గతేడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత గాయం వలన క్రికెట్ కు దూరంగా ఉన్న భారత స్టార్ పేసర్ మహామ్మద్ షమీ జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు. దేశవాళీ క్రికెట్లో ఆడి ఫిట్ నెస్ నిరూపించుకున్న షమీ ప్రస్తుతం సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో ఆడుతూ సత్తా చాటుతున్నాడు.బెంగాల్ తరపున ఆడుతున్నాడు. కాగా, భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి రెండు టెస్టులకు షమీ అందుబాటులో ఉండనున్నాడు. త్వరలోనే ఆస్ట్రేలియా పయనమవనున్నాడు. షమీ రాకతో భారత పేస్ దళం మరింత పటిష్టం కానుంది.
Author: admin
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం ఈనెల 15న జరగనుంది. ఇక ఈ వేలంలో 120 మంది ప్లేయర్లు అందుబాటులో ఉండనున్నారు. వీరిలో 91 మంది స్వదేశీ ప్లేయర్లు కాగా మిగిలిన 29 మంది విదేశీ ప్లేయర్లు. మొత్తం 19 మందినే ఈ పూల్ నుండి ఫ్రాంచైజీలు ఎంచుకోనున్నాయి. వేలంలో ఉన్న వారిలో 82 మంది అరంగ్రేటం చేయని భారత ప్లేయర్లు. ఇక ఈ వేలంకు సంబంధించి అన్ని టీమ్ ల కంటే గుజరాత్ జెయింట్స్ దగ్గర ఎక్కువ డబ్బు (రూ4.4 కోట్లు) ఉంది. ఆ టీమ్ ఇద్దరు విదేశీ ప్లేయర్లు సహా నలుగురిని ఎంపిక చేసుకోవచ్చు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ లో నాలుగు ఖాళీలు ఉండగా..యూపీ వారియర్స్ ముగ్గురిని తీసుకోవాల్సి ఉంది.
కృష్ణాజిల్లా పోరంకిలో జరిగిన ఎనర్జీ ఎఫిషియన్సీపై ఉర్జావీర్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో ఇంధన శాఖకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. తలసరి విద్యుత్ వినియోగం రాష్ట్ర ప్రగతికి చిహ్నం అని పేర్కొన్నారు. 1998లో విద్యుత్ సంస్కరణలు తీసుకు వచ్చినట్లు తెలిపారు. అప్పట్లో రైతులు, పారిశ్రామిక వేత్తలు, గృహ యజమానులు అనేక ఇబ్బందులు పడేవారు నుండి అయితే 2004కు మనం మిగులు విద్యుత్ కు చేరుకున్నామని వివరించారు. ఎల్.ఈ.డీలు, ట్యూబ్ లైట్లతో గ్రామాల్లో వెలుగులు నింపామని తెలిపారు. అప్పుడు చేసిన పనులు వలన రాష్ట్ర విద్యుత్ శాఖ అనేక అవార్డులు పొందిందన్నారు. 15 రోజులు క్రితం పిలుపునిస్తే 12 వేల మంది ఉర్జావీర్ లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. కొందరు ఆపరేషన్ కూడా ప్రారంభించారని ఒక్కో ఉర్జావీర్ కు రూ.2500 నుండి…
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో వరుసగా 7వ గేమ్ కూడా డ్రా గానే ముగిసింది. ఇప్పటివరకు మొదటి గేమ్ లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ గెలుపొందగా.. రెండో గేమ్ డ్రా అయింది. మూడో గేమ్ లో భారత యువ కెరటం గుకేశ్ విజయం సాధించి సమంగా నిలిచాడు. ఆతర్వాత నుండి వరుస డ్రా లతో ఈ ఛాంపియన్ షిప్ సాగుతోంది. తాజాగా జరిగిన 10వ గేమ్ కూడా డ్రాగానే ముగిసింది. దీంతో మొత్తం 8 గేమ్ లు డ్రా అయ్యాయి. తాజా గేమ్ లో 34 ఎత్తుల తర్వాత గేమ్ డ్రా గా ముగిసింది. వరుసగా 7 గేమ్ లను డ్రాగా ముగించి చెరో 5 పాయింట్లతో ఇరువురు సమానంగా కొనసాగుతున్నారు. ఈ ఛాంపియన్ షిప్ లో ఇంకా 4 గేమ్ లు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా నేడు మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిరువురూ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం పూర్తయిన తర్వాత చంద్రబాబు తిన్న ప్లేట్ ను నారా లోకేశ్ తీయడం సోషల్ మీడియాలో వైరలయింది. దీనిపై లోకేష్ తల్లి, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. ఈమేరకు ఆమె ‘ఎక్స్’ లో అందుకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. “వెల్ డన్ లోకేశ్… చంద్రబాబు గారు తిన్న ప్లేట్ ను నువ్వు తీయడం, భోజన అనంతరం శుభ్రం చేస్తున్న సిబ్బందికి సాయపడడం… తల్లిదండ్రుల పట్ల నీకున్న అత్యంత గౌరవాన్ని చూపడమే కాదు, నిత్యం మనతో ఉండే వారి పట్ల ఎంతటి విధేయతను కలిగి ఉన్నావో ఈ పనితో స్పష్టమవుతోంది నిజంగా ఇది స్ఫూర్తిదాయకం అంటూ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం మంజూరు చేసింది. ఇప్పుడు ప్రకటించిన 8 కేంద్రీయ విద్యాలయాలు అనకాపల్లి, చిత్తూరులోని వలసపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లె, రొంపిచర్ల, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, నూజివీడు, నంద్యాల జిల్లాలోని డోన్‌లో రానున్నాయి. కాగా, ఈ మధ్యనే తిరుపతి ఐఐటీకి ఒకటి మంజూరు చేసారు. దీంతో మొత్తం 9 కేంద్రీయ విద్యాలయాలు రానున్నాయి. నాణ్యమైన విద్యాప్రమాణాలకు పేరొందిన కేంద్రీయ విద్యాలయాలు ప్రస్తుతం ఏపీలో 35 ఉండగా… వీటిల్లో 6594 మంది ఎస్సీ, 1476 మంది ఎస్టీ, 96 మంది దివ్యాంగ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన 9తో కలిపితే మొత్తంగా ఏపీలో కేంద్రీయ విద్యాలయాల సంఖ్య 44కు చేరింది. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. నాణ్యమైన విద్యను, ప్రత్యేకించి అట్టడుగు వర్గాలకు మరియు వికలాంగ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం…
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు (డే/నైట్) లో భారత్ ఎదురీదుతోంది. రెండో రోజు ఆటలో కూడా ఆస్ట్రేలియా దూకుడు ప్రదర్శిస్తూ భారత్ పై స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 337 పరుగులు చేసింది. భారత్ 180 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియాకు 157 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్ 140(141; 17×4, 4×6) సెంచరీతో కదంతొక్కాడు. లబుషేన్ 64(126;9×4) రాణించాడు. మెక్స్వీనీ (39) పర్వలేదనిపించాడు . దీంతో ఆసీస్ మంచి ఆధిక్యం కనబరిచ గలిగింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, సిరాజ్ 4 వికెట్లు, అశ్విన్, నితీష్ రెడ్డి ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 128 పరుగులు…
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశం నిర్వహించారు.బాపట్ల మున్సిపల్ పాఠశాల్లో నిర్వహించిన తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశానికి సీఎం చంద్రబాబు,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.ఈ మేరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లతో సరదాగా గడిపారు.సీఎం చంద్రబాబు,మంత్రి లోకేష్ ఈ హైస్కూల్లో టగ్ ఆఫ్ వార్ ఆటలోనూ పాల్గొన్నారు. చంద్రబాబు ఓవైపు తాడును పట్టుకోగా… నారా లోకేశ్ మరోవైపు తాడును పట్టుకుని బలప్రదర్శన చేశారు.చంద్రబాబు లాగిన వైపే మొగ్గు కనిపించింది.దీనితో అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున నేడు తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాగా, బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సీఎం మాట్లాడారు. వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు. తర్వాత తల్లిదండ్రులు, పూర్వవిద్యార్థుల సూచనలు, సలహాలు విన్నారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుండే ప్రారంభం కావాలని అన్నారు. పిల్లల చదువులు తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు.ప్రైవేటు స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలని తయారు చేసి, మన పిల్లలని ప్రయోజకులని చేసే బాధ్యత మా ప్రభుత్వానిది.మన ముందు ఉన్న టెక్నాలజీ, అవకాశాలతో ఏదైనా సాధ్యం. కొత్త విషయాలు నేర్చుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలని సూచించారు.పిల్లలు స్కూలు రాకపోతే ఫోన్‌కు మెసేజ్ వచ్చే ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షా ఫలితాలు, ఆరోగ్య విషయాలు కూడా తల్లిదండ్రుల ఫోన్‌కు…
కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో పేరెంట్ – టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పాఠశాల తరగతి గదులను, విద్యార్థినులు వేసిన రంగవల్లులు పరిశీలిస్తూ, విద్యార్ధిని, విద్యార్థులతో ముచ్చటించి, వారు సృష్టించిన సైన్స్ పరికరాల వివరాలను స్వయంగా ఆయన తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే శ్రీమతి మాధవి రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య, జిల్లా అధికార యంత్రాంగం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కడపని ఎందుకు ఎంచుకున్నాను అంటే, ఇది ఎక్కువ గ్రంధాలయాలు ఉన్న నేల ఇది అని చదువుల నేల కడపని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చిత్తశుద్దిగా ఉందని పిల్లల తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టాలి.తీరని సమస్యలు తీర్చే బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. అధ్యాపకులకు ఎక్కువ జీతం వచ్చే రోజు రావాలని ఎంత వరకు సాధ్యమో తెలీదు కానీ నేనైతే ప్రయత్నం చేస్తానని చెప్పారు.పౌష్టికాహారం పిల్లలకే కాదు, అధ్యాపకులకు అందాలి. హీరోలని సినిమాల్లో…