Author: admin

దక్షిణాది అగ్ర సినీతార సాయి పల్లవితో నటించాలన్న,ఆమెతో డాన్స్ స్టెప్స్ వేయాలన్నా నీరసమొచ్చేస్తుందని నాగ చైతన్య అన్నారు.అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న “ది రానా టాక్ షో” లో ఈ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.లవ్ స్టోరీలోనే సాయి పల్లవితో డాన్స్ చెయ్యాలంటే టెన్షన్ పడ్డాను అంటే…సాయి పల్లవి మాత్రం లేదు చాలా ఈజ్ తో చక్కగా చేసారు అంది.నాగ చైతన్య మాత్రం నువ్వు ఒక్కదానివే నా డాన్స్ ను పోగుతున్నావ్ అంటూ నవ్వేసాడు.అయితే నాగ చైతన్య లో నీకు నచ్చనిది ఏమైనా ఉందా అని రానా సాయి పల్లవిని ఫోన్ లో అడిగితే…సైలెంట్ గా,కూల్ గా ఉంటాడు,ఏదైనా ఇబ్బంది అయినా బయటకి చెప్పడు అది కోపం తెప్పిస్తుందని చైతు గురించి రానా కు సాయి పల్లవి తెలియజేసింది. కాగా చైతన్య మాత్రం నువ్వు నీతో చేసిన చిత్రంలో సాయి పల్లవి తో పాటలు లేకుండా,డాన్స్ లేకుండా…

Read More

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డిగారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు తెలంగాణ వరదల సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించిన రూ.15 లక్షల చెక్కును సీఏం రేవంత్ రెడ్డికి అందజేశారు.విపత్తు సమయంలో సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటిన సిద్ధుజొన్నలగడ్డను సీఏం రేవంత్ రెడ్డి గారు అభినందించారు.

Read More

విలక్షణ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియా ఎక్స్ ఆసక్తికర పోస్టు పెట్టారు.1979లో వచ్చిన ‘కోరికలే గుర్రాలైతే’ చిత్రం గురించి వివరించారు. ఈ చిత్రం తాను తొలిసారిగా యమధర్మరాజుగా నటించిన ఓ సన్నివేశం వీడియో క్లిప్పింగ్ ను పంచుకున్నారు. “కోరికలే గుర్రాలైతే” చిత్రానికి నా గురువు,లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు.ఈ చిత్రానికి జి.జగదీశ్ చంద్ర ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు.తాను పోస్ట్ చేసిన వీడియోలోని సీన్ ఆయన కెరీర్ లోనే విశిష్ట మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు.ఈ చిత్రంలో చంద్రమోహన్,మురళీమోహన్ కలసి నటించారు.ఈ చిత్రం ఎంతో చిరస్మరణీయం నిలిచిపోతుందని చెప్పారు. యముడి పాత్రలో తొలిసారిగా కనిపించడం అద్భుతమైన అనుభూతినిచ్చిందని తెలిపారు.ఈ సన్నివేశం నాకు సవాల్ గా నిలిచింది,అదే సమయంలో సంతోషాన్ని కూడా ఇచ్చిందని చెప్పారు.ఈ సన్నివేశం నా కెరీర్ లోనే ఈ చిత్రం ప్రతిష్ఠాత్మకంగా నిలిచిపోయేలా చేసిందని వ్యాఖ్యానించారు. Korikale Gurralaithe(1979): Directed by my guru, the legendary…

Read More

భారతదేశ రవాణా వ్యవస్థలో సరికొత్త శకానికి కీలక ముందడుగు పడింది. చెన్నై సమీపంలో ఐఐటీ మద్రాస్, భారతీయ రైల్వే శాఖ కలిసి నిర్మించిన 410 మీటర్ల హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ పూర్తయ్యింది. దీనిని ఐఐటీ మద్రాస్ ఆవిష్కార్ హైపర్ లూప్ బృందం, టూటర్ అనే స్టార్టప్ సంస్థ మరియు ఇండియన్ రైల్వే లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ టెక్నాలజీని పరీక్షించడం కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ట్యూబ్ వాక్యూమ్ ద్వారా అయస్కాంత సాంకేతికత ఆధారంగా నడిచే అత్యంత వేగవంతమైన రైలు ఇది. దేశంలో ముంబై-పుణె కారిడార్లో మొదటి హైపర్ లూప్ రైలు సేవలను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఆతర్వాత చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-చండీఘఢ్ మధ్య కూడా హైపర్ లూప్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇక వీటి వలన కలిగే ఉపయోగాలు ముఖ్యంగా ప్రయాణ సమయం బాగా ఆదా అవుతుంది. విద్యుత్ వినియోగం , కాలుష్యం , ఇంధన వినియోగం వంటివి గణనీయంగా తగ్గుతాయి. ఈ…

Read More

బంగ్లాదేశ్‌లోని హిందువుల దుస్థితిపై కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉందని,బంగ్లాదేశ్ లో ఎక్కువ మంది దళితులు & ఇతర బలహీన వర్గాలకు చెందిన వారుపై దాడులు జరుగుతున్న కాంగ్రెస్ మాట్లాడం లేదని విమర్శించారు.ముస్లిం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సంభాల్‌పై నినాదాలు చేస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు.ఈ మేరకు ఆమె మాట్లాడుతూ … విభజన సమయంలో కాంగ్రెస్ చేసిన పొరపాటు వల్ల పొరుగు దేశంలో దళితులు ఇబ్బంది పడుతున్నారని,వారిని భారత్‌కు రప్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆమె కేంద్రాన్ని కోరారు. విభజన సమయంలో బంగ్లాదేశ్ ను బలవంతంగా పాకిస్తాన్‌కు అప్పగించబడిన హిందూ మెజారిటీ ప్రాంతానికి చెందిన వారిలో దళితులు ఎక్కువగా ఉన్నారని…ఇప్పుడు వారంతా బంగ్లాదేశ్‌లో ఉన్నారని అన్నారు.కాంగ్రెస్ విభజన రాజకీయం,కులతత్వం రాజకీయాలకు సామాన్యులు బలి అవుతున్నారు.కాంగ్రెస్,సమాజ్ వాదీ పార్టీలు రెండు నీచమైన రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.దేశ విభజన కూడా కాంగ్రెస్ పాపమే అని అన్నారు.బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ లో…

Read More

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ లో 1-1తో సమంగా నిలిచింది. ఈ పరాజయం అనంతరం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) లో పాయింట్స్ పట్టికలో అగ్రస్థానం నుండి మూడో స్థానానికి పడిపోయింది. వరుసగా రెండు సార్లు తుది పోరుకు అర్హత సాధించిన భారత్ ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియా 60.71 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా 59.26 ఉండగా…57.29 పాయింట్లతో మూడో స్థానంలో భారత్ నిలిచింది. శ్రీలంక 50.00 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్ కు మరో మూడు టెస్ట్ మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఈ…

Read More

గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన బీఏపీఎస్ (బోచానవాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ) వాలంటీర్ల సదస్సులో ప్రధాని మోడీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల సేవలను కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ పలుకుబడిని వారి సేవలు పెంచుతున్నారని అన్నారు. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. రానున్న రెండు దశాబ్దాలు బీఏపీఎస్ వాలంటీర్లకు కూడా కీలకమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావడంలో, సమాజంలో దిగువన ఉన్న వారికి సాధికారత కల్పించడంలో బీఏపీఎస్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ‘సేవా పరమో ధర్మః’ అనేది మన సంస్కృతిలో భాగమని అవి కేవలం పదాలు మాత్రమే కావని మన జీవన విలువలు అని పేర్కొన్నారు. మతం విశ్వాసాల కన్నా సేవకే ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సేవను ఒక వ్యవస్థీకృత పద్దతిలో చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.…

Read More

ఛత్తీస్‌గఢ్‌ లోని బీజాపుర్‌ జిల్లాలో జరిగిన ఈ హత్య తాజాగా సంచలనంగా మారింది.బీజాపుర్‌ జిల్లాకి చెందిన అంగన్వాడీ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు దారుణంగా చంపారు.CRPF క్యాంపు సమీపంలో ఈ దారుణం జరిగింది.అంగన్వాడీ కార్యకర్త అయిన లక్ష్మీని కొందరు వ్యక్తులు ఇంటి నుంచి బయటకు లాక్కెల్లి హత్య చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఆమెను తీసుకెళ్తున్న సమయంలో తన తల్లిని రక్షించేందుకు వచ్చిన కుమారుడిని దారుణంగా కొట్టారని సమాచారం.అతడి ఎదుటే లక్ష్మిని దారుణంగా హత్య చేశారని తెలుస్తుంది.కాగా ఆమెకు గతంలో నక్సలైట్ల నుండి కొన్ని బెదిరింపులు సైతం వచ్చినట్లు సమాచారం.వారే ఈ హత్య చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీనికి కారణం ఆమె పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తుందని నేపంతో హత్య చేసినట్లు తెలుస్తుంది.ఈ హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More

ఏఐ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేలా పాఠ్యప్రణాళికలను రూపొందించి, మెరుగైన సామర్థ్యాలతో గ్రాడ్యుయేట్లను తయారుచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఆంధ్రా యూనివర్సిటీ యాన్యువల్ అల్యూమిని మీట్‌కి గౌరవ అతిధిగా లోకేష్ హాజరు అయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావడానికి అల్యూమిని ప్రముఖులు సహకారం అందించాలని ఈసందర్భంగా లోకేష్ కోరారు. ఎల్అండ్‌టి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, ఎంపీ భరత్, జిఎంఆర్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్ ఎస్ వి ఆదినారాయణరావు తరఫున ఆయన సతీమణి శశిప్రభ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Read More

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు (డే/నైట్) లో భారత్ పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 175 పరుగులకే కుప్పకూలింది. మూడో రోజు 128-5 ఓవర్ నైట్ స్కోర్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మరో 47 పరుగులు మాత్రమే చేయగలిగింది. నితీష్ రెడ్డి 42 (47;6×4, 1×1) టాప్ స్కోరర్. రిషబ్ పంత్ 28 బ్యాటింగ్ (31; 5×4), శుభ్ మాన్ గిల్ 28(30;3×4), యశస్వీ జైశ్వాల్ 24(31;4×4) పర్వాలేదనిపించారు. కే.ఎల్.రాహుల్ (7), విరాట్ కోహ్లీ (11), రోహిత్ శర్మ (6), విఫలమయ్యారు. టెయిలండర్లు అశ్విన్ (7), సిరాజ్(7), హార్షిత్ రాణా (0), బుమ్రా 2 నాటౌట్ కూడా బ్యాట్ ఝళిపించలేదు. దీంతో భారత్ ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కంటే కేవలం 18 పరుగులు…

Read More