Author: admin

న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. టెస్టు క్రికెట్ ఫార్మాట్ లో 5 లక్షల పరుగులు చేసిన మొదటి జట్టుగా అవతరించింది. 147 ఏళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి జట్టు ఇంగ్లాండ్. ఇక ఇది ఇంగ్లాండ్ కు 1087వ టెస్టు. పరుగుల పరంగా ఆస్ట్రేలియా 4,28,868 పరుగులు, భారత్ 586 టెస్టులలో 2,78,751 పరుగులతో రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక వెల్లింగ్టన్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు విజయం వైపు పయనిస్తోంది. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 280 పరుగులకు ఆలౌటయింది. అయితే న్యూజిలాండ్ 125 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో 378-5 పటిష్ట స్థితిలో నిలిచింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి 533 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Read More

ప్రతీ ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని ఎక్స్ లో పోస్ట్ చేశారు.భారత్‌తో సహా పలు దేశాలు తీర్మానాన్ని ప్రతిపాదించగా…ప్రతీ ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే సమగ్ర,శ్రేయస్సు,అంతర్గత పరివర్తన కోసం డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకునేందుకు భారత్‌తో పాటు మరికొన్ని దేశాలు ఈ తీర్మానం చేసాయి.వీటిని ఐక్యరాజ్య సమితి ఏకగ్రీవంగా ఆమోదించింది.డిసెంబర్ 21 చాలా పవిత్రమైన రోజు అని.. యావత్తు ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ పాటుపడుతుందని అన్నారు.వసుదైక కుటుంబం అనే నాగరికత నుండి భారత్ వచ్చిందని హరీష్ పర్వతనేని వ్యాఖ్యానించారు. A day for comprehensive well being and inner transformation! Glad that India…

Read More

ఢిల్లీలోని భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోడీ ‘అష్టలక్ష్మీ మహోత్సవం’ ను ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ హస్తకళలు, మరియు జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెంచడం మరియు పర్యాటక రంగంలో ఆర్థిక అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ‘అష్టలక్ష్మీ మహోత్సవం’ నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 6 నుండి 8 వరకు జరుగుతోంది. కాగా, ఈశాన్య రాష్ట్రాల కోసం కేంద్రం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను వాజ్ పేయి ప్రభుత్వమే మొట్టమొదటిగా ప్రారంభించినట్లు తెలిపారు. ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి శాఖ నుండి 20 శాతం నిధులను కూడా కేటాయించినట్లు తెలిపారు. దశాబ్ధ కాలంలో 700 సార్లు ఈశాన్య రాష్ట్రాలలో పర్యటించారని పేర్కొన్నారు. అక్కడి ఆర్థిక వ్యవస్థ, ప్రజల మనోభావాలు, ఎకోలజీతో అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. దేశ ప్రగతిలో భాగమయ్యే విధంగా తమ నేతృత్వంలోని ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.హైదరాబాద్, ముంబై,…

Read More

సికింద్రాబాద్‌-విల్లుపురం-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటన చేసింది.కాగా రైలు నెం.07601 సికింద్రాబాద్‌-విల్లుపురం ప్రత్యేక రైలు ఈ నెల 12న సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 7.40 గంటలకు బయల్దేరి తర్వాత రోజు మధ్యాహ్నం 1.05 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు నెం.07602 విల్లుపురం-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 13న విల్లుపురంలో సాయంత్రం 4.05 గంటలకు బయల్దేరి తర్వాత రోజు ఉదయం 9.40 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.ఈ రైలు తిరువణ్ణామలై, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు మీదుగా ప్రయాణిచనుంది.ఈ రైళ్ల రిజర్వేషన్‌ నిన్నటి నుండి ప్రారంభమైంది అని అధికారులు తెలిపారు.

Read More

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘు రామకృష్ణ రాజుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక పదవి ఇచ్చింది.ప్రస్తుతం ఆయన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు.అయితే రఘు రామకృష్ణ రాజు కేబినెట్ ర్యాంకు హోదా కల్పిస్తూ…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ క్రమంలో గవర్నమెంట్ పొలిటికల్ సెక్రెటరీ సురేష్ కుమార్ ప్రకటన చేశారు. రఘురామ కృష్ణంరాజు 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఉండి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పీ.వీ.ఎల్. నరసింహరాజుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. వైఎస్ఆర్ సీపీ పార్టీలో ఉన్నప్పుడే ఆయన్ని అదే ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసింది.రఘరామ కృష్ణం రాజు ఎన్నికల కంటే ముందు టీడీపీ లోకి వచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గంలో ఉన్న మంత్రులకు ఏయే సదుపాయాలు ఉంటాయో అవే సదుపాయాలు ఇప్పటి నుండి రఘు రామ కృష్ణం రాజుకు ఉండనున్నాయి.

Read More

ఉష్ణోగ్రతలు భారీ స్థాయికి పడిపోవడంతో విశాఖపట్నం ను పొగమంచు కమ్మేసింది.ఈరోజు ఉదయం పొగమంచు కారణంగా విశాఖపట్నం ఎయిర్ పోర్టులో విమానాల ల్యాండింగ్ కు సమస్య తలెత్తింది.లైట్ సరిగా లేకపోవడంతో ల్యాండింగ్ కు ఇబ్బంది కలగడం వలన పలు విమానాలను దారి మళ్లించారు.నిబంధనల మేరకు లైట్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ పోర్టు డైరెక్టర్ రాజారెడ్డి వెల్లడించారు.ఢిల్లీ – విశాఖపట్నం ఫ్లైట్‌ను భువనేశ్వర్ వైపు, హైదరాబాద్ -విశాఖపట్నం, బెంగళూరు- విశాఖపట్నం విమానాలను హైదరాబాద్ వైపు మళ్లించినట్లు వివరించారు. ప్రయాణికులు ఈ అంశాన్ని గమనించి, సిబ్బందికి సహకరించాలని ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

Read More

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది.ఈ మేరకు ప్రజలు ఇళ్ల నుండి భయంతో బయటకు పరుగులు తీశారు.ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు అయ్యింది.ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో చాలా మంది గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.మండి నగరాన్ని భూకంపం తాకింది.ఈ నేపథ్యంలోనే ఒకదాని తర్వాత ఒకటిగా 3 బలమైన ప్రకంపనలు వచ్చాయి.ప్రకంపనల భయంతో ప్రజలు పిల్లలు, కుటుంబాలతో సహా వీధుల్లోకి వచ్చారు.

Read More

రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం పట్ల ఏపీసీసీ చీఫ్ షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడ ?‌అని ప్రశ్నించారు. బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్ పై ఎందుకు పెట్టలేక పోతున్నారు? అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా ? మాజీ ముఖ్యమంత్రి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే , నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీది కాదా? మీరు కూడా అదానీకి అమ్ముడుపోయారా? తీగ లాగితే మాజీ ముఖ్యమంత్రితో పాటు, అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? నోరు విప్పకుండా, విచారణ చేయకుండా మౌనంగా ఉండేందుకు అదానీ మీకు ఎంత లంచాలు ఆఫర్ చేశారు? అంటూ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా.. SECIతో చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి…

Read More

సాయి దుర్గ తేజ్ కథానాయకుడిగా,కొత్త దర్శకుడు రోహిత్ దర్శకత్వంలో #SDT18 అనే చిత్రం తెరకెక్కుతుంది.సాయి తేజ్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది.అయితే చిత్రాన్ని ‘హనుమాన్’ నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.తాజాగా చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది. ఇందులో కీలక పాత్రలలో నటిస్తున్న జగపతి బాబు, సాయి కుమార్ ల పోస్టర్లను ఇప్పటికే చిత్రబృందం విడుదల చేసింది.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కీలక పోస్టర్ ను విడుదల చేశారు.ఈ పోస్టర్ లో కేవలం సాయి ధరమ్ తేజ్ చేతిని, రక్తంతో తడిసిన ఖడ్గాన్ని చూపించారు.అయితే డిసెంబర్ 12న మరో కీలక అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలిపింది.ఈ చిత్రానికి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. See you on Dec 12th 😊#SDT18Carnage pic.twitter.com/5Dnu8mzTIg— Sai Dharam Tej…

Read More

బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా – భారత జట్ల మధ్య అడిలైడ్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా అరుదైన ఘ‌న‌త అందుకున్నాడు.ఈ ఏడాది టెస్టుల్లో 50 వికెట్లు ప‌డ‌గొట్టిన మొదటి బౌల‌ర్‌గా నిలిచాడు. నిన్న ఆసీస్ ఇన్నింగ్స్ లో భాగంగా ఓపెనర్ ఉస్మాన్ ఖ‌వాజాను ఔట్ చేయ‌డం ద్వారా 50 బూమ్రా వికెట్లు పూర్తి చేసుకున్నాడు.ఈ సంవత్సరం ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 11 టెస్టులు ఆడిన బుమ్రా 50 వికెట్లు తీశాడు.కాగా ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో 50 లేదా అంత‌కంటే ఎక్కువ వికెట్లు సాధించిన 3వ భార‌త పేస్ బౌల‌ర్‌గా అత‌డు చరిత్ర సృష్టించాడు. బుమ్రా కంటే ముందు మాజీ పేస‌ర్లు క‌పిల్ దేవ్‌,జ‌హీర్ ఖాన్ ఈ ఘ‌న‌త అందుకున్నారు.1979లో క‌పిల్ 17 మ్యాచులు ఆడి 74 వికెట్లు తీశాడు.1983లో 18 టెస్టుల్లో 75 వికెట్లు ప‌డ‌గొట్టాడు.ఇక జ‌హీర్ ఖాన్ 2002లో 15 మ్యాచుల్లో 51…

Read More