Author: admin

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినీ దిగ్గజం, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు సినీ ప్రస్థానానికి 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈనెల 14న సినీ వజ్రోత్సావాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ వెల్లడించారు. విజయవాడ పోరంకి లోని మురళీ రిసార్ట్స్ వేదికగా జరుగనున్న ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. ఎన్టీఆర్ అంతరంగాన్ని ప్రతిబింబించే విధంగా ‘తారకరామం’ పుస్తకాన్ని ఆవిష్కరించినున్నారు. ప్రత్యేక గీతాన్ని విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తిరువనంతపురం, ముంబై, చెన్నై, బెంగళూరులో ఏడాదిపాటు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సావాలు నిర్వహిస్తామని తెలిపారు.

Read More

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీలపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది.కాగా అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌ ఆర్థిక సాయం అందిస్తున్న గ్రూపుతో సంబంధాలు ఉన్నాయని తీవ్ర విమర్శలు చేసింది.భారత్ నుండి కశ్మీర్‌ను వేరు చేయాలనే ఆలోచనలకు ఆ సంస్ధ మద్దతిస్తోందని, సోరోస్ ఫౌండేషన్‌తో కాంగ్రెస్ సంబంధాలు పెట్టుకోవడం భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ సంస్థల ప్రభావాన్ని చూపుతోందని బీజేపీ పేర్కొంది.దేశాన్ని అస్థిర పరచాలనుకునే సంస్థలకు కాంగ్రెస్ మద్దతిస్తోందని వ్యాఖ్యానించింది.ఈ మేరకు నిన్న సోషల్ మీడియా ఎక్స్ లో బీజేపీ వరుసగా పోస్టులు చేసింది.ఎఫ్‌డీఎల్-ఏపీ ఫౌండేషన్‌కు కో-ప్రెసిడెంట్‌గా ఉన్న సోనియా గాంధీ…జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం పొందే సంస్థతో సంబంధాలు పెట్టుకున్నారని బీజేపీ విమర్శలు గుప్పించింది. కశ్మీర్‌ను ప్రత్యేకంగా పరిగణిస్తున్నట్లు ఎఫ్‌డీఎల్-ఏపీ ఫౌండేషన్ ఇంతకుముందే స్పష్టమైన అభిప్రాయాన్ని తెలిపిందని బీజేపీ వ్యాఖ్యానించింది.మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు సోనియా గాంధీ అధ్యక్షురాలిగా కొనసాగుతుండడంతో, జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యానికి…

Read More

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రల్లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “యానిమల్”.గత ఏడాది విడుదల ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.దీనికి సీక్వెల్ గా యానిమల్ పార్క్ తెరకెక్కనున్నట్లు ఇప్పటికే టీమ్ ప్రకటించింది.తాజాగా ఈ చిత్రం గురించి అప్ డేట్ ఇచ్చారు రణబీర్.2027 నుండి ఈ చిత్రం షూట్ ప్రారంభం కానుందని తెలిపారు.యానిమల్ తెరికెక్కించినప్పుడే దీనిని 3 భాగాలుగా తీయాలనుకున్నామని తెలిపారు. అయితే పార్ట్ 2 చాలా స్పెషల్ అని అన్నారు.ఇందులో తాను హీరో,విలన్ గా కనిపించ నున్నానని చెప్పారు.పార్ట్-1 లో రష్మిక హీరోయిన్ గా కనిపించారు.అనిల్ కపూర్ కీలక పాత్ర పోషించారు.ఈ చిత్రం తీవ్ర హింస ప్రోత్సహిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.ఇక ఈ సినిమాపై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వచ్చాయి.

Read More

ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ,సైందవి దంపతులు కొంతకాలం క్రితం విరిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది.తాజాగా వీరిద్దరూ ఒకే స్టేజ్ పై సంగీత ప్రదర్శన ఇచ్చారు.తమ కాంబోలో వచ్చిన పలు హిట్ పాటలను స్టేజ్ పై పాడి ప్రేక్షకులను అలరించారు.దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.వీటిని చూసిన పలువురు నెటిజన్స్ ఇదొక ఎమోషనల్ మోమెంట్ అని కామెంట్ చేస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ కు మేనల్లుడిగా జీవీ ప్రకాష్ కు మంచి గుర్తింపు ఉంది.2013లో ఆయన సైంధవి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతూ ఈ ఏడాది మే నెలలో విడిపోతున్నామని ప్రకటించారు.

Read More

దేశ రాజధాని న్యూఢిల్లీలో రెండు పాఠశాలకు ఈరోజు ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి.దిఎస్పీ ఆర్కే పురం, జీడీ గోయేoక పశ్చిమ విహార్ పాఠశాలలకు ఈరోజు తెల్లవారు జామున స్కూల్ లో బాంబ్ పెట్టమని మెయిల్స్ వచ్చాయి.దీనితో అప్రమత్తం అయిన స్కూల్ సిబ్బంది సెలవు ప్రకటించారు.వచ్చిన విదార్తులను ఇంటికి పంపించేశారు. పోలీసులకు సమాచారం అందించారు.బాంబ్ స్క్వార్డ్ ఆయా స్కూల్స్ లో తనిఖీలు మొదలుపెట్టారు.బాంబ్ బెదిరింపులు ఈ మధ్య దేశంలో చాలా జరుగుతున్నాయి.వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

Read More

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని ప్ర‌స్తుతం హాలీవుడ్‌లో కొన‌సాగుతున్నారు న‌టి ప్రియాంక చోప్రా. కెరీర్ ఆరంభంలో ప్రియాంక ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆమె త‌ల్లి మధు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ప్రియాంక‌కు అస‌లు సినిమాల్లోకి రావ‌డం ఇష్టం లేద‌న్నారు. ‘అప్పట్లో మిస్‌ వరల్డ్‌ పోటీల్లో విజేతగా నిలిచిన ప్రియాంకకు సినిమాల్లో అవకాశాలు వరుస కట్టాయి. కానీ ఆమెకు నటించాలనే ఆసక్తి లేదు.చదువులో కొనసాగుతూ…క్రిమినల్ సైకాల‌జి పూర్తిచేయాల‌నుకుంది.అందుకోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో సినిమాల్లో వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి.చదువులు ఎక్కడికి పోవు, ఒక్క సినిమాలో నటించమని ఆమెపై నేనే ఒత్తిడి తెచ్చాను.ఆ తరవాత ఈ రంగంలో కొనసాగాలా వద్దా అనేది నీ నిర్ణయమని చెప్పాను.నా బలవంతంతో తన మొదటి చిత్రానికి కన్నీళ్లు పెట్టుకుంటూ సంతకం చేసింది అని ఆనాటి రోజులు గుర్తు చేసుకున్నారు.

Read More

బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ బాజ్‌పేయీ న‌టించిన స‌రికొత్త చిత్రం డిస్పాచ్‌. ఈసినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా తాజాగా ఆయ‌న విలేక‌ర్ల స‌మావేశంలో పాల్గొన్నారు. ఇందులో త‌న జీవితానికి సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర విశేషాలు పంచుకున్నారు. తాను ఒక ప‌ల్లెటూరి వాసిన‌ని అన్నారు. బీహార్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఒక రైతు కొడుకు.. ఈరోజు చిత్రపరిశ్రమలో గొప్ప స్థాయిలో ఉన్నాడంటే నమ్ముతారా ఎవరైనా? ఎంతో శ్ర‌మించి.. నా క‌ల‌లు నిజం చేసుకున్నాన‌ని అన్నారు. ‘సత్య’ నా కెరీర్‌ను మ‌లుపు తిప్పిన‌ సినిమా. భికూ మాత్రే పాత్ర నాకు ఎన్నో ప్రశంసల్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత అలాంటి అవ‌కాశాలు నాకు ఎన్నో వ‌చ్చాయి. ఈ మూస ధోరణిలో పాత్రల్ని ఎంచుకోవడానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలనుకున్నా. చాలా మంది దర్శకనిర్మాతలు నేను ఈ పాత్రల్లో నటించడానికి నిరాకరిస్తే డబ్బును ఆఫర్‌ చేశారు. కానీ చిత్రపరిశ్రమలో నేను విలన్‌గా ఉండాలనుకోవట్లేదు అని తెలిపారు.

Read More

భార‌త్‌ను దెబ్బ‌తీసేందుకు పాకిస్థాన్ దేనికి వెన‌కాడ‌టం లేదు. భారత్‌ జైళ్లలో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాదులతో సంప్రదింపులు జరపడం, వారికి కీలక సమాచారాన్ని చేరవేసేందుకు పాకిస్థాన్‌ గూఢచార సంస్థ కొత్త ప‌న్నాగాలు పన్నుతున్న‌ట్లు స‌మాచారం. డ్రగ్స్‌ మత్తు లేదా మానసిక స్థితి సరిగా లేనివారిగా నటిస్తూ కొంతమంది వ్య‌క్తులు భారత్‌లోకి చొరబడుతున్నట్లు జాతీయ మీడియాలో క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌య్యాయి. ఐదారు నెలల్లోనే దాదాపు పది మంది పాకిస్థానీయులు పీవోకే నుంచి భారత్‌లోని ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. వారు జమ్మూ, పంజాబ్‌, రాజస్థాన్‌లలోని జైళ్లలో ఉన్నట్లు చెప్పారు.భారత్‌లోకి చొరబడిన పాకిస్థాన్‌ జాతీయులను ఐఎస్‌ఐ ఏజెంట్లుగా భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఇక్కడి జైళ్లలో ఉన్న పాక్‌ ఖైదీలకు కీలక సమాచారం చేరవేయడమే లక్ష్యంగా వీరు పని చేస్తున్నట్లు సమాచారం. భద్రతా దళాలు అడిగే ప్రశ్నలకు దీటుగా సమాధానమిచ్చి బయటపడే పద్ధతులపైనా వీరు శిక్షణ పొందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు చెబుతున్నారు. మొబైల్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ ఉపయోగిస్తే…

Read More

పశ్చిమాసియా దేశమైన సిరియా తిరుగుబాటు దారుల చేతిలోకి వెళ్లింది. ఐదున్నర దశాబ్దాల కుటుంబ పాలనకు ఆదేశ ప్రజలు ముగింపు పలికారు. తిరుగుబాటు దారులు సిరియా రాజధాని డమాస్కస్ లో ప్రవేశించడంతో అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశాన్ని వీడారు. దీంతో పూర్తిగా తిరుగుబాటు దారుల చేతిలోకి వెళ్లింది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. నిరంకుశ పాలన పోయిందని హార్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు బషర్-అల్-అసద్ కుటుంబంతో పాటు సిరియా వదిలి రష్యాకు శరణార్థిగా వెళ్లిపోయారు. డమాస్కస్ లోని అధ్యక్ష భవనం లూటీకి గురైంది. పలువురు భవనం లోకి చొరబడి చేతికందినవి పట్టుకు పోయారు. పోలీసులు, సైనికులు తమ స్థావరాలను విడిచి వెళ్లారు. గత కొన్నేళ్లలో లెబనాన్ కు వలస వెళ్ళిన అనేకమంది సిరియన్లు తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిరియా ప్రధాని మహామ్మద్ ఘాజీ జలాలీ స్పందిస్తూ ప్రతిపక్షాలకు అధికార బదిలీ…

Read More

తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి రూపం మార్పు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.దీనిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కేసీఆర్ మొదటిసారిగా స్పందించారు.ఈరోజు ఎర్రవల్లి ఫాంహౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో భేటి అయిన కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్పు అవివేకంతో కూడిన చర్య అని అన్నారు.ప్రజా సమస్యలు పట్టించుకోవాల్సిన ప్రభుత్వం…మూర్ఖత్వంతో ఇలా విగ్రహం మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని కేసీఆర్ విమర్శించారు.

Read More