర్హాజరు అడ్డంకి కాకపోయినా ప్రభుత్వానికి తగినంత మద్దతు లేదని విమర్శించటానికి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చినట్లు అయిందని బీజేపీ అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. జమిలీ ఎన్నికల కోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ నిన్న లోక్‌సభలో ప్రవేశపెట్టారు.అయితే ఈ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.ఈ క్రమంలోనే ఓటింగ్​ జరపాలని పట్టుబట్టాయి.అయితే బిల్లుపై ఓటింగ్​కు…

Read More

పౌర సరఫరాల శాఖలో గత 5 ఏళ్లలో వైసీపీ వాళ్ళు చేసిన వాటిపైన దృష్టి పెట్టి రాష్ట్రవ్యాప్తంగా సంస్కరణలు తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతూ ఉందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ అన్నారు. మచిలీపట్నంలో జెఎస్ గోడౌన్స్ నుండి ప్రజలకు చెందాల్సిన 4840 బియ్యం బస్తాలు దారి మళ్ళినట్టు విచారణలో నిర్ధారణకు వచ్చిందని పేర్కొన్నారు. పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ కి పాల్పడిన వారికి కనీసం 6 నెలలు జైలు శిక్ష.పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ ని పీడీ యాక్ట్ కిందకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏ పోర్ట్ అయినా, ఏ కంటైనర్ అయినా, ఏ లారీ అయినా అక్రమ రవాణా అవుతున్న పీడీఎస్ రైస్ దొరికింది అంటే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. విచారణలో నిమగ్నమైన పోలీసు వ్యవస్థ, రెవెన్యూ సిబ్బంది, పౌరసరఫరాల సిబ్బంది కలిసి సమన్వయం పని చేస్తున్నారు. ఎందుకు ప్రత్యేకంగా ఈ గోడౌన్ నుండి అవకతవకలు జరిగాయి…

Read More

భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు.ఆస్కార్ (నాటు నాటు పాటకు)సహా పలు ఇంటర్నేషనల్ అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఆ సినిమా తెర వెనుక విశేషాలు చెప్పేందుకు టీమ్ సిద్ధమైంది.’ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ పేరుతో డాక్యుమెంటరీని సిద్ధం చేసింది.తాజాగా ట్రైలర్ విడుదల చేసింది.ఎంపిక చేసిన పలు థియేటర్లలో ఈ డాక్యుమెంటరీ ఈ నెల 20న రిలీజ్ కానుంది.

Read More

అడివిశేష్‌ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న‌ చిత్రం ‘డకాయిట్‌’.ఈ చిత్రానికి షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు.విభిన్న ప్రేమ‌క‌థా చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది.ప్ర‌స్తుతం ఇది చిత్రీక‌రణ ద‌శలో ఉంది.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆస‌క్తిక‌ర అప్‌డేట్‌ను చిత్ర‌బృందం పంచుకుంది.ఇందులో క‌థానాయిక‌గా మృణాల్ ఠాకూర్ న‌టిస్తుంది.ఈ మేర‌కు నిన్న ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్లు షేర్ చేసింది.పోస్ట‌ర్లు షేర్ చేసిన అడ‌వి శేష్‌..‘ప్రేమించావు..కానీ మోసం చేశావు..విడిచిపెట్టను.. తేలాల్సిందే’అని క్యాప్షన్‌ పెట్టారు. దీనికి మృణాల్ స్పందించారు.‘వదిలేశాను..కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను’ అని తెలిపారు.ఈచిత్రానికి కథానాయికగా మొద‌ట శ్రుతి హాస‌న్‌ను ఎంచుకున్నారు.అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆమె సినిమా నుంచి వైదొల‌గారు.ఆమె స్థానంలో ఇప్పుడు మృణాల్‌ను తీసుకున్నారు. Avunu preminchavu..Kaani mosam chesavu..!Idichipettanu..thelchaalsindhe 💥అవును ప్రేమించావు..కానీ మోసం చేసావు..! ఇడిచిపెట్టను…తేల్చాల్సిందే 💥Get ready for #DACOIT ! @mrunal0801 https://t.co/mpLZxzFyFz pic.twitter.com/RpOglgjeE9— Adivi Sesh (@AdiviSesh) December 17, 2024

Read More

దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను భారీ నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు ప్రధాన షేర్లలో అమ్మకాల వలన సూచీలు జోరు తగ్గింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1,064 పాయింట్ల నష్టంతో 82,133 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 332 పాయింట్ల నష్టంతో 24,336 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.91గా ఉంది. ఐటీసీ షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

నితిన్‌ కథానాయకుడిగా , దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాబిన్‌ హుడ్‌’.ఇందులో శ్రీ‌లీల క‌థానాయిక‌గా నటిస్తుంది.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.డిసెంబర్‌ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.తాజాగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.అనుకోని పరిస్థితుల వల్ల దీన్ని వాయిదా వేయాల్సి వచ్చిందంటూ మైత్రీ మూవీస్‌ పోస్ట్‌ పెట్టింది.త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పింది.నితిన్ – వెంకీ కుడుముల కలయికలో వ‌స్తోన్న రెండో చిత్ర‌మిది.గ‌తంలో వీరిద్ద‌రి కలయికలో వచ్చిన “బీష్మ” సినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది.

Read More

అశ్లీల చిత్రాల నిర్మాణం,ప్ర‌సారం చేశార‌నే ఆరోప‌ణ‌ల‌తో ప్ర‌ముఖ వ్యాపార వేత్త రాజ్‌కుంద్రా కొంత‌కాలం పాటు జైలులో ఉండి విడుద‌లైన విష‌యం తెలిసిందే.ఈ కేసును ఉద్దేశించి తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం వెనుక ఎవ‌రున్నారో త‌న‌కు తెలుస‌ని అన్నారు.దీని వెనక కచ్చితంగా ఒకరు ఉన్నారు.ఈ దేశంలో మనం గొప్ప వ్యాపారవేత్తలుగా ఉంటున్నామంటే స్నేహితులతో పాటు శ్రతువులు కూడా ఉంటారు.నాకు వ్యాపార ప్రత్యర్థి ఉన్నారు.నేను పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు కొందరు వ్యక్తులు నన్ను కలిసి అతడి గురించి చెప్పారు.అప్పుడే అతడి గురించి నాకు పూర్తిగా అర్థమైంది.నెమ్మదిగా అన్ని విషయాలు వెల్లడయ్యాయి.ఎంతో బాధపడ్డాను.వారి పేర్లు చెబుతూ సీబీఐకు లేఖ రాశాను.త్వరలోనే విచారణ ప్రారంభిస్తారని ఆశిస్తున్నా.నా పేరును చెడగొట్టాలనే ప్రయత్నంతోనే ఇదంతా చేశారని అర్థమైంది’’ అని అన్నారు.తాను ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి పోర్న్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయలేద‌ని అన్నారు.త‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్ప‌డు మాన‌సిక క్షోభ‌కు గుర‌య్యాన‌ని తెలిపారు.

Read More

మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనకు విచ్చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇక మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో వీరు పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి జీవితం, మనకు ఆదర్శం. సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టి, టీచర్ నుంచి రాష్ట్రపతి వరకు వచ్చారు. క్రమశిక్షణ, కష్టపడే తత్త్వం ఉంటే, ఏమైనా సాధించవచ్చని పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమి, చాలా సుందరమైన ప్రదేశంలో ఇచ్చినట్లు వివరించారు. అమరావతికి, మంగళగిరి ఎయిమ్స్ ఒక సిగలా ఉంటుందని పేర్కొన్నారు. ఈ దేశంలోనే మంగళగిరి ఎయిమ్స్ నంబర్ వన్ అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. డైరెక్టర్, మరొక 10 ఎకరాలు కావాలని అడిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున, వెంటనే ఆ…

Read More

మంచు మోహ‌న్‌బాబు నివాసంలో జ‌రుగుతోన్న గొడ‌వ‌ల్లో రోజు రోజుకీ ట్విస్టులు మారుతున్నాయి.త‌న త‌ల్లి నిర్మ‌ల పుట్టిన‌రోజు నాడు త‌న అన్న‌ విష్ణు ఇంటికి వ‌చ్చాడ‌ని…ఇంట్లోని జ‌న‌రేట‌ర్‌లో పంచ‌దార వేశాడ‌ని ఇటీవ‌ల మ‌నోజ్ ఫ‌హ‌డ్ ష‌రీఫ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే.దీనిపై తాజాగా మ‌నోజ్ త‌ల్లి నిర్మ‌ల సంచ‌ల‌న లేఖ విడుద‌ల చేశారు.విష్ణు అలాంటి ప‌ని చేయలేద‌ని అన్నారు.విష్ణు ఇంటికి వ‌చ్చిన మాట వాస్త‌వ‌మేన‌ని…పుట్టిన‌రోజు కావ‌డంతో సెల‌బ్రేట్ చేసి వెళ్లిపోయాడ‌ని ఆమె తెలిపారు.ఇంట్లో ఉన్న త‌న వ‌స్తువుల‌ను తీసుకువెళ్లాడ‌ని అంతేకానీ జ‌న‌రేట‌ర్‌లో పంచ‌దార వేయ‌డం,ఇంట్లో పనిచేసే ప‌నివాళ్ల‌ను బెదిరించ‌డం వంటి ప‌నులు చేయ‌లేద‌ని ఆమె తెలిపారు.ఈ విష‌యమై ఫ‌హ‌డ్ ష‌రీఫ్ పోలీసుల‌కు లేఖ పంపారు.అంతేకాకుండా త‌న ఇంట్లో చిన్న కొడుకు మ‌నోజ్‌కు ఎంత హ‌క్కు ఉందో పెద్ద కొడుకు విష్ణుకు కూడా అంతే హ‌క్కు ఉంద‌ని అన్నారు.

Read More