ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించిన విషయం విదితమే. కాగా, ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. టీచర్లు- విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కొత్తేమీ కాదు. క్రమం తప్పకుండా గతంలోనుంచీ జరుగుతున్నవేనని సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరు మార్చి, ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టుగా, వాటిని ప్రచార వేదికలుగా మార్చుకుని చంద్రబాబుగారి కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని అన్నారు. వైసీపీ హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లను, విద్యారంగాన్ని ఒకవైపు నాశనం చేస్తూ, అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులను దగాచేసి, మళ్లీ ఇప్పుడు రొటీన్‌గా జరిగే పేరెంట్స్ సమావేశాలపై పబ్లిసిటీ చేయించుకోవడం, ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబుగారు మాత్రమే ఇలాంటివి మోసాలు చేయగలరని విమర్శించారు. వైసీపీ హయాంలో ప్రతి విప్లవాత్మక మార్పులోనూ, అమలు చేసిన ప్రతి సంస్కరణలోనూ పిల్లల…
Author: admin
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు మొదటి టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ విజయవంతంగా జరిగింది. ఈ విమానాశ్రయం దేశ, రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుందని కొత్త అవకాశాలను సృష్టిస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. కనెక్టివిటీని మెరుగు పరుస్తుందని ప్రపంచ విమానయాన కేంద్రంగా భారత స్థానాన్ని బలోపేతం చేస్తుందని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధిలో ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో ఈ విమానాశ్రయం.. ప్రాంతీయ కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తుందని వివరించారు. అలాగే భారత విమానయాన రంగం విస్తరణలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌ను నిర్మించడంలో, అంకితభావంతో నిర్మాణంలో పాల్గొన్న సిబ్బందితో కూడా ఈ సందర్భంగా మాట్లాడినట్లు తెలిపారు. వారి కృషిని ప్రశంసించారు. అదే విధంగా ఈ అద్భుత సంకల్పానికి జీవం పోయడంలో…
దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో నష్టాలు చూశాయి. ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు జోరు తగ్గింది. కొన్ని షేర్లు మద్దతుగా నిలిచాయి. ఇక బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 200 పాయింట్ల నష్టంతో 81,508 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 58 పాయింట్ల నష్టంతో 24,619 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.74గా ఉంది. టాటా స్టీల్, జే.ఎస్.డబ్ల్యూ స్టీల్స్, అదానీ పోర్ట్స్, హెచ్.డి.ఎఫ్.సీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
దేశవ్యాప్తంగా 51 కేంద్రాలలో ఈ నెల 11 వతేదిన ఒకేసారి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 7వ ఎడిషన్ ప్రారంభంకానుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సంవత్సరానికి గాను 54 మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పీ.ఎస్.యూలు, పరిశ్రమల ద్వారా 250 కంటే ఎక్కువ సమస్య సవాళ్లను సమర్పించారు. విద్యార్థుల్లో సవాళ్ళను ఎదుర్కొనే ఆలోచనా దృక్పధాన్ని పెంపొందించడం, కొత్త ఆవిష్కరణలకు అంకురార్పణ చేసే విధంగా ప్రోత్సాహించి వారిలో సృజనాత్మకతను వెలికి తీయడం, వాస్తవ దృక్పధాన్ని విశ్లేషించి సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంతో హ్యాకథాన్ లను నిర్వహిస్తుంటారు.
వైసీపీని గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన మాజీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు ఏపీ నుండి రాజ్యసభ అభ్యర్థిగా కృష్ణయ్యను బీజేపీ ప్రకటించింది.గతంలో ఆయన వైసీపీ తరపున రాజ్యసభకు వెళ్లారు.అయితే ఈఏడాది జరిగిన ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి ఆయన రాజీనామా చేశారు.మరోవైపు హర్యానా నుండి రేఖాశర్మను, ఒడిశా నుండి సుజిత్ కుమార్ ను రాజ్యసభ అభ్యర్థులుగా బీజేపీ నాయకత్వం ఎంపిక చేసింది.వైసీపీకి,రాజ్యసభ సభ్యత్వాలకు ఆర్.కృష్ణయ్యతో పాటు మోపిదేవి వెంకటరమణ,బీద మస్తాన్ రావులు కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.అయితే మోపిదేవి, బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఐదున్నర దశాబ్దాల కుటుంబ పాలనకు తెరదించుతూ దశాబ్దానికి పైగా అనిశ్ఛితిలో ఉన్న పశ్చిమాసియా దేశమైన సిరియాను తిరుగుబాటు దారులు తమ చేతిలోకి తీసుకున్నారు. అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశాన్ని వీడి కుటుంబంతో సహా వెళ్లిపోయారు. కాగా, సిరియా పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ దేశంలో మళ్లీ స్థిరత్వం రావాలని ఆకాంక్షను వ్యక్తం చేసింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. సిరియా ప్రజల ఆకాంక్ష మేరకు అనుగుణంగా శాంతి స్థాపన జరిగే విధంగా రాజకీయ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆదేశ సమగ్రత, ఐక్యత, సార్వభౌమాధికారం కాపాడుకునే విధంగా అక్కడ రాజకీయ పార్టీలు కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సిరియాలోని పరిస్థితుల నేపథ్యంలో అక్కడ భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ వారంతా క్షేమంగానే ఉన్నట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. అక్కడి రాయబార కార్యాలయాన్ని అన్ని వేళలా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నాయి.
బీఆర్ఎస్ నాయకుడు, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చింది.ఆయన జర్మన్ పౌరుడిగా కొనసాగుతూనే తప్పుడు పత్రాలతో ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపింది.తప్పుడు పత్రాలతో 15 ఏళ్ళుగా కోర్టును తప్పుదోవ పట్టించారంటూ చెన్నమనేనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్ట్ కొట్టివేసింది. కోర్టును, ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు 30 లక్షలు జరిమానా విధించింది.వాటిలో రూ.25 లక్షలు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కు, మిగతా 5 లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి నెల రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
నటి సమంత తాజాగా షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇందులో ఆమె నిజమైన ప్రేమ గురించి తెలిపింది. తన పెంపుడు శునకం షాషా ఫోటో షేర్ చేసిన ఆమె.. షాషా ప్రేమ కంటే గొప్ప ప్రేమ మరొక దానిని తాను చూడలేదని అన్నారు. ఇటీవల జరిగిన పరిణామాల రీత్యా ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియా లో అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో వరుస డ్రాలకు తెరపడింది. భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ విజయం సాధించి ముందడుగు వేశాడు. ఇప్పటివరకు మొదటి గేమ్ లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ గెలుపొందగా.. రెండో గేమ్ డ్రా అయింది. మూడో గేమ్ లో భారత యువ కెరటం గుకేశ్ విజయం సాధించి సమం చేశాడు. ఆతర్వాత నుండి వరుసగా 7 డ్రా లతో ఈ ఛాంపియన్ షిప్ సాగింది. మొత్తం 8 గేమ్ లు డ్రా అయ్యాయి.కాగా, తాజాగా జరిగిన 11వ గేమ్ లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ పై గుకేశ్ గెలుపొందాడు. 29 ఎత్తుల్లో గేమ్ ముగించి 6-5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ ఛాంపియన్ షిప్ లో ఇంకా 3 గేమ్ లు ఉన్నాయి. ఇంకా 1.5 పాయింట్లు సాధిస్తే ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్ షిప్ లో విశ్వనాథన్ ఆనంద్ తరువాత టైటిల్ గెలిచిన భారత…
రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. రాజమౌళి దీనిని తెరకెక్కించారు. భారతీయ సినిమా స్థాయిని నలు దిశలకు వ్యాపింప చేసిన చిత్రాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ అనే చిత్రం తెరకెక్కించడం వెనుక అసలు ఏం జరిగింది? కథ ఎలా సిద్ధమైంది? షూటింగ్ ఎక్కడ జరిగింది? అనే అంశాలు తెలుసుకోవాలన్న ప్రేక్షకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని చిత్రబృందం ఒక డాక్యుమెంటరీ సిద్ధం చేసింది.”ఆర్‌ఆర్‌ఆర్ బిహైండ్ అండ్ బియాండ్” పేరుతో దీనిని రూపొందించనున్నారు.వచ్చే ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఓటీటీలో విడుదల చేస్తారా? లేదా మరేదైనా ప్లాట్‌ఫామ్‌లోనైనా విడుదల చేస్తారా? అనేది చెప్పలేదు. The REELS that inspired Millions.The REAL that deserves to be told.𝐑𝐑𝐑: 𝐁𝐞𝐡𝐢𝐧𝐝 & 𝐁𝐞𝐲𝐨𝐧𝐝 – Coming this December 🔥🌊 #RRRBehindAndBeyond #RRRMovie #RRR pic.twitter.com/8qz9sF9fUG— DVV Entertainment (@DVVMovies) December 9, 2024